త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dera Baba | రేపిస్ట్‌కు మ‌రోసారి పెరోల్‌.. 9 ఏళ్ల‌లో 17వ‌సారి

Dera Baba | ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడిన‌ కేసులో దోషిగా తేలి 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా (Dera Baba)కు మ‌రోసారి పెరోల్ (parole) ల‌భించింది. ఈసారి ఆయ‌న‌కు 21 రోజుల పెరోల్ ల‌భించిన‌ట్లు అధికారులు తెలిపారు.

D

National | Published On Aug 25, 2026, 11.40 am IST

Dera Baba | రేపిస్ట్‌కు మ‌రోసారి పెరోల్‌.. 9 ఏళ్ల‌లో 17వ‌సారి
Advertisement

Dera Baba | త్రినేత్ర‌.న్యూస్ : ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడిన‌ కేసులో దోషిగా తేలి 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న ‘డేరా సచ్చా సౌదా’ (Dera Sacha Sauda) చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ (Gurmeet Ram Rahim Singh) అలియాస్‌ డేరా బాబా (Dera Baba)కు మ‌రోసారి పెరోల్ (parole) ల‌భించింది. ఈసారి ఆయ‌న‌కు 21 రోజుల పెరోల్ ల‌భించిన‌ట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆయ‌న జైలు నుంచి విడుద‌లై సిర్సాలోని డేరా సచ్చా సౌదా ప్ర‌ధాన కార్యాల‌యానికి వెళ్లిన‌ట్లు పేర్కొన్నారు.

కాగా, 2017లో ఇద్దరు శిష్యులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా నిర్ధారణ అయిన తరువాత కోర్టు అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ రెండు అత్యాచారాలకు సంబంధించిన కేసులో దోషిగా శిక్ష అనుభవించడంతో పాటు పలు హత్య కేసుల్లో కూడా ఆయ‌న‌ జీవిత ఖైదు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం అతడు హర్యానాలోని రోహ్‌తక్ (Rohtak) జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, ఆయన వివిధ కారణాలతో పలుమార్లు పెరోల్‌పై బయటకు వస్తున్న విషయం తెలిసిందే. 2017 నుంచి తొమ్మిదేళ్ల‌లో ఆయ‌న‌కు పెరోల్ ల‌భించ‌డం ఇది 17వ‌సారి కావ‌డం గ‌మ‌నార్హం. ఈ ఏడాది మేలో కూడా 30 రోజుల పెరోల్‌తో ఆయ‌న జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

Also Read..

ఇస్లాంలో హిజాబ్ త‌ప్ప‌నిస‌రి కాదు.. అల‌హాబాద్ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్ర‌చారానికి NDSA, CWPRS నివేదిక‌లు చెంప‌పెట్టు : హ‌రీశ్ రావు

ప‌శ్చిమ ఆసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Advertisement
Advertisement