Vande Mataram Bill 2026 | రాజ్యసభ ముందుకు వందేమాతరం బిల్లు.. విపక్షాల అభ్యంతరం
Vande Mataram Bill 2026 | వందేమాతరం బిల్లును (Vande Mataram Bill 2026) కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ (Rajya Sabha) ముందుకు తీసుకెళ్లింది. ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
Vande Mataram Bill 2026 | జాతీయ గీతం ‘జనగణమన..’ స్థాయిలో జాతీయ గేయం వందేమాతరానికి చట్టపరమైన రక్షణలు కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. వందేమాతరం బిల్లును (Vande Mataram Bill 2026) కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ (Rajya Sabha) ముందుకు తీసుకెళ్లింది.
సభ ప్రారంభం కాగానే హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ (Nityanand Rai) ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అయితే, ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లు వ్యక్తిగత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని ఆరోపించాయి. ఈ క్రమంలో సభలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభ్యుల ఆందోళన మధ్య సభ సోమవారానికి వాయిదా పడింది.
వందేమాతరాన్ని పాడుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా అంతరాయం కలిగించడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించేలా ఈ బిల్లును సవరణ చేశారు. ఈ చట్టం ప్రకారం.. జాతీయ జెండా, రాజ్యాంగం వంటి జాతీయ చిహ్నాలను అవమానించినా లేదా ఆటంకం కలిగించినా, అగౌరపరిచినా నేరంగా పరిగణించి, గరిష్ఠంగా మూడేండ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. లేదంటే రెండూ విధించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఈ గేయాన్ని ఎక్కడ ఆలపించినా కేవలం కొన్ని చరణాలనే పాడకుండా పూర్తి గేయాన్ని ఆలపించేలా నిబంధనను కూడా ఇందులో చేర్చారు. ‘వందేమాతరం’ 150వ వార్షికోత్స వేడుకలు ఏడాది పొడవునా కేంద్రం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ గీతం జనగణమణకు ఉన్నట్టే జాతీయం గేయమైన వందేమాతరంనకు కూడా చట్టపరమైన రక్షణ కల్పించడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.
సంబంధిత వార్తలు

Lok Sabha | ప్రధాన్‌ను తొలగించండి.. పార్లమెంట్‌లో ప్రతిపక్షాల డిమాండ్.. లోక్‌సభ సోమవారానికి వాయిదా
జులై 24, 2026

Black Corridors | జాతీయ రహదారులపై మృత్యు ఘంటికలు.. మూడేళ్లలో 37 వేల మంది మృతి
జులై 23, 2026

Kiren Rijiju | యువతకు సంబంధించిన అంశం.. రాజకీయం చేయొద్దు : కిరణ్ రిజుజు
జులై 23, 2026
తాజావార్తలు
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన



