త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Girlfriend leaves 3,400 kiss marks on car | ప్రియుడి కారుపై ప్రేయ‌సి 3,400 కిస్ సింబ‌ల్స్‌.. వైర‌ల్ కోసం యువ‌కుడి వింత ఆలోచ‌న‌

Girlfriend leaves 3,400 kiss marks on car | సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యేందుకు ఓ యువ‌కుడు వినూత్న ప్ర‌య‌త్నం చేశాడు. త‌న స్విఫ్ట్ కారుపై ప్రేయ‌సితో ఏకంగా 3400 లిప్‌స్టిక్ ముద్దుల గుర్తులను పెట్టించాడు. అనుకున్న‌ట్లే అత‌డి ఆలోచ‌న ఫ‌లించింది. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అయ్యింది. అదే స‌మ‌యంలో పోలీసులు కూడా షాక్ ఇచ్చారు. చివ‌రికి త‌న త‌ప్పు తెలుసుకున్న ఆ యువ‌కుడు పోలీసు స్టేష‌న్‌లో త‌న కారును క‌డుక్కోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

D

National | Published On Aug 25, 2026, 12.42 pm IST

Girlfriend leaves 3,400 kiss marks on car | ప్రియుడి కారుపై ప్రేయ‌సి 3,400 కిస్ సింబ‌ల్స్‌.. వైర‌ల్ కోసం యువ‌కుడి వింత ఆలోచ‌న‌
Advertisement

Girlfriend leaves 3,400 kiss marks on car | త్రినేత్ర‌.న్యూస్ : సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యేందుకు నేటిత‌రం యువ‌తీ యువ‌కులు పిచ్చి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అస‌భ్య‌క‌రంగా రీల్స్ చిత్రీక‌రించ‌డం, విన్యాసాలు చేస్తూ ప్రమాదకర స్టంట్స్ ప్ర‌ద‌ర్శిస్తున్నారు. తాజాగా ఓ యువ‌కుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం త‌న ప్రేయ‌సితో ఓ వినూత్న స్టంట్ చేయించాడు. త‌న కారును ప్రియురాలి ముద్దుల‌తో నింపేసి.. సోష‌ల్ మీడియాలో వీడియో పెట్టాడు. ఆ వీడియో విప‌రీతంగా వైర‌ల్ కావ‌డంతో పోలీసులు ఆ యువ‌కుడికి షాక్ ఇచ్చారు.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..? మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని గ్వాలియర్ (Gwalior)కు చెందిన ఆదిత్య సికార్వార్ అనే యువ‌కుడు సోష‌ల్ మీడియా ట్రెండ్‌ను ఫాలో అవ్వాల‌ని నిర్ణ‌యించాడు. ఏదైనా వింత‌గా చేసి ఆ రీల్‌ను వైర‌ల్ చేయాల‌ని భావించాడు. ఇందుకోసం వినూత్న ఆలోచ‌న చేశాడు. త‌న వ‌ద్ద ఉన్న స్విఫ్ట్ కారును లిప్‌స్టిక్ ముద్దుల‌తో (lipstick kiss marks) నింపేశాడు. అత‌డి స్నేహితురాలు దాదాపు మూడున్నర గంట‌ల పాటూ శ్ర‌మించి కారుపై సుమారు 3400 లిప్‌స్టిక్ ముద్దుల గుర్తులను పెట్టింది. ఇందుకోసం సుమారు రూ.800 నుంచి రూ.900 ఖ‌ర్చు అయ్యింది. ప్రేయ‌సి ముద్దుల‌తో ముంచెత్తిన కారు వీడియోని ఆదిత్య సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే ఇంకేముంది అనుకున్న‌ట్లు అత‌డు చేసిన ఈ ప్ర‌యోగం ఫ‌లించింది. ఆ వీడియో విప‌రీతంగా వైర‌ల్ అయ్యింది. ఒక్క‌రోజులోనే ఈ వింతైన "ముద్దుల కారు" వీడియోకి దాదాపు 55 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

అలా వైర‌ల్ అయిన ఈ వీడియో చివ‌రికి ట్రాఫిక్‌ పోలీసుల (Traffic Police) దృష్టిని కూడా ఆక‌ర్షించింది. ముద్దుల‌తో నింపిన కారు రోడ్ల‌పై తిరుగుతుండ‌టాన్ని గుర్తించిన పోలీసులు దాని కోసం గాలింపు మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలో థాటిపూర్ స‌మీపంలో కారును ప‌ట్టుకుని స్టేష‌న్‌కు త‌ర‌లించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆదిత్య‌కు రూ. 5,500 జ‌రిమానా విధించారు. దీంతో త‌న త‌ప్పు తెలుసుకున్న ఆదిత్య‌.. కారుపై ఉన్న ముద్దు గుర్తుల‌ను పోలీసు స్టేష‌న్‌లోనే చెరిపేయాల్సి వ‌చ్చింది. అంతేకాదు, ఇలాంటి త‌ప్పు మ‌రోసారి చేయ‌బోన‌ని అత‌డు పోలీసుల‌కు తెలిపాడు. ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తాన‌ని హామీ ఇవ్వ‌డంతో అత‌డిని పోలీసులు వ‌దిలిపెట్టారు.

Also Read..

డ్ర‌గ్స్ అక్ర‌మ ర‌వాణా చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎయిర్‌ హోస్టెస్

రేపిస్ట్‌కు మ‌రోసారి పెరోల్‌.. 9 ఏళ్ల‌లో 17వ‌సారి

ఇస్లాంలో హిజాబ్ త‌ప్ప‌నిస‌రి కాదు.. అల‌హాబాద్ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

Advertisement
Advertisement