Manipur | మణిపూర్‌లో మళ్లీ హింస.. 20కి పైగా ఇళ్లకు నిప్పు
Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో (Manipur) మరోసారి హింస చెలరేగింది. కామ్‌జోంగ్ జిల్లాలో నాగా, కుకీ (Naga, Kuki) సామాజిక వర్గాల మధ్య సాయుధ ఘర్షణలు చోటుచేసుకున్నాయి (Manipur violence). ఇరు వర్గాలు మూడు గ్రామాల్లోని 20కిపైగా ఇళ్లకు నిప్పు పెట్టారు.
Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో (Manipur) మరోసారి హింస చెలరేగింది. కామ్‌జోంగ్ జిల్లాలో నాగా, కుకీ (Naga, Kuki) సామాజిక వర్గాల మధ్య సాయుధ ఘర్షణలు చోటుచేసుకున్నాయి (Manipur violence). ఈ ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో ఇరు వర్గాలు మూడు గ్రామాల్లోని 20కిపైగా ఇళ్లకు నిప్పు పెట్టారు. భారత్-మయన్మార్ సరిహద్దు సమీపంలోని కుకీల గ్రామమైన ఫైమోల్‌ను దుండగులు తగలబెట్టారు. ఈ ఘటనలో మొత్తం 15 ఇళ్లు కాలి బూడిదయ్యాయి.
మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కుకీ గ్రామం నుంచి వచ్చిన సాయుధులు సమీపంలోని నాగా గ్రామంపై దాడిచేసి 10 ఇళ్లను తగలబెట్టడంతో ఈ హింస ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గ్రామస్థులు ఇప్పటికే ఇళ్లను ఖాళీ చేసి 11 అస్సాం రైఫిల్స్ క్యాంప్ ఉన్న ఐషి గ్రామంలో తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నారు. తాజా ఘర్షణలతో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read..
మీరు మగాళ్లయితే చర్చకు రండి
రాముడి పేరుతో బీజేపీ దోపిడీకి పాల్పడింది : డీకే శివకుమార్
డెల్ నుంచి కొత్త ఏలియన్‌వేర్ 15 ల్యాప్‌టాప్.. కంటెంట్ క్రియేటర్లు, గేమర్లకు బెస్ట్ ఫీచర్లు..
సంబంధిత వార్తలు

Manipur | మరోసారి భగ్గుమన్న మణిపూర్.. అస్సాం రైఫిల్స్ క్యాంప్‌పై మూక దాడి.. వాహనాలకు నిప్పు
జులై 15, 2026

Manipur Violence | మణిపూర్‌లో మళ్లీ భగ్గుమన్న హింస: 29 ఇండ్ల దహనం.. మోదీ సర్కార్‌పై రాహుల్ ఫైర్!
జులై 2, 2026

Manipur Violence | మణిపూర్‌లో మళ్లీ హింస.. గ్రామంపై కాల్పులు, ఇళ్లకు నిప్పు.. ముగ్గురు మృతి
జూన్ 5, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
- ●Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?
- ●‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..

Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?

‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..



