త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komatireddy Rajagopal Reddy | పాత కాంగ్రెస్ నేత‌లంతా క‌నుమరుగు.. రేవంత్ నాకు న‌చ్చ‌డం లేదు : కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy | యాదగిరిగుట్ట దేవ‌స్థాన ట్ర‌స్ట్ బోర్డు నూత‌న కార్య‌వ‌ర్గ ఏర్పాటు కాంగ్రెస్ పార్టీలో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. స్థానిక కాంగ్రెస్ నేత‌ల‌కు చోటు క‌ల్పించ‌క‌పోవ‌డంపై సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు.

S

Telangana | Published On Jul 1, 2026, 4.18 pm IST

Komatireddy Rajagopal Reddy | పాత కాంగ్రెస్ నేత‌లంతా క‌నుమరుగు.. రేవంత్ నాకు న‌చ్చ‌డం లేదు : కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి
Advertisement

Komatireddy Rajagopal Reddy | త్రినేత్ర‌.న్యూస్ : యాదగిరిగుట్ట దేవ‌స్థాన ట్ర‌స్ట్ బోర్డు నూత‌న కార్య‌వ‌ర్గ ఏర్పాటు కాంగ్రెస్ పార్టీలో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. స్థానిక కాంగ్రెస్ నేత‌ల‌కు చోటు క‌ల్పించ‌క‌పోవ‌డంపై సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ కోసం పోరాడిన పాత కాంగ్రెస్ నేత‌లంతా క‌నుమ‌రుగు అవుతున్నార‌ని, ఎక్క‌డెక్క‌డి నుంచో వ‌చ్చిన నేత‌ల‌దే పార్టీలో న‌డుస్తుంద‌ని మండిప‌డ్డారు. సీఎం రేవంత్ రెడ్డి వ్య‌వ‌హార‌శైలి త‌న‌కు అస‌లు న‌చ్చ‌డం లేద‌ని, అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌తో ట‌చ్‌లో ఉన్నాన‌ని ఎమ్మెల్యే తెలిపారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

నేను మునుగోడు ఎమ్మెల్యేను. నా నియోజ‌క‌వ‌ర్గం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా ప‌రిధిలోకి వ‌స్తుంది. యాద‌గిరిగుట్ట ట్ర‌స్ట్ బోర్డు స‌భ్యుల నియామ‌కం గురించి న‌న్ను సంప్ర‌దించ‌లేదు. న‌న్ను సంప్ర‌దించి ఉంటే నా నియోజ‌క‌వ‌ర్గం నుంచి క‌నీసం ఒక్క‌రికైనా అవ‌కాశం క‌ల్పించేవాడిని. ఇది ఏక‌ప‌క్ష నిర్ణ‌యం.. ఇది ఏమాత్రం స‌రికాదు. బోర్డు చైర్మ‌న్ నియామ‌కంపై నేను స్పందించ‌ద‌ల‌చుకోలేదు. కానీ స‌భ్యుల నియామ‌కాల విష‌యంలో మాత్రం క‌చ్చితంగా న‌న్ను సంప్ర‌దించాల్సి ఉండే. క‌నీసం ఆ మాత్రం విచ‌క్ష‌ణ కూడా ప్ర‌భుత్వానికి లేక‌పోవ‌డం దారుణం అని కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ఆయనకు షోఆప్స్ ఎక్కువయ్యాయి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలి అస్సలు బాగోలేదు. ఆయనకు షోఆప్స్ ఎక్కువయ్యాయి. రేవంత్ రెడ్డి బిహేవియర్ ఇలా ఉంటే చాలా కష్టం. సీఎం వ్య‌వ‌హార‌శైలి న‌చ్చ‌క‌నే.. నల్లగొండలో ముఖ్యమంత్రి సభకు వెళ్లలేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రికి రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నాను. రాహుల్ గాంధీని కూడా కలిశాను. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నింటిలోనూ చురుగ్గా పాల్గొంటున్నాను. అలాంటప్పుడు తమకు కూడా యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డులో అవకాశం కల్పించి ఉంటే బాగుండేది. కానీ దానిపై సమాచారమే ఇవ్వకపోవడం దారుణమని కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మండిపడ్డారు.

సీనియర్ లీడర్స్‌ను ఎలా గౌరవించాలో వారికి తెల్వదా..?

పార్టీలో చాలా మంది సీనియర్ లీడర్సే ఉన్నారు.. పార్టీని ఎలా నడపాలి? నియామకాలు ఎలా చేయాలి? సీనియర్ లీడర్స్‌ను ఎలా గౌరవించాలో వారికి తెల్వదా..? కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెసోళ్లు ఎక్కడ ఉన్నారు..? కాంగ్రెస్‌లోకి ఎక్కడెక్కడి నుంచో కొత్తవాళ్లు వచ్చారని తెలిపారు. అంతా వాళ్లదే నడుస్తుంది. ఒరిజినల్‌గా తెలంగాణ కోసం కొట్లాడినవాళ్లు అందరూ రోజురోజుకీ కనుమరగవుతున్నారని మునుగోడు ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.

 

Advertisement
Advertisement