ACT Fibernet | యాక్ట్ ఫైబర్‌నెట్ కొత్త స్ట్రీమ్ టీవీ 4కే డివైస్.. ఏఐతో కంటెంట్‌ను ఈజీగా వెదకవచ్చు..
ACT Fibernet | యాక్ట్ ఫైబర్‌నెట్ తన వినియోగదారుల కోసం స్ట్రీమ్ టీవీ 4కే పేరుతో కొత్త ఏఐ ఆధారిత ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌ను విడుదల చేసింది. కంటెంట్‌ను సులభంగా వీక్షించే అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ డివైస్‌ను తీసుకొచ్చింది.
Technology | Published On Jul 1, 2026, 2.12 pm IST
ACT Fibernet | యాక్ట్ ఫైబర్‌నెట్ తన వినియోగదారుల కోసం స్ట్రీమ్ టీవీ 4కే పేరుతో కొత్త ఏఐ ఆధారిత ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌ను విడుదల చేసింది. కంటెంట్‌ను సులభంగా వీక్షించే అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ డివైస్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఏఐ ఆధారిత కనెక్టివిటీపై దృష్టి సారించి తన స్మార్ట్ వైఫై ఎకోసిస్టమ్‌ను విస్తరించిన యాక్ట్, ఇప్పుడు కంటెంట్ క్యూరేషన్ వైపు అడుగుపెట్టింది. స్ట్రీమ్ టీవీ 4కే ద్వారా స్మార్ట్ టీవీ లేని వినియోగదారులతోపాటు ఇప్పటికే స్మార్ట్ టీవీ ఉపయోగిస్తున్న వారికి కూడా ఒకే వేదికపై కంటెంట్ సూచనలను అందిస్తుంది. పలు యాప్‌లలో వెతకాల్సిన అవసరం లేకుండా సెర్చ్ ఫటీగ్ సమస్యను తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశమని కంపెనీ తెలిపింది.
ఈజీగా సెర్చ్ చేయవచ్చు..
ప్రస్తుతం డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ అనేక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, లైవ్ టీవీ సేవల్లో విభజించి ఉండడంతో వినియోగదారులు తాము చూడాలనుకున్న కంటెంట్ కోసం ఎక్కువ సమయం వెచ్చించి వెతకాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిషారంగా యాక్ట్ కంటెంట్‌పై ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఏఐ సెర్చ్ ఫీచర్‌ను అందించింది. సినిమా లేదా షో పేరు పూర్తిగా టైప్ చేయాల్సిన అవసరం లేకుండా, వినియోగదారులు తమ ఉద్దేశాన్ని లేదా కంటెంట్‌కు సంబంధించిన వివరణను చెప్పినా సరిపోతుంది. ఉదాహరణకు 30 నిమిషాల కామెడీ లేదా చెస్ అమ్మాయి ఉన్న షో అని సెర్చ్ చేస్తే, సంబంధిత కంటెంట్‌ను గుర్తించి వివిధ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఒకే ఇంటర్‌ఫేస్‌లో చూపిస్తుంది. ప్రారంభ దశలో ఈ ఏఐ సెర్చ్ ఫీచర్ ఇంగ్లిష్, హిందీ, తెలుగు, కన్నడ, మరాఠీ, తమిళం భాషలలో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతీయ భాషలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.
ధర ఎంతంటే..
స్ట్రీమ్ టీవీ 4కేలో 400కు పైగా లైవ్ టీవీ ఛానళ్లతోపాటు ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ఒకే చోట ఇచ్చారు. సంప్రదాయ టీవీ ఛానళ్లను సులభంగా బ్రౌజ్ చేసేందుకు ఒకే బటన్‌తో అందుబాటులో ఉండే ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్ గైడ్ (ఈపీజీ)ని కూడా అందించారు. ఈ డివైస్‌తో వచ్చే కస్టమైజ్ చేయగలిగే రిమోట్‌లో వ్యక్తిగత షార్ట్‌కట్ బటన్లు, లైవ్ టీవీ కోసం నేరుగా ఛానల్ నంబర్ నమోదు చేసే సదుపాయం, ప్రత్యేక ఈపీజీ బటన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. యాక్ట్ ఫైబర్‌నెట్ సబ్‌స్క్రైబర్లకు స్ట్రీమ్ టీవీ 4కే రెండు విధానాల్లో అందుబాటులో ఉంది. అద్దె విధానంలో నెలకు రూ.99 (జీఎస్‌టీ అదనం) చెల్లించి ఉపయోగించవచ్చు. ఒకేసారి కొనుగోలు చేయాలనుకునే వారికి రూ.4,499 (జీఎస్‌టీ అదనం) ధరను నిర్ణయించింది. ఈ కొత్త ఉత్పత్తితో కేవలం బ్రాడ్‌బ్యాండ్ సేవలకే పరిమితం కాకుండా, ఏఐ ఆధారిత హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎకోసిస్టమ్‌ను అందించే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా మారాలని యాక్ట్ ఫైబర్‌నెట్ లక్ష్యంగా నిర్ణయించుకుంది.
సంబంధిత వార్తలు

Main Vaapas Aaunga | ‘మై వాపస్ ఆవూంగా’… నెట్ ఫ్లిక్స్‌లో ఈ అర్ధరాత్రి నుంచే…
ఆగస్టు 6, 2026

LG 2026 TV | సర్ప్రైజ్ చేసిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్.. సోనీకి పోటీగా 115 ఇంచుల భారీ ఎల్ఈడీ టీవీ లాంచ్..
ఆగస్టు 5, 2026

Netflix | నెట్‌ఫ్లిక్స్ భారీ సర్ప్రైజ్.. మళ్లీ ఉచిత ట్రయల్ ప్రారంభం.. 30 రోజులు ఫ్రీ..
జులై 10, 2026
తాజావార్తలు
- ●Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
- ●Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!
- ●Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!
- ●Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?
- ●Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు
- ●Auto Strike | తెలంగాణలో ఆటోల సమ్మె బంద్..

Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్

Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!

Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!

Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?



