Traffic Restrictions | బీ అలర్ట్.. నవంబర్ 26న హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions | భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న పాత అంబేద్కర్ విగ్రహం నుండి సచివాలయ జంక్షన్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ఇందిరా గాంధీ రోటరీ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు.
Traffic Restrictions | త్రినేత్ర న్యూస్ : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న పాత అంబేద్కర్ విగ్రహం నుండి సచివాలయ జంక్షన్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ఇందిరా గాంధీ రోటరీ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బషీర్‌బాగ్, లిబర్టీ, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్, ఇక్బాల్ మినార్, ఎగువ, దిగువ ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, పరిసర ప్రాంతాలను కలిపే రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. గురువారం ఉదయం 10 గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
- బషీర్‌బాగ్, లిబర్టీ వైపు నుండి పాత అంబేద్కర్ విగ్రహం జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను జీహెచ్‌ఎంసీ (GHMC) ఆఫీస్ లేన్ వద్ద బీఆర్‌కే భవన్, ఆదర్శ్ కేఫ్ క్రాస్ రోడ్స్, నెక్సా షోరూమ్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
- ఇక్బాల్ మినార్ నుండి వచ్చే ట్రాఫిక్‌ను మింట్ కాంపౌండ్ వద్ద ఐమాక్స్ (IMAX) థియేటర్ వైపు, అక్కడి నుండి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తారు.
- ఎగువ ట్యాంక్ బండ్ రోడ్డు నుండి బీఆర్‌కే భవన్, ఇక్బాల్ మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను పాత అంబేద్కర్ విగ్రహం వద్ద లిబర్టీ వైపు మళ్లిస్తారు. ఒకవేళ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటే, చిల్డ్రన్స్ పార్క్ వద్ద నుండి దిగువ ట్యాంక్ బండ్ వైపు అదనంగా దారి మళ్లిస్తారు.
- ఐమాక్స్, బడా గణేష్ జంక్షన్ నుండి వచ్చే ట్రాఫిక్‌ను సచివాలయం నార్త్-వెస్ట్ (వాయువ్య) గేటు వద్ద టెంపుల్ జంక్షన్, మింట్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
- పంజాగుట్ట, లోక్ భవన్ రోడ్ల నుండి వచ్చే ట్రాఫిక్‌ను ఖైరతాబాద్ జంక్షన్‌లోని వి.వి. విగ్రహం వద్ద షాదాన్, నిరంకారీ జంక్షన్ల వైపు మళ్లిస్తారు.
- నల్లగుట్ట నుండి ఇందిరా గాంధీ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నల్లగుట్ట క్రాస్ రోడ్స్ వద్ద సోనాబాయి మసీదు వైపు మళ్లిస్తారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Global Summit | గ్లోబల్ సమ్మిట్ కోసం నాలుగు భాషల్లో ప్రత్యేక గీతం.. కీరవాణి ఆధ్వర్యంలో సమ్మిట్ ఆంథమ్ రూపకల్పన
నవంబర్ 25, 2026

Christmas | తెలంగాణలోని ప్రతి చర్చికి రూ. 30 వేల సాయం
నవంబర్ 25, 2026

Contract Lecturers | నల్ల బ్యాడ్జీలతో రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీలలో కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన
నవంబర్ 25, 2026
తాజావార్తలు
- ●Global Summit | గ్లోబల్ సమ్మిట్ కోసం నాలుగు భాషల్లో ప్రత్యేక గీతం.. కీరవాణి ఆధ్వర్యంలో సమ్మిట్ ఆంథమ్ రూపకల్పన
- ●Shraddha Kapoor | శ్రద్ధా కపూర్ డైలాగ్ డెలివరీపై విమర్శలు.. ‘ఈథా’తో మెప్పించేనా..?
- ●Harish Rao | రేవంత్ రెడ్డి చేస్తున్న జలద్రోహానికి కేఆర్ఎంబీ మినిట్సే మరో సాక్ష్యం!
- ●Christmas | తెలంగాణలోని ప్రతి చర్చికి రూ. 30 వేల సాయం
- ●Actor Prabhas | ఫ్యూచర్ సిటీలో ప్రభాస్‌కు 500 ఎకరాలు..?
- ●Contract Lecturers | నల్ల బ్యాడ్జీలతో రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీలలో కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన

Global Summit | గ్లోబల్ సమ్మిట్ కోసం నాలుగు భాషల్లో ప్రత్యేక గీతం.. కీరవాణి ఆధ్వర్యంలో సమ్మిట్ ఆంథమ్ రూపకల్పన

Shraddha Kapoor | శ్రద్ధా కపూర్ డైలాగ్ డెలివరీపై విమర్శలు.. ‘ఈథా’తో మెప్పించేనా..?

Harish Rao | రేవంత్ రెడ్డి చేస్తున్న జలద్రోహానికి కేఆర్ఎంబీ మినిట్సే మరో సాక్ష్యం!

Christmas | తెలంగాణలోని ప్రతి చర్చికి రూ. 30 వేల సాయం



