Mahesh Kumar Goud | బీజేపీ నేతలు ఓట్ల దొంగలు.. మీనాక్షి సీటు చోరీ చేశారు : టీ పీసీసీ చీఫ్
Mahesh Kumar Goud | భారతీయ జనతా పార్టీ నేతలు ఓట్ల దొంగలు అని, మీనాక్షి నటరాజన్ సీటు చోరీ చేశారని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి మినహాయించి తెలంగాణలో ఏ పార్టీకి చోటు లేదు అని ఆయన అన్నారు.
Mahesh Kumar Goud | త్రినేత్ర.న్యూస్ : భారతీయ జనతా పార్టీ నేతలు ఓట్ల దొంగలు అని, మీనాక్షి నటరాజన్ సీటు చోరీ చేశారని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి మినహాయించి తెలంగాణలో ఏ పార్టీకి చోటు లేదు అని ఆయన అన్నారు. గాంధీ భవన్‌లో బుధవారం మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన అట్టర్ ప్లాప్ అయింది. బీజేపీకి తెలంగాణలో అవకాశం లేదు.. అవసరం లేదు. మూడు రోజుల పర్యటనలో ఏం చేశారు. తెలంగాణ పరిస్థితుల మీద, కుల సమీకరణాల మీద, ఉద్యమం మీద అవగాహన ఉందా? బీజేపీ ముక్త్ భారత్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని టీ పీసీసీ చీఫ్ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ
సోనియా గాంధీ వల్ల తెలంగాణ సాకారమైంది. వేల మంది ప్రాణత్యాగం వల్ల రాష్ట్రం సాకారమైంది. కాంగ్రెస్ పార్టీకి మినహాయించి తెలంగాణలో ఏ పార్టీకి చోటు లేదు. నిన్ననే సీఎం రేవంత్ రైతు భరోసా విడుదల చేశారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా ఉండిపోయింది. వికసిత్ భారత్ లో తెలంగాణ లేదా? రెండు కోట్ల ఉద్యోగాలు పేరిట మోసం చేయలేదా? సంపన్న వర్గం కోసం బీజేపీ పని చేస్తోంది అని మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు.
అయోధ్య దోపిడి గురించి నబీన్ ఎందుకు మాట్లాడలేదు?
అయోధ్య దోపిడి గురించి నబీన్ ఎందుకు మాట్లాడలేదు? కాళేశ్వరం గురించి బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదు. కాళేశ్వరం కుంభకోణంపై విచారణను సీబీఐకి ఇచ్చాం.. ఎందుకు స్పందన లేదు? తెలంగాణలో మత వైషమ్యాలకు తావులేదు. మత చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తే సాధ్యం కాదు. బీహార్‌లో ఓటు దొంగిలించారు. సర్ కార్యక్రమం ఓట్ల తొలగింపు కార్యక్రమంలా మారింది అని మండిపడ్డారు.
సందేశం ఇస్తారని ఆశిస్తే విష బీజం వేశారు
సీబీఐ, ఈడి, ఎలక్షన్ కమిషన్‌ను గుప్పిట్లో పెట్టుకొని బీజేపీ అనుబంధ సంస్థలా వాడుకుంటున్నారు. ఎలక్షన్ కమిషన్‌ను చేతిలోకి తీసుకోని రాజ్యంగ విలువలను తుంగలో తొక్కారు. విభజన హామీలు నెరవేస్తారని, సందేశం ఇస్తారని ఆశిస్తే విష బీజం వేశారు. బీజేపీ ముసుగులో ఇతర పార్టీలు రెచ్చగొట్టిన కాంగ్రెస్ పార్టీకి ఢోకా లేదని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
తాజావార్తలు
- ●Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
- ●Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!
- ●Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!
- ●Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?
- ●Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు
- ●Auto Strike | తెలంగాణలో ఆటోల సమ్మె బంద్..

Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్

Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!

Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!

Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?




