Drugs Smuggling | డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎయిర్ హోస్టెస్
Drugs Smuggling | మాజీ ఎయిర్ హోస్టెస్ (Ex Cabin Crew) ఒకరు రూ.30 లక్షల విలువైన మత్తుపదార్థాలు అక్రమంగా రవాణా (Drugs Smuggling) చేస్తూ పట్టుబడింది. విచారణలో ఆ మహిళకు డ్రగ్స్ వ్యాపారంలో సుదీర్ఘ చరిత్ర ఉన్నట్లు వెల్లడైంది.
Drugs Smuggling | త్రినేత్ర.న్యూస్ : డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా (Drugs Smuggling) చేస్తూ ఓ మాజీ ఎయిర్ హోస్టెస్ (Ex Cabin Crew) అధికారులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గుజరాత్‌లోని వడోదర నుంచి ముంబైకి (Gujarat To Mumbai) మత్తుపదార్థాలు అక్రమంగా రవాణా చేస్తూ ఆమె పట్టుబడింది. విచారణలో ఆ మహిళకు డ్రగ్స్ వ్యాపారంలో సుదీర్ఘ చరిత్ర ఉన్నట్లు వెల్లడైంది.
అధికారుల సమాచారం ప్రకారం.. వడోదర నుంచి ముంబైకి ఓ కారులో భారీ ఎత్తున మెఫెడ్రోన్ (ఎండీ) డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తున్నట్లు సూరత్ క్రైమ్ బ్రాంచ్‌కు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే (Delhi-Mumbai Expressway)పై మాటు వేశారు. అక్కడ టోల్ గేట్ వద్ద ఓ కారు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపారు. అందులో తనిఖీ చేయగా 977 గ్రాముల డ్రగ్స్‌ను గుర్తించారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.30 లక్షల వరకూ ఉంటుందని అంచనా. ఆ సమయంలో కారులో మాజీ ఎయిర్ హోస్టెస్ మాన్సీ సయ్యద్ (41), ఆమె సహాయకుడు సోహైల్ సులేమాన్ షేక్ (20) ఉన్నారు. వారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మత్తుపదార్థాలతో పాటు మొబైల్ ఫోన్లు, డ్రగ్స్ ప్యాకింగ్‌కు ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లు, కంటైనర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వడోదర రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని మహిళ ఈ డ్రగ్స్ ప్యాకెట్‌ను తమకు ఇచ్చిందని, ముంబైలోని పెడ్లర్లకు పంపిణీ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు నిందితులు విచారణలో తెలిపారు.
ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ దర్యాప్తులో ఆ మహిళకు డ్రగ్స్ వ్యాపారంలో సుదీర్ఘ చరిత్ర ఉన్నట్లు వెల్లడైంది. మలేషియన్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసిన మాన్సీ పలు దేశాలకు ప్రయాణించినట్లు విచారణలో తేలింది. ఆమె 2015 నుంచే మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అధికారులు తెలిపారు. 2021లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సుమారు 100 గ్రాముల మాదకద్రవ్యాలతో పోలీసులకు పట్టుబడినట్లు చెప్పారు. ఆ కేసులో మాన్సీ దాదాపు నాలుగేళ్లపాటు జైలు జీవితం కూడా గడిపినట్లు వెల్లడించారు. 2021 నాటి కేసు విచారణ సమయంలో మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఆమెకు డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌తో ఉన్న సంబంధాలు బయటపడినట్లు అధికారులు చెప్పారు. కాగా, మాన్సీ గత డ్రగ్స్ కేసు, తాజా నెట్‌వర్క్ లింకులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలికి మాదకద్రవ్యాలను సరఫరా చేసిన మహిళ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.
Also Read..
రేపిస్ట్‌కు మరోసారి పెరోల్.. 9 ఏళ్లలో 17వసారి
ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రచారానికి NDSA, CWPRS నివేదికలు చెంపపెట్టు : హరీశ్ రావు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Double Standards | అమెరికా పర్యటన.. రేవంత్‌కు నో.. గుజరాత్ ముఖ్యమంత్రికి అనుమతి.. కేంద్రం వైఖరిపై ఐఓసీ ఫైర్
ఆగస్టు 23, 2026

Indian national arrested in US | వృద్ధులే లక్ష్యంగా రూ.63 కోట్ల భారీ మోసం.. అమెరికాలో భారతీయుడి అరెస్ట్
ఆగస్టు 22, 2026

Security Guard | ఉద్యోగంలో చేరిన నాలుగు రోజులకే.. మహిళపై సెక్యూరిటీ గార్డ్ అఘాయిత్యం
ఆగస్టు 10, 2026
తాజావార్తలు
- ●Shriya Saran | 19 ఏళ్ల తర్వాత తలైవాతో శ్రియా రొమాన్స్ - శివాజీ కాంబో రిపీట్
- ●Lava Virat V1 Pro 5G | లావా నుంచి మరో కొత్త 5జి ఫోన్.. రూ.2వేల లాంచింగ్ డిస్కౌంట్..
- ●Dera Baba | రేపిస్ట్‌కు మరోసారి పెరోల్.. 9 ఏళ్లలో 17వసారి
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బంగారం కొనేందుకు మంచి చాన్స్..
- ●Hijab | ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- ●Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రచారానికి NDSA, CWPRS నివేదికలు చెంపపెట్టు : హరీశ్ రావు

Shriya Saran | 19 ఏళ్ల తర్వాత తలైవాతో శ్రియా రొమాన్స్ - శివాజీ కాంబో రిపీట్

Lava Virat V1 Pro 5G | లావా నుంచి మరో కొత్త 5జి ఫోన్.. రూ.2వేల లాంచింగ్ డిస్కౌంట్..

Dera Baba | రేపిస్ట్‌కు మరోసారి పెరోల్.. 9 ఏళ్లలో 17వసారి

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బంగారం కొనేందుకు మంచి చాన్స్..



