త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jupally Krishna Rao | నేన‌న్న‌ది అబ‌ద్ద‌మైతే రాజీనామా చేస్తా.. నా ద‌గ్గ‌రున్న ఆధారాలిస్తా.. చ‌ర్చ‌కు రండి

Jupally Krishna Rao | గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం రూ.7.3 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేసింద‌ని.. కేటీఆర్ ఇంకా బుకాయిస్తున్నార‌ని మంత్రి జూపల్లి కృష్ణారావు విమ‌ర్శించారు. వారు చేసిన‌ అప్పుల వివరాలపై చర్చకు సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.74 వేల కోట్ల అప్పు చేసిందన్నారు.

S

Telangana | Published On Jul 2, 2026, 3.57 pm IST

Jupally Krishna Rao | నేన‌న్న‌ది అబ‌ద్ద‌మైతే రాజీనామా చేస్తా.. నా ద‌గ్గ‌రున్న ఆధారాలిస్తా.. చ‌ర్చ‌కు రండి
Advertisement
  • కేటీఆర్, హ‌రీశ్‌రావు ఇంకా బుకాయిస్తున్న‌రు
  • బీఆర్ఎస్ ప్ర‌భుత్వం 7.3 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేసింది
  • లేదంటే అప్పులు చేయ‌లేద‌ని కేసీఆరే చెప్పాలి
  • మంత్రి జూప‌ల్లి కృష్ణారావు డిమాండ్‌

Jupally Krishna Rao | త్రినేత్ర‌.న్యూస్‌: గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం రూ.7.3 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేసింద‌ని.. కేటీఆర్ ఇంకా బుకాయిస్తున్నార‌ని మంత్రి జూపల్లి కృష్ణారావు విమ‌ర్శించారు. వారు చేసిన‌ అప్పుల వివరాలపై చర్చకు సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.74 వేల కోట్ల అప్పు చేసిందన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాన‌ని.. ఇది అబద్ధమైతే రాజీనామా చేసేందుకు రెడీ అని పేర్కొన్నారు. గురువారం ఆయ‌న మీడియాతో మ‌ట్లాడారు.

ఒక్కో రైతు నుంచి రూ.20 లక్షలు వసూలు చేస్తారా? మేం చేసిన ఆరోపణలపై కేసీఆర్‌ ఎందుకు మాట్లాడ‌డు. నా వద్ద ఉన్న రికార్డులు, కాగితాలు ఇస్తా.. చర్చకు రావాలి. మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ ఇంకా బుకాయిస్తున్నారు. బీఆర్‌ఎస్ హ‌యాంలో చేసిన అప్పులను కేసీఆర్ మీడియాకు చెప్పాలి. ఆ అప్పులకు నెలకు రూ.6 వేల కోట్ల వడ్డీ కడుతున్నాం. కేసీఆర్‌, హ‌రీశ్‌రావు, కేటీఆర్ చర్చ‌కు రాని.. నేను కూడా అమ‌రు వీరుల స్థూపం వ‌ద్ద‌కు వ‌స్తా. అర‌గంట‌లో అక్క‌డుంటా అని జూపల్లి పేర్కొన్నారు.

కాగా చ‌ర్చ‌కు ర‌మ్మ‌నేది మీరే.. వ‌చ్చే నాయ‌కుల‌ను అడ్డుకునేది మీ పోలీసులే అని జ‌ర్న‌లిస్టులు జూపల్లిని ప్ర‌శ్నించ‌గా నేనొస్తున్నా.. నేనొస్తున్నా అంటూ స‌మాధాన‌మిస్తూ వెళ్లిపోయారు.

మరోవైపు అప్పులపై చర్చించేందుకు తెలంగాణ భవన్‌కు వస్తానన్న మంత్రి జూపల్లి ఎందుకు రాలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆయన కోసం కేటీఆర్‌ వేచి చూస్తున్నారన్నారు. చర్చకు సవాల్‌ విసిరిన మంత్రులు తోక ముడిచి పారిపోయారని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement