Chanagani Dayakar | మీరు మగాళ్లయితే చర్చకు రండి
Chanagani Dayakar | కేసీఆర్ కొడుకు కేటీఆర్ అయితే, కేసీఆర్ అల్లుడు హరీష్ రావు అయితే దమ్ముంటే ఆధారాలతో అసెంబ్లీకి రావాలని టీపీసీసి ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ సవాల్ విసిరారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై, మా కాంగ్రెస్ రెండేండ్ల పాలనపై సీఎం రేవంత్ అసెంబ్లీలో చర్చకు సిద్ధమని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
- కేసీఆర్ కొడుకు కేటీఆర్ అయితే, కేసీఆర్ అల్లుడు హరీష్ రావు అయితే ఆధారాలతో అసెంబ్లీకి రావాలి
- యాదగిరి నరసింహాస్వామి సాక్షిగా మిమ్మల్నీ అసెంబ్లీ గేట్లు కూడా తాకనియ్యం
- విద్యార్థులతో కలిసి మిమ్ముల్ని ఉరికిచ్చి తంతం
- కేటీఆర్, హరీశ్‌రావుపై చనగాని దయాకర్ ఫైర్
త్రినేత్ర.న్యూస్: కేసీఆర్ కొడుకు కేటీఆర్ అయితే, కేసీఆర్ అల్లుడు హరీష్ రావు అయితే దమ్ముంటే ఆధారాలతో అసెంబ్లీకి రావాలని టీపీసీసి ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ సవాల్ విసిరారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై, మా కాంగ్రెస్ రెండేండ్ల పాలనపై సీఎం రేవంత్ అసెంబ్లీలో చర్చకు సిద్ధమని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీలో మాట్లాడలేని చేతగాని దద్దమ్మలు కేటీఆర్, హరీష్ రావు అని ధ్వజమెత్తారు. మగాళ్లయితే అసెంబ్లీలో చర్చకు రావాలన్నారు. రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం మీకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మీ టఫ్కు టమార విద్యలు ప్రజలు గమనిస్తున్నరు
యాదగిరి నర్సింహాస్వామి సాక్షిగా కేటీఆర్, హరీష్ రావును అసెంబ్లీ గేట్లు తాకనీయ్యం. మీ టఫ్కు టమార విద్యలు ప్రజలు గమనిస్తున్నారు. నీతి మాలిన చర్యలు ప్రజలు చూస్తున్నారు. గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇవ్వని దద్దమ్మలు మీరు. అందుకే వేలాది మంది విద్యార్థులు మిమ్ముల్ని భూ స్థాపితం చేశారు. గురుకులలలో కార్పొరేట్ విద్యను పేదలు చదువుకుంటుంటే మీ కండ్లు మండుతున్నాయి. ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణలో నడవదు. తెలంగాణ విద్యార్థులతో మిమ్ముల్ని ఉరికిచ్చి తంతం అని దయాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెన్యువల్ అయితడు..
రైతులకు, మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తుండు. 2029లో కూడా ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి రెన్యువల్ అవుతాడు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు రక్షణ. ప్రజల విశ్వాసాన్ని పెంచే ప్రజాపాలన నడుస్తుంది
ఇప్పటికైనా మీ అహంకారం తగ్గించుకుంటే మంచిది అని చనగాని హితవు పలికారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం
- ●Anchor Charmilla | బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ
- ●US Debt | పీకల్లోతు అప్పుల్లో అమెరికా.. 40 ట్రిలియన్ డాలర్లకు చేరిన ప్రభుత్వ రుణం..
- ●Rajiv Gandhi | రాజీవ్ గాంధీకి నేతల నివాళులు
- ●IIT Madras | ఐఐటీ మద్రాస్‌లో మెడిసిన్.. ఇంజినీర్లతోపాటు వైద్యులు కూడా..
- ●Mamitha Baiju | సూర్య, మమితా బైజు కాంబోలో అచలుడు మూవీ - సగం షూటింగ్ తర్వాత ఎందుకు ఆగిపోయిందంటే?

Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం

Anchor Charmilla | బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ

US Debt | పీకల్లోతు అప్పుల్లో అమెరికా.. 40 ట్రిలియన్ డాలర్లకు చేరిన ప్రభుత్వ రుణం..

Rajiv Gandhi | రాజీవ్ గాంధీకి నేతల నివాళులు





