Rashmika Mandanna | మైసా కోసం నేషనల్ క్రష్ సాహసం – డూప్ లేకుండా అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్
మైసా మూవీ కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్న రిస్క్ తీసుకుంది. డూప్ లేకుండా అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ పూర్తిచేసింది. ఈ ఫైట్ సీన్ సినిమాకు హైలైట్‌గా ఉంటుందని మేకర్స్ చెబుతోన్నారు. మైసా మూవీ టీజర్ జూలై 15న రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Entertainment | Published On Jul 9, 2026, 4.41 pm IST
Rashmika Mandanna | లేడీ ఓరియెంటెడ్ మూవీ మైసా కోసం రష్మిక మందన్న పెద్ద సాహసమే చేసింది. డూప్ లేకుండా అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ పూర్తిచేసింది. హై ఇంటెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీకి రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో గోండు జాతి యువతిగా రష్మిక మందన్న కనిపించబోతుంది.
డూప్ లేకుండా....
మైసా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇటీవలే రష్మిక మందన్నపై డైరెక్టర్ ఓ అండర్ వాటర్ ఫైట్ సీన్ తీశారు. ఇందులో డూప్ లేకుండా నేషనల్ క్రష్ స్వయంగా నటించింది. రిస్క్ తీసుకొని యాక్షన్ ఎపిసోడ్‌ను పూర్తిచేసింది. ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం రష్మిక స్పెషల్‌గా ట్రైనింగ్ కూడా తీసుకుందని సమాచారం. అండర్ వాటర్ సీక్వెన్స్‌తో రాబోతున్న ఫస్ట్ తెలుగు ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీగా మైసా నిలవబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ఫైట్ సీన్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని అంటున్నారు.
జూలై 15న టీజర్...
మైసా టీజర్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జూలై 15న ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే టీజర్ కట్‌కు సంబంధించిన వర్క్ మొత్తం పూర్తయ్యిందని తెలిసింది. మరో ఒకటి రెండు రోజుల్లో టీజర్ రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట. అక్టోబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ధైర్యానికి ప్రతీక...
మైసాలో ధైర్యానికి ప్రతీకగా నిలిచే గోండు జాతి యువతిగా రష్మిక మందన్న కనిపించబోతున్నట్లు సమాచారం. తన జాతి కోసం మైసా అనే యువతి సాగించిన పోరాటం చుట్టూ ఈ సినిమా సాగనుంది. యాక్షన్ ఓరియెంటెడ్ రోల్‌లో రష్మిక నటన ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాతో కొత్త రష్మికను చూడటం ఖాయమని చెబుతున్నారు.
మైసాలో గురు సోమసుందరం, ఈశ్వరీరావు, తారక్ పొన్నప్ప, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం






