MGNREGA | ముగిసిన ఉపాధి హామీ గడువు.. నేటి నుంచి అమల్లోకి వీబీ జీ రామ్ జీ
MGNREGA | గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా గత రెండు దశాబ్దాలు కొనసాగుతున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం (MGNREGA) గడువు బుధవారంతో ముగిసింది. ప్రతి గ్రామీణ కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల వేతన ఉపాధి కల్పించిన (Employment Guarantee) ఈ పథకానికి కేంద్రం వీడ్కోలు పలికింది.
MGNREGA | త్రినేత్ర.న్యూస్: గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా గత రెండు దశాబ్దాలు కొనసాగుతున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం (MGNREGA) గడువు బుధవారంతో ముగిసింది. ప్రతి గ్రామీణ కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల వేతన ఉపాధి కల్పించిన (Employment Guarantee) ఈ పథకానికి కేంద్రం వీడ్కోలు పలికింది. దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) (VB G RAM G) పేరుతో జూలై 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తున్నది. ఇప్పటి వరకు 100 రోజులుగా ఉన్న పనిదినాలు 125 రోజులకు పెరుగనున్నాయి. అదేవిధంగా ఉపాధిహామీ పథకానికి అవసరమైన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 75 నుంచి 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 నుంచి 25 వరకు నిధులు వెచ్చించేవి. అయితే వీబీజీ రామ్‌జీ పథకంలో మార్పులు చేసింది. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను సమకూర్చనుంది. ఇందులో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి రూ.3,825.31 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.2550.21 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది.
సమయానికి వేలనాల చెల్లింపు..
కూలీలకు సమయానికి వేతనాలు చెల్లించేలా చట్టంలో మార్పులు చేసింది. ఒకవేళ ఆలస్యమైతే వేతనంతో పాటు పరిహారం చెల్లించనుంది. కూలీలకు 15 రోజుల్లో పనులు చూపకపోయినా నిరుద్యోగ భృతి కూలీల ఖాతాల్లో జమ కానుంది. వ్యవసాయంలో 50 శాతం పనులు చేపట్టేలా మార్పులు చేశారు. పంటల సాగులో విత్తనాలు వేయడం, పంట కోతల పని దినాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకునేలా వీలు కల్పించారు. దీంతో 60 రోజులపాటు వ్యవసాయ పనులు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. కాగా, రాష్ట్రంలో ఈ పథకం అమలుపై సందిగ్ధం నెలకొన్నది.
రాష్ట్రంలో అమలయ్యేనా..
వీబీ జీ రామ్ జీని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. పథకం అమలు నిలిపివేయాలని మంత్రి సీతక్క ఇటీవల కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ కొత్త చట్టాన్ని అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మంత్రుల సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. జూలై 2న జరిగే మంత్రివర్గ సమావేశంలో వీబీజీ రామ్ జీ అమలుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ పథకం అమలుకు ప్రత్యేకంగా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయనప్పటికీ.. కేంద్రం సూచనలకు అనుగుణంగా కొత్త ఖాతా, ఆర్‌బీఐ అకౌంట్‌ను కూడా ప్రారంభించడం గమనార్హం.
తాజావార్తలు
- ●Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
- ●Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!
- ●Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!
- ●Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?
- ●Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు
- ●Auto Strike | తెలంగాణలో ఆటోల సమ్మె బంద్..

Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్

Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!

Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!

Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?





