త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Annamalai | పెట్టుబ‌డుల కోసం డెడ్ ఎకాన‌మీ దేశానికి వెళ్ల‌డ‌మేంటి..? విజ‌య్ యూకే ప‌ర్య‌ట‌న‌పై అన్నామ‌లై విమ‌ర్శ‌లు

Annamalai | తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ యూకే ప‌ర్య‌ట‌న‌పై (Vijays London Trip) వీ ద లీడ‌ర్స్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు, త‌మిళ‌నాడు బీజేపీ మాజీ నేత కే అన్నామ‌లై (Annamalai) తీవ్ర‌స్థాయిలో విమర్శలు గుప్పించారు.

D

National | Published On Sep 21, 2026, 1.40 pm IST

Annamalai | పెట్టుబ‌డుల కోసం డెడ్ ఎకాన‌మీ దేశానికి వెళ్ల‌డ‌మేంటి..? విజ‌య్ యూకే ప‌ర్య‌ట‌న‌పై అన్నామ‌లై విమ‌ర్శ‌లు
Advertisement

Annamalai | త్రినేత్ర‌.న్యూస్ : తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ యూకే ప‌ర్య‌ట‌న‌పై (Vijays London Trip) వీ ద లీడ‌ర్స్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు, త‌మిళ‌నాడు బీజేపీ మాజీ నేత కే అన్నామ‌లై (Annamalai) తీవ్ర‌స్థాయిలో విమర్శలు గుప్పించారు. బ్రిటన్ వృద్ధి రేటు కేవలం 1% మాత్రమే ఉందని చెప్పారు. అలాంటిది పెట్టుబ‌డుల కోసం డెడ్ ఎకాన‌మీ దేశానికి వెళ్ల‌డం ఏంట‌ని నిల‌దీశారు.

"ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ విలువ సుమారు 4.1 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. యూకే ఆర్థిక వ్యవస్థ కేవలం 3.4 ట్రిలియన్ డాలర్లు మాత్రమే. కేవలం 1 శాతం వృద్ధి రేటుతో నెమ్మదిగా సాగుతున్న దేశానికి మ‌న ముఖ్య‌మంత్రి ఓ పెద్ద బృందంతో వెళ్ల‌డంలో అర్థం లేదు. డెడ్ ఎకాన‌మీ దేశం నుంచి పెట్టుబ‌డులు ఆశించ‌డం ఏంటి..? విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేసే బ‌దులు.. రాష్ట్రంలోని కోయంబ‌త్తూరు, మ‌ధురై వంటి న‌గ‌రాల్లో ప‌ర్య‌టించాలి. అక్క‌డి స్థానిక పారిశ్రామిక సంస్థ‌ల‌తో చ‌ర్చించి వారికి త‌గిన ప్రోత్సాహ‌కాలు, రాయితీలు అందిస్తే వారే రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌స్తారు" అని అన్నామ‌లై ప్ర‌భుత్వానికి సూచించారు. అదేవిధంగా, దేశంలోని ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

కాగా, పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా వారం రోజుల పాటూ విజ‌య్ లండ‌న్‌లో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. సీఎం యూకే ప‌ర్య‌ట‌న ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.15,000 కోట్ల పెట్టుబడులు, 10,000కు పైగా ఉద్యోగాలు లభించాయని తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రాన్ని గ్లోబ‌ల్ ఇన్వెస్ట్‌మెంట్‌, ఇండ‌స్ట్రియ‌ల్ హ‌బ్‌గా తీర్చిదిద్దే ప్ర‌య‌త్నంలో భాగంగానే సీఎం యూకే ప‌ర్య‌ట‌న సాగిన‌ట్లు పేర్కొంది. అంతేకాదు, 2036 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను 1.5 ట్రిలియన్ డాల‌ర్ల‌కు చేర్చ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేసింది.

Also Read..

విద్యార్థి మృతితో ఐఐటీ బాంబేలో ఉద్రిక్త‌త‌.. ప్రొఫెసర్ స‌స్పెండ్‌

బేబ‌మ్మ‌ బ‌ర్త్‌డే ట్రీట్ - లంగా ఓణీలో కృతిశెట్టి - జ‌న‌వ‌రి 12 విడుద‌ల ఫ‌స్ట్ లుక్ రిలీజ్

రోడ్డుపై భయానక ప్రమాదం: జీప్‌ను బలంగా ఢీకొట్టి గాల్లోకి ఎగిరిపడ్డ బైకర్.. ఒళ్లు గగుర్పొడిచే సీసీటీవీ ఫుటేజ్

Advertisement
Advertisement