KC Venugopal | బీజేపీకి రాజ్యాంగంపై ఎలాంటి విశ్వాసం లేదు : కేసీ వేణుగోపాల్
KC Venugopal | బీజేపీ (BJP)పై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ (KC Venugopal) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కమలం పార్టీకి రాజ్యాంగంపై ఎలాంటి విశ్వాసం లేదన్నారు. అయోధ్య (Ayodhya) రామ మందిరంలో భక్తులు సమర్పించుకున్న విరాళాల (Donations) దుర్వినియోగంపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందంటూ ప్రశ్నించారు.
KC Venugopal | బీజేపీ (BJP)పై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ (KC Venugopal) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కమలం పార్టీకి రాజ్యాంగంపై ఎలాంటి విశ్వాసం లేదన్నారు. సామాన్య ప్రజల జీవనోపాధిని నాశనం చేయడమే వారి ధ్యేయం అని దుయ్యబట్టారు. బెంగాల్‌లో (West Bengal) ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision) వల్ల 27 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు.
కోల్‌కతాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. "ఈ ప్రభుత్వాన్ని (రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన సువేందు అధికారి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వమని మీరెలా పిలుస్తారు..? ఓటర్ల జాబితా నుంచి 27 లక్షల కంటే ఎక్కువ మంది ఓటర్లను తొలగించారు. ఇది ప్రజాతీర్పు కానే కాదు. బీజేపీ ఓట్లను దొంగిలించింది. ఆ పార్టీకి రాజ్యాంగంపై ఎలాంటి విశ్వాసం లేదు. సామాన్య ప్రజల జీవనోపాధిని నాశనం చేయడమే వారి ప్రధాన ధ్యేయం. అందులో భాగంగానే ఇప్పుడు ఫుట్‌పాత్ వ్యాపారులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షాన నిలబడి.. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై తన పోరాటాన్ని కొనసాగిస్తుంది" అని ఆయన స్పష్టం చేశారు.
దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని..
ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకోవడానికి బీజేపీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను ఆయుధంగా వాడుకుంటోందని కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. అవినీతి పరులు బీజేపీలో చేరినప్పుడల్లవా వారిపై ఉన్న ఆరోపణలు మాయమవడానికి ఇదే నిదర్శనమన్నారు. దేశంలోని రాజ్యాంగ సంస్థలను హైజాక్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వాటిని రక్షించడానికి, రాజ్యాంగాన్ని కాపాడటానికి ప్రతిపక్షాలు ఏకమవుతాయన్నారు.
రామాలయం విరాళాల కేసుపై మౌనం ఎందుకు..?
అయోధ్య (Ayodhya) రామ మందిరంలో భక్తులు సమర్పించుకున్న విరాళాల (Donations) దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలపై కూడా కేసీ వేణుగోపాల్ ఈ సందర్భంగా స్పందించారు. ఈ విషయంలో బీజేపీ ఎందుకు మౌనంగా ఉందంటూ ప్రశ్నించారు. ఏళ్ల తరబడి బీజేపీ-ఆర్ఎస్‌ఎస్ రాజకీయాలు రామమందిరం చుట్టూనే తిరిగాయని అన్నారు. కానీ నేడు, ఆలయ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు వచ్చినప్పుడు వారు ఎందుకు మౌనంగా ఉన్నారు..? అంటూ నిలదీశారు. వారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, అయోధ్య ఆలయ ట్రస్ట్‌కు సంబంధించిన వ్యవహారాలపై బీజేపీ వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.
Also Read..
'విజయ్' నినాదంతో.. నూతన ఆర్మీ చీఫ్‌గా ఛార్జ్ తీసుకున్న జనరల్ ధీరజ్ సేథ్
భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. రూ.లక్షల్లో నష్టం..!
ప్రైమ్ వీడియోస్‌లో యాడ్స్ వివాదం.. చట్టపరమైన చిక్కుల్లో అమెజాన్
తాజావార్తలు
- ●Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!
- ●Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!
- ●Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?
- ●Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు
- ●Auto Strike | తెలంగాణలో ఆటోల సమ్మె బంద్..
- ●BRS Party | కాంగ్రెస్ 1000 రోజుల దగాపై బీఆర్ఎస్ సమరభేరి.. సెప్టెంబర్ 2 నుంచి నిరసనలు

Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!

Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!

Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?

Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు






