త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kayadu Lohar | రక్తం కారేలా కొట్టా..! స్కూల్‌ డేస్‌లో లైంగిక వేధింపులపై కయాదు లోహర్‌ ఆవేదన..!

P

Entertainment | Published On Jul 1, 2026, 4.10 pm IST

Kayadu Lohar | రక్తం కారేలా కొట్టా..! స్కూల్‌ డేస్‌లో లైంగిక వేధింపులపై కయాదు లోహర్‌ ఆవేదన..!
Advertisement

Kayadu Lohar | అసోం బ్యూటీ కయాదు లోహర్‌ ప్రస్తుతం సౌత్‌లో వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నది. తెలుగులో ప్రస్తుతం నాని నటిస్తున్న ‘ప్యారడైజ్’ మూవీతో పాటు మలయాళం, తమిళ సినిమాలు చేతిలో ఉన్నాయి. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇవి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఆ ఇంటర్వ్యూలో కయాదు లోహర్ స్కూల్‌ డేస్‌లో ఎదురైన వేధింపులను గుర్తు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న సమయంలో తనను ఓ అమ్మాయి వేధించాడని, అతన్ని రెండుసార్లు క్షమించానని తెలిపింది. అదే అబ్బాయి మూడోసారి అదే ప్రవర్తనను రిపీట్‌ చేయడంతో సహనం కోల్పోయానని పేర్కొంది. ఆ సమయంలో అతన్ని రాయితో కొట్టి గాయపరిచానని తెలిపింది. ఆ సమయంలో అతని ప్రవర్తనను సహించలేకపోయానని చెప్పుకొచ్చింది.

తాను చూసే వారికి ప్రశాంతంగా కనిపించినా.. తప్పుగా ప్రవర్తిస్తే మాత్రం మౌనంగా ఉండబోనని స్పష్టం చేసింది. తనను తాను రక్షించుకునేందుకు ఎప్పుడూ వెనుకాడబోనని తేల్చి చెప్పింది. అయితే, హింసాత్మకంగా వ్యవహరించడం సరైంది కాదని తెలిపింది. కానీ, అప్పటి పరిస్థితులు తనను అలా ప్రవర్తించేలా చేశాయని వాపోయింది. కయాదు కామెంట్స్‌తో మళ్లీ వేధింపుల అంశంపై తెరపైకి వచ్చింది. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్స్‌ కయాదు ధైర్యాన్ని ప్రశంసించారు. చిన్నప్పటి నుంచే ఆమె నిర్భయంగా ఉండడం వల్లే.. ఆ ఆత్మవిశ్వాసమే నెగటివిటీని ఎదుర్కొనే శక్తిని ఇస్తోందని వ్యాఖ్యానించారు. కొందరు నెటిజన్లు వేధింపులకు ఎదురు నిలవడం సరైన చర్యేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎవరైనా తమకు వేధింపులు ఎదురైన సమయంలో ఇలాగే స్పందిస్తే వారికి హెచ్చరికగా ఉంటుందని పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా.. అసోంలోని తేజ్‌పూర్‌కు చెందిన కయాదు కుటుంబం ప్రస్తుతం మహారాష్ట్రలో నివాసం ఉంటుంది. కయాదు కన్నడ చిత్రం ‘ముగిల్‌పేట’తో మనోరంజన్ రవిచంద్రన్ సరసన హీరోయిన్‌గా సినీ కెరీర్‌రు ప్రారంభించింది. తర్వాత మలయాళం, తెలుగు, మరాఠీ భాషల్లో వరుసగా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. ఇటీవల విశ్వక్ సేన్ ఫంకీ మూవీలోనూ నటించింది. ప్రస్తుతం తమిళం, మలయాళంతో పాటు తెలుగులో క్రేజీ ప్రాజెక్టులు ఈ అమ్మడు చేతిలో ఉన్నాయి. తమిళంలో ఇదయం మురళీ మూవీలో నటిస్తుండగా.. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, ఇమ్మోర్టల్‌ మూవీ జులై 23న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రంలో జీవీ ప్రకాశ్‌ కుమార్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగులో నాని ‘ప్యారడైజ్‌’ మూవీలో నటిస్తోంది. అలాగే, తమిళంలో మంజనత్తి, ఐయామ్‌ గేమ్‌ సినిమాల్లోనూ నటిస్తోంది. స్టార్ హీరో సూర్యతో కలిసి ఓ భారీ చిత్రంలో నటించే అవకాశం కూడా దక్కించుకుంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించనుండగా, టీవీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారు.

Advertisement
Advertisement