త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. మ‌ళ్లీ క్షీణించిన రూపాయి విలువ‌..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధ‌వారం భారీ లాభాల్లో ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ50 ఒక్కోటి 0.5 శాతానికి పైగా ఎగ‌బాకాయి. గ‌త రెండు సెష‌న్ల‌లోనూ న‌ష్టాల్లో కొన‌సాగిన సూచీలు రిక‌వ‌ర్ అయ్యాయి. నిఫ్టీ50 సూచీ 140 పాయింట్లు పెరిగి 24,005.85 వ‌ద్ద ముగియ‌గా, సెన్సెక్స్ 443.97 పాయింట్లు పెరిగి 76,922.64 వద్ద స్థిర‌ప‌డింది.

S

Business | Published On Jul 1, 2026, 3.52 pm IST

Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. మ‌ళ్లీ క్షీణించిన రూపాయి విలువ‌..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధ‌వారం భారీ లాభాల్లో ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ50 ఒక్కోటి 0.5 శాతానికి పైగా ఎగ‌బాకాయి. గ‌త రెండు సెష‌న్ల‌లోనూ న‌ష్టాల్లో కొన‌సాగిన సూచీలు రిక‌వ‌ర్ అయ్యాయి. నిఫ్టీ50 సూచీ 140 పాయింట్లు పెరిగి 24,005.85 వ‌ద్ద ముగియ‌గా, సెన్సెక్స్ 443.97 పాయింట్లు పెరిగి 76,922.64 వద్ద స్థిర‌ప‌డింది. ఎఫ్‌ఎంసీజీ, రియాల్టీ, బ్యాంకింగ్, ఆటో రంగాల షేర్లలో బలమైన కొనుగోళ్లు మార్కెట్‌ల‌కు ఊతమిచ్చాయి. అయితే ఐటీ రంగం షేర్లపై అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. సెన్సెక్స్‌లో అత్యధిక లాభాలు నమోదు చేసిన షేర్లలో ఎటర్నల్ 5.89 శాతం ఎగసి అగ్రస్థానంలో నిలిచింది. అనంతరం ఏషియన్ పెయింట్స్ 3.13 శాతం, హిందుస్థాన్ యూనిలీవర్ 2.74 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.05 శాతం, అదానీ పోర్ట్స్ 1.96 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.81 శాతం, మారుతి సుజుకి 1.69 శాతం లాభపడ్డాయి.

లాభాల్లో బ్యాంకింగ్ షేర్లు..

బ్యాంకింగ్ రంగం షేర్లు కూడా మంచి ప్రదర్శన కనబరిచాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఒక శాతానికి పైగా పెరగడంతో ప్రధాన సూచీలకు అదనపు మద్దతు లభించింది. అయితే ఐటీ రంగం మార్కెట్ ర్యాలీకి బ్రేక్ వేసింది. హెచ్‌సీఎల్‌టెక్ 3.45 శాతం పడిపోగా, టెక్ మహీంద్రా 3.22 శాతం, టీసీఎస్ 2.51 శాతం నష్టపోయాయి. ఇన్ఫోసిస్ కూడా 1.41 శాతం క్షీణించింది. దీంతో ఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్నట్లు కనిపించింది. విస్తృత మార్కెట్లు కూడా సానుకూల ధోరణి ప్రదర్శించాయి. నిఫ్టీ 100, నిఫ్టీ 200, నిఫ్టీ మిడ్‌క్యాప్ 50, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు అన్నీ లాభాల్లో ట్రేడయ్యాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ సూచీ 3.58 శాతం పెరిగి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. ఆ తర్వాత నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 2.08 శాతం, నిఫ్టీ మీడియా 2.07 శాతం, నిఫ్టీ ఆటో 1.15 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 0.99 శాతం లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ ఐటీ 2.01 శాతం క్షీణించగా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఫార్మా సూచీలు కూడా నష్టాల్లో ట్రేడయ్యాయి.

త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు, రూపాయి విలువ ప‌త‌నం..

ప‌శ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న‌ప్ప‌టికీ చ‌మురు స‌ర‌ఫ‌రా ఆటంకం లేకుండా కొన‌సాగుతుండ‌డం, దేశీయంగా ప‌లు అగ్ర కంపెనీల్లో బ‌ల‌మైన ఫ‌లితాల న‌మోదు త‌దిత‌ర అంశాలు మార్కెట్ల‌కు స‌పోర్ట్‌ను ఇచ్చాయి. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బుధ‌వారం ఉద‌యం చ‌మురు ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగినా, త‌రువాత మళ్లీ ధ‌ర‌లు త‌గ్గాయి. దీంతో ఈక్విటీ మార్కెట్ల‌కు ఊర‌ట ల‌భించింది. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.84 శాతం మేర క్షీణించి బ్యారెల్‌కు 72 డాల‌ర్ల వ‌ద్ద నిల‌వ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 1.05 శాతం మేర త‌గ్గి బ్యారెల్‌కు 68 డాల‌ర్ల వ‌ద్ద‌కు చేరుకుంది. ఫారెక్స్ మార్కెట్‌లో మాత్రం రూపాయి బ‌ల‌హీన‌త‌ను ప్ర‌ద‌ర్శించింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 95.24 వ‌ద్ద‌కు చేరుకున్న భార‌త రూపాయి ఒక్క సెష‌న్‌లోనే 60 పైస‌లు ప‌డిపోయింది. అయితే బుధ‌వారం దేశ‌వ్యాప్తంగా ఇంధ‌న ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డం కూడా మార్కెట్ల‌కు ఊర‌టనిచ్చింది. కానీ మార్కెట్లు పాజిటివ్‌గానే కొన‌సాగుతాయా, లేదా అన్న విష‌యం వ‌చ్చే సెష‌న్ల‌లో తేలుతుంద‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisement
Advertisement