Stock Markets | స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లోనే.. పెట్టుబడిదారుల్లో ఊపందుకున్న సెంటిమెంట్..
Stock Markets | అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గి మళ్లీ చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లపై పాజిటివ్ ప్రభావం పడింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవ్వగా, దేశీయ సూచీలు సైతం వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ తరువాత పుంజుకుని కొత్త గరిష్టాలను నమోదు చేశాయి.
Stock Markets | అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గి మళ్లీ చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లపై పాజిటివ్ ప్రభావం పడింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవ్వగా, దేశీయ సూచీలు సైతం వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ తరువాత పుంజుకుని కొత్త గరిష్టాలను నమోదు చేశాయి. ముడి చమురు ధరలు తగ్గడం కూడా మార్కెట్ల ర్యాలీకి కారణమైంది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న చర్చలు మార్కెట్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. గురువారం సెషన్‌లో సెన్సెక్స్ 579.48 పాయింట్లు (0.75 శాతం) మేర లాభపడి 77,502.12 వద్ద ముగియగా, నిఫ్టీ50 సూచీ 169.85 పాయింట్లు (0.71 శాతం) పెరిగి 24,175.70 వద్ద స్థిరపడింది. అలాగే విస్త్రత మార్కెట్ సూచీలు కూడా లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.5 శాతం పెరగ్గా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 1.27 శాతం ఎగబాకింది.
భారీగా ఎగబాకిన ఐటీ షేర్లు..
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ సూచీ భారీగా లాభాలను నమోదు చేసింది. ఏకంగా 4.64 శాతం ఎగసింది. మే తరువాత ఒకే రోజులో అత్యధిక లాభాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది మొదటి అర్థభాగంలో దాదాపు 30 శాతం మేర నష్టపోయిన ఈ సూచీ గురువారం ర్యాలీతో మళ్లీ పుంజుకునే సంకేతాలను ఇచ్చింది. ఐటీ రంగంపై పాజిటివ్ ధోరణిని పెంచింది. గ్లోబల్ ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ స్టాక్స్‌లోనూ ర్యాలీ కొనసాగడంతో దేశీయ ఐటీ స్టాక్స్‌కు బలం లభించింది. అలాగే నిఫ్టీ కన్‌జ్యూమర్ డ్యూరబుల్స్, నిఫ్టీ రియాల్టీ, సిమెంట్, కెమికల్స్, ఆటో సూచీలు 1 శాతానికి పైగా లాభాలతో ముగిశాయి. ఇక నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 0.40 శాతం పతనం కాగా టాప్ లూజింగ్ ఇండెక్స్‌గా నిలిచింది. మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ దేశాల మధ్య దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కోసం కసరత్తు జరుగుతుండడంతో పెట్టుబడిదారుల్లో పాజిటివ్ వాతావరణం నెలకొంది. దీంతో భారీ ఎత్తున కొనుగోళ్లు చేపట్టారు.
స్థిరంగా కొనసాగుతున్న చమురు ధరలు..
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం కూడా మార్కెట్లకు కలసి వచ్చింది. అయితే సెషన్ ప్రారంభంలో చమురు ధరలు తగ్గినప్పటికీ తరువాత స్థిరంగా కొనసాగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 70 డాలర్ల వద్ద స్థిరంగా ఉండగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 67 డాలర్ల వద్ద నిలిచింది. ఫారెక్స్ మార్కెట్‌లో భారత రూపాయి విలువ మరోమారు పతనమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 15 పైసలు తగ్గిన రూపాయి 95.39 వద్ద స్థిరపడింది. అయితే ఈక్విటీ మార్కెట్లలో పాజిటివ్ సెంటిమెంట్ కొనసాగుతున్నా భారత రూపాయి విలువ పడిపోతుండడం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న నేపథ్యంలో పెట్టుబడిదారులు ప్రస్తుతం డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది రూపాయిపై ప్రభావం పడేలా చేస్తోంది. దీంతో రానున్న రోజుల్లో రూపాయి విలువ ఎలా మారుతుందనే విషయం ఉత్కంఠగా మారింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana Brahmin Samkshema Parishad | బ్రాహ్మణ పరిషత్‌కు రూ. 31 కోట్లు విడుదల చేయండి..
- ●OPS | పెన్షన్ మా హక్కు.. అంబేద్కర్ వర్సిటీలో ఉద్యోగుల నిరసన
- ●Nimisha Sajayan | సినిమా కోసం 14 కిలోల బరువు పెరిగిన మలయాళం హీరోయిన్
- ●Forum For Good Governance | ఏ ఎమ్మెల్యే కూడా ఆదాయపు పన్ను చెల్లించడం లేదు
- ●Sircilla | ప్రత్యామ్నాయ పంటలతో నిరంతర ఆదాయం : కలెక్టర్ గరిమ అగ్రవాల్
- ●India State-wise Poverty Rate | ఇండియాలో పేదరికం లెక్కలు ఇవి.. మరి ఆ ఫ్రీ రేషన్ బియ్యం ఎవరి పాలవుతోంది?

Telangana Brahmin Samkshema Parishad | బ్రాహ్మణ పరిషత్‌కు రూ. 31 కోట్లు విడుదల చేయండి..

OPS | పెన్షన్ మా హక్కు.. అంబేద్కర్ వర్సిటీలో ఉద్యోగుల నిరసన

Nimisha Sajayan | సినిమా కోసం 14 కిలోల బరువు పెరిగిన మలయాళం హీరోయిన్

Forum For Good Governance | ఏ ఎమ్మెల్యే కూడా ఆదాయపు పన్ను చెల్లించడం లేదు






