Manipur Violence | మణిపూర్‌లో మళ్లీ హింస.. గ్రామంపై కాల్పులు, ఇళ్లకు నిప్పు.. ముగ్గురు మృతి
Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి హింస (Manipur Violence) చెలరేగింది. గ్రామంపై గుర్తుతెలియని సాయుధ దుండగులు శుక్రవారం తెల్లవారుజామున దాడికి పాల్పడ్డారు. పలువురిపై కాల్పులు జరిపి ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి హింస (Manipur Violence) చెలరేగింది. కాంగ్‌పోక్‌పి (Kangpokpi) జిల్లాలోని న్యూ కీథెల్‌మాన్‌బి (New Keithelmanbi) ప్రాంతం పరిధిలోని లోయిబోల్ (Loibol) గ్రామంపై గుర్తుతెలియని సాయుధ దుండగులు శుక్రవారం తెల్లవారుజామున దాడికి పాల్పడ్డారు. పలువురిపై కాల్పులు జరిపి ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
తెల్లవారుజామున 4:10 గంటల సమయంలో ఈ దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆయుధాలతో వచ్చిన సాయుధ ముఠా గ్రామస్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పలు ఇళ్లకు నిప్పంటించారు. ఈ దాడితో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరణించిన ముగ్గురిని లెతోఖోంగం హావ్‌కిప్, తిన్‌మేరీ హావ్‌కిప్, జంగ్‌మిన్‌లాల్ హావ్‌కిప్‌గా గుర్తించారు. ఈ సంఘటనతో ఆ గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించింది. దాడికి దారితీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు, గ్రామంపై దాడి చేసిన సాయుధ మిలిటెంట్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దాడికి ఇప్పటి వరకూ ఏ సంస్థ బాధ్యత వహించలేదు.
Also Read..
టీవీకే బిగ్ ట్విస్ట్.. తిరుచ్చి ఈస్ట్ నుంచి రాఘవ లారెన్స్ పోటీ..?
సుఖోయ్ ఎస్‌యూ-57 తయారుచేద్దాం.. భారత్‌కు పుతిన్ కీలక ప్రతిపాదన
ధనుష్ సినిమాలో సాయి పల్లవి షాకింగ్ రోల్ - లేడీ సింగంగా నాచురల్ బ్యూటీ
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం
- ●Anchor Charmilla | బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ
- ●US Debt | పీకల్లోతు అప్పుల్లో అమెరికా.. 40 ట్రిలియన్ డాలర్లకు చేరిన ప్రభుత్వ రుణం..
- ●Rajiv Gandhi | రాజీవ్ గాంధీకి నేతల నివాళులు
- ●IIT Madras | ఐఐటీ మద్రాస్‌లో మెడిసిన్.. ఇంజినీర్లతోపాటు వైద్యులు కూడా..
- ●Mamitha Baiju | సూర్య, మమితా బైజు కాంబోలో అచలుడు మూవీ - సగం షూటింగ్ తర్వాత ఎందుకు ఆగిపోయిందంటే?

Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం

Anchor Charmilla | బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ

US Debt | పీకల్లోతు అప్పుల్లో అమెరికా.. 40 ట్రిలియన్ డాలర్లకు చేరిన ప్రభుత్వ రుణం..

Rajiv Gandhi | రాజీవ్ గాంధీకి నేతల నివాళులు






