Supreme Court | ఏం చర్యలు తీసుకున్నారు..? ఢిల్లీ, లక్నో అగ్నిప్రమాదాలపై అధికారులకు సుప్రీంకోర్టు అల్టిమేటం
Supreme Court | దేశరాజధాని ఢిల్లీ హోటల్ (Delhi Hotel Fire), లక్నో కోచింగ్ సెంటర్‌లో (Lucknow Coaching centre Fire) అగ్నిప్రమాదాలపై సంబంధిత అధికారులకు సుప్రీంకోర్టు (Supreme Court) అల్టిమేటం జారీ చేసింది. ఆయా ఘటనల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది. చర్యలు తీసుకున్నట్లు కనిపించకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది.
Supreme Court | త్రినేత్ర.న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీ హోటల్ (Delhi Hotel Fire), ఉత్తరప్రదేశ్ లక్నో కోచింగ్ సెంటర్ (Lucknow Coaching centre Fire)లో అగ్నిప్రమాద ఘటనలను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR) సహా ఇతర నగరాల్లో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని సంబంధిత సివిల్ అధికారులను కోర్టు ఆదేశించింది. క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని తీవ్రంగా హెచ్చరించింది.
అధికారులపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు..
అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఓ కేసుపై జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఢిల్లీ, లక్నో అగ్ని ప్రమాదం, సాకేత్ ప్రాంతంలో భవనం కూలిన ఘటనలను ధర్మాసనం ప్రస్తావించింది. ఆయా ఘటనల్లో అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని తాము ఆశించామని పేర్కొంది. కానీ అక్కడ అలాంటిది జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు సివిల్ అధికారులపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అధికారులు తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం బిల్డర్లు, ఇతరులను మాత్రమే అరెస్టు చేస్తున్నారని.. ఇలాంటి ఘోరమైన ఘటనకు బాధ్యులైన అధికారులపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని వ్యాఖ్యానించింది.
ఎలాంటి చర్యలు తీసుకున్నారు..?
జూన్ 3న ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో ఓ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది మరణించిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా ఈ ఘటనను ప్రస్తావిస్తూ.. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎమ్‌సీడీ ప్రవర్తన తమను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని పేర్కొంది. మాలవీయ నగర్ అగ్నిప్రమాదం ఘటన విషయంలో సంబంధిత పౌర అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కోర్టు కోరింది.
సర్వే చేపట్టండి..
అదేసమయంలో ఢిల్లీలోని లాజ్‌పత్ నగర్, సాకేత్, సరోజినీ నగర్ ప్రాంతాల్లో సర్వే నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఇందుకోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సర్వే అనంతరం నివేదికను ఆ కమిటీ కోర్టుకు సమర్పిస్తుందని తెలిపింది. ఇక యూపీ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో కూడా ఇలాంటి సర్వేనే చేపట్టాలని కోర్టు ఆదేశించింది.
వరుస ప్రమాదాలు..
కాగా, జూన్ 3న ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో ఓ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. దక్షిణ ఢిల్లీలోని హౌజ్ రాణి (Hauz Rani) ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే ఏరియాలో ఈ 'ఫ్లోరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్' (Flourish Stay B&B) హెటల్‌లో జరిగిన ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో విదేశీయులే ఎక్కువ మంది. హోటల్ ఒక మృత్యుకూపమని, నిబంధనలను గాలికి వదిలేసి అక్రమంగా నడిపిన వ్యవహారం దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీ హోటల్ ప్రమాద ఘటన మరవకముందే జూన్ 22న ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాజధాని లక్నోలో (Lucknow)లోని అలీగంజ్ ప్రాంతంలో ఉన్న ఓ కోచింగ్ సెంటర్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మేలో దక్షిణ ఢిల్లీలోని సాకేత్‌లో గల సైదులాజాబ్‌లో ఓ బహుళ అంతస్తుల భవనం కూలిపోయి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆయా ఘటనల్లో నిబంధనల ఉల్లంఘనే కారణమని దర్యాప్తులో తేలింది.
Also Read..
క్రీడల్లో ఎందుకు వెనకబడ్డమో యువత ఆలోచించాలి
భారీ పతనం అనంతరం.. కాస్త కోలుకున్న స్టాక్ మార్కెట్లు, తగ్గిన చమురు ధరలు..
ఆరోగ్యంగా ఉన్నా గుండెపోటు ఎందుకు వస్తోంది?.. 17 ఏళ్ల వయసు నుంచే ఈ బేసిక్ బ్లడ్ టెస్టులు తప్పనిసరి
సంబంధిత వార్తలు

Art of Living | ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు భారీ ఊరట.. ఆ రూ.5 కోట్లు తిరిగిచ్చేయాలంటూ సుప్రీం ఆదేశం
ఆగస్టు 22, 2026

Supreme Court | సుప్రీంకోర్టులో ఒక్కరోజే 400 కేసులకు పరిష్కారం
ఆగస్టు 22, 2026

Supreme Court | ఏడాది ప్రాక్టీస్ చేస్తే చాలు న్యాయసేవలోకి.. యువ న్యాయవాదులకు సుప్రీంకోర్టు ఊరట..!
ఆగస్టు 21, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయండి
- ●Python Jodie Foster | కొండ చిలువకు క్యాన్సర్ చికిత్స.. ప్రపంచంలోనే ఇది తొలిసారి
- ●Baingan Bharta | వంకాయ కూర తిన్నాక.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించారు..
- ●Tollywood | లగ్జరీ కారు కొన్న టాలీవుడ్ లిరిసిస్ట్ - ధర వింటే షాకవ్వాల్సిందే?
- ●Sharvari Wagh | కొన్ని సెకన్లే.. కానీ ఎంతో నేర్పాయి..! శర్వరి వాఘ్ ఆసక్తికర విషయాలు
- ●Health Department | రాబోయే ఏడు రోజులు వర్షాలు.. ఆరోగ్య శాఖ అప్రమత్తం

CM Revanth Reddy | తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయండి

Python Jodie Foster | కొండ చిలువకు క్యాన్సర్ చికిత్స.. ప్రపంచంలోనే ఇది తొలిసారి

Baingan Bharta | వంకాయ కూర తిన్నాక.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించారు..

Tollywood | లగ్జరీ కారు కొన్న టాలీవుడ్ లిరిసిస్ట్ - ధర వింటే షాకవ్వాల్సిందే?



