త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hijab | ఇస్లాంలో హిజాబ్ త‌ప్ప‌నిస‌రి కాదు.. అల‌హాబాద్ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

Hijab | ఇస్లాంలో (Islam) హిజాబ్ ధరించడం తప్పనిసరి మతాచారం కాదని అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) స్పష్టం చేసింది. విద్యాసంస్థలు నిర్ణయించిన డ్రెస్‌కోడ్‌ను (School Dress Code) విద్యార్థులు తమ వ్యక్తిగత ఇష్టాయిష్టాల ప్రకారం మార్చే హక్కు ఎవ‌రికీ లేదని తేల్చి చెప్పింది. ఈ మేర‌కు ప్ర‌యాగ్‌రాజ్‌కు చెందిన ఓ మైన‌ర్ విద్యార్థిని (Muslim student ) దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను హైకోర్టు బెంచ్ కొట్టేసింది.

D

National | Published On Aug 25, 2026, 11.23 am IST

Hijab | ఇస్లాంలో హిజాబ్ త‌ప్ప‌నిస‌రి కాదు.. అల‌హాబాద్ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

Hijab | త్రినేత్ర‌.న్యూస్ : హిజాబ్ విష‌యంలో అల‌హాబాద్ హైకోర్టు (Allahabad High Court) కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఇస్లాంలో (Islam) హిజాబ్ త‌ప్ప‌నిస‌రి కాద‌ని వ్యాఖ్యానించింది. ఈ మేర‌కు పాఠశాల యూనిఫామ్‌తో (School Dress Code) పాటు హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని (Muslim student ) దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

ప్రయాగ్‌రాజ్‌లోని ఠాగూర్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన ఓ విద్యార్థిని పదో తరగతి పూర్తి చేసుకుని.. అదే సంస్థలో 11వ తరగతిలో ప్రవేశం పొందడానికి సిద్ధమైంది. ఈ క్ర‌మంలో పాఠశాల నిర్దేశించిన యూనిఫామ్‌తో పాటు హిజాబ్ ధ‌రించేందుకు అనుమ‌తించేలా పాఠశాల అధికారులను ఆదేశించాలని కోరుతూ స‌ద‌రు విద్యార్థిని త‌న త‌ల్లితో క‌లిసి హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. హెడ్‌స్కార్ఫ్ ధరించడం ఇస్లామిక్ ఆచారంలో అంతర్భాగమని, అంతేకాకుండా తాను 6వ తరగతి నుంచి అదే పాఠశాలలో హెడ్‌స్కార్ఫ్ ధరిస్తూ వస్తున్నానని పిటిషన్‌లో పేర్కొంది.

ఈ పిటిషన్‌పై జస్టిస్ జె.జె. మునీర్, జస్టిస్ ఇంద్రజీత్ శుక్లాలతో కూడిన అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. పిటిషనర్ సమర్పించిన వివిధ తరగతుల ఫోటోలను పరిశీలించిన ధర్మాసనం.. సదరు విద్యార్థిని మినహా అదే మతానికి చెందిన ఇతర బాలికలు ఎవరూ హిజాబ్ ధరించకపోవడాన్ని గుర్తించింది. ఇస్లాంలో హిజాబ్ ధరించడం తప్పనిసరి ఆచారమనే విద్యార్థిని వాదనను కోర్టు తోసిపుచ్చింది. హిజాబ్ ధరించడం ఇస్లాంలో అత్యవసరమని పిటిషనర్ చెప్పడం కేవలం మాటలకే పరిమితమైందని, దానిని నిరూపించేందుకు మత గ్రంథాలు గానీ, ఇతర ఆధారాలు గానీ సమర్పించలేదని ధర్మాసనం తెలిపింది.

పాఠశాలల్లో విద్యార్థుల మధ్య భేదాలు చూపకుండా అందరూ సమానంగా ఉండేలా చూడటంలో యూనిఫామ్‌ నిబంధనలు కీలకపాత్ర పోషిస్తాయ‌ని వ్యాఖ్యానించింది. విద్యార్థులందరికీ సమానమైన యూనిఫామ్ నిబంధనలను అమలు చేసే అధికారం ప్రైవేట్‌ విద్యాసంస్థలకు ఉందని ధ‌ర్మాస‌నం స్పష్టం చేసింది. అందరికీ సమానంగా వర్తించే డ్రెస్‌కోడ్‌ను ఒక్కొక్కరి అభిరుచికి అనుగుణంగా మార్చుకోవడానికి అనుమతిస్తే.. యూనిఫాం అనే భావనకే అర్థం లేకుండా పోతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాకుండా పాఠశాలల్లో క్రమశిక్షణను నిర్దేశించే అధికారం సంస్థ చేతి నుంచి విద్యార్థుల చేతికి మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

గతంలో ఈ అంశంపై పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ధ‌ర్మాస‌నం ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించింది. హిజాబ్ ధరించడం ఇస్లాం మతంలో తప్పనిసరి కాదని ఏకగ్రీవ అభిప్రాయం వ్యక్తమైందని గుర్తు చేసింది. ఈ విషయంలో 2022లో కర్ణాటక హైకోర్టు పూర్తిస్థాయి ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో తాము ఏకీభవిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేర‌కు నిర్దేశించిన పాఠశాల యూనిఫామ్‌ను పాటించడం తప్పనిసరి అని స్ప‌ష్టం చేసింది. వ్యక్తిగత ప్రాతిపదికన యూనిఫామ్‌కు హెడ్‌స్కార్ఫ్‌ను జోడించడానికి అనుమతి కోరే చట్టపరమైన హక్కు ఎవరికీ లేదని కోర్టు తేల్చిచెప్పింది. ఈ మేర‌కు విద్యార్థి పిటిష‌న్‌ను ధ‌ర్మాస‌నం కొట్టివేసింది.

Also Read..

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్ర‌చారానికి NDSA, CWPRS నివేదిక‌లు చెంప‌పెట్టు : హ‌రీశ్ రావు

ప‌శ్చిమ ఆసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

తెలంగాణ‌లో తగ్గిన 21 శాతం ఓట్లు.. హైద‌రాబాద్‌లోనే అత్య‌ధికం..

Advertisement
Advertisement