Rakesh Reddy | ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి బొంద పెట్టే ప్రయత్నం : రాకేశ్ రెడ్డి
Rakesh Reddy | రాష్ట్రంలో విద్యా శాఖ పరిస్థితి దారుణంగా తయారైందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టినప్పటికీ, దాన్ని కేసీఆర్ కొనసాగించారని గుర్తు చేశారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ పథకాన్ని బొందపెట్టే ప్రయత్నం చేస్తోందని రాకేశ్ రెడ్డి ధ్వజమెత్తారు.
Rakesh Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో విద్యా శాఖ పరిస్థితి దారుణంగా తయారైందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టినప్పటికీ, దాన్ని కేసీఆర్ కొనసాగించారని గుర్తు చేశారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ పథకాన్ని బొందపెట్టే ప్రయత్నం చేస్తోందని రాకేశ్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో గురువారం రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో సుమారు 2 వేల పాఠశాలలు మూతపడ్డాయి. యూనివర్సిటీల భూములను అమ్ముతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో చెల్లించకపోవడంతో ప్రయివేటు కాలేజీలు మూతపడుతున్నాయి. మూసీ కోసం, ఫ్యూచర్ సిటీ అంటూ ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది. ఎవరి ఫ్యూచర్ కోసం సీఎం రేవంత్ రెడ్డి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆయన నిలదీశారు.
ఆటోను వాడినట్టు హెలికాప్టర్‌ను వాడుతున్నారు
ఆటోను వాడినట్టు మంత్రులు హెలికాప్టర్‌ను వాడుతున్నారు. మీ సోకులకు, అందాల పోటీలకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. తన మనుమడు సరదా కోసం ఫుట్ బాల్ మ్యాచ్‌కు వంద కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తానికి రేవంత్ రెడ్డి కాస్ట్లీ మినిస్టర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దర్జాలకు పెట్టే ఖర్చుతో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వొచ్చు అని రాకేశ్ రెడ్డి అన్నారు.
ఇంజినీరింగ్ కాలేజీలు సైతం మూసివేత..!
రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్వీ పోరాటం చేస్తోంది. అన్ని విద్యార్ధి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నాం. రాష్ట్రంలో సగం జూనియర్ కాలేజీలు, డిగ్రీ, పీజీ కాలేజీలు మూతపడ్డాయి. ఇంజినీరింగ్ కాలేజీలు సైతం మూతపడుతున్నాయి. పాత బకాయిలతో సంబంధం లేదని ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి అయినా అంటారా...? అని ప్రశ్నించారు.
జెన్ జీ లాంటి ఉద్యమాలు తప్పవు
నేరుగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పడం అంటే ఎగనామం పెట్టడమే. పబ్లిసిటీ తప్ప ప్రభుత్వం పని మాత్రం జీరో. ఆకునూరి మురళీ లాంటి మేధావులు ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఉపయోగం లేదని చెప్పారు. ప్రభుత్వాలపై అసంతృప్తితో కాక్రోచ్ లాంటి పార్టీలు వస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు చేస్తే రాష్ట్రంలో జెన్ జీ లాంటి ఉద్యమాలు వస్తాయని రాకేశ్ రెడ్డి హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జులై 18, 2026

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
జులై 18, 2026

Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
జులై 18, 2026
తాజావార్తలు
- ●Parliament Session | రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. మళ్లీ సభ ముందుకు ఆ రెండు బిల్లులు!
- ●Amarnath Yatra | భక్తులు రావొద్దు.. అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. మళ్లీ ఎప్పుడంటే?
- ●MBBS | ఎంబీబీఎస్‌లో సీనియర్ సిటిజన్లకు రిజర్వేషన్లు ఎందుకు లేవు?.. హైకోర్టును ఆశ్రయించిన 71 ఏండ్ల నీట్ అభ్యర్థి
- ●Road Accident | లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం
- ●Weekly Horoscope | ఈరాశివారు ఆశించిన ఫలితాలు పొందుతారు.. ఆ పనులకు దూరంగా ఉంటే మంచింది!
- ●ISRO Apprentice | ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో అప్రెంటిస్‌లు.. రాత పరీక్ష లేకుండానే..

Parliament Session | రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. మళ్లీ సభ ముందుకు ఆ రెండు బిల్లులు!

Amarnath Yatra | భక్తులు రావొద్దు.. అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. మళ్లీ ఎప్పుడంటే?

MBBS | ఎంబీబీఎస్‌లో సీనియర్ సిటిజన్లకు రిజర్వేషన్లు ఎందుకు లేవు?.. హైకోర్టును ఆశ్రయించిన 71 ఏండ్ల నీట్ అభ్యర్థి

Road Accident | లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం



