త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Earthquake | ఈశాన్య రాష్ట్రాల‌ను వ‌ణికించిన భూకంపం.. ప‌రుగులు తీసిన జ‌నం

Earthquake | ఈశాన్య రాష్ట్రాలను (Northeast) భూకంపం వ‌ణికించింది. మంగ‌ళ‌వారం ఉద‌యం మ‌ణిపూర్ (Manipur), అస్సాం, మేఘాల‌యా, నాగాలాండ్‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో భూకంపం సంభ‌వించింది.

D

National | Published On Apr 21, 2026, 12.17 pm IST

Earthquake | ఈశాన్య రాష్ట్రాల‌ను వ‌ణికించిన భూకంపం.. ప‌రుగులు తీసిన జ‌నం
Advertisement

Earthquake | ఈశాన్య రాష్ట్రాలను (Northeast) భూకంపం వ‌ణికించింది. మంగ‌ళ‌వారం ఉద‌యం మ‌ణిపూర్ (Manipur), అస్సాం, మేఘాల‌యా, నాగాలాండ్‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో భూకంపం సంభ‌వించింది. రిక్ట‌రు స్కేలుపై భూకంపం తీవ్ర‌త 5.2గా నమోదైన‌ట్లు నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మోల‌జీ (National Centre for Seismology) వెల్ల‌డించింది. మణిపూర్‌లోని కామ్‌జాంగ్ ( Kamjong) వద్ద భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవాళ ఉద‌యం 5:59 గంట‌ల స‌మ‌యంలో భూ ప్ర‌కంప‌న‌లు న‌మోద‌య్యాయి. భూమికి 62 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.

ఈ ప్ర‌కంప‌న‌ల‌తో గాఢ నిద్ర‌లో ఉన్న‌ ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. అయితే, అదృష్ట‌వ‌శాత్తూ ఎలాంటి ప్రాణ‌న‌ష్టం సంభ‌వించ‌లేదు. ఎవ‌రికీ గాయాలు కూడా కాలేదు. ఏప్రిల్ నెలలో ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం సంభవించడం ఇది రెండోసారి. ఈనెల 7వ తేదీన మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3, 3.0గా నమోదైంది. ఇలా వ‌రుస ప్రకంప‌న‌ల‌తో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

Also Read..

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ లాక్ - డ్రాగ‌న్ టైటిల్ ఛేంజ్?

గురుద్వారాలో ఘ‌ర్ష‌ణ‌.. పెప్ప‌ర్ స్ప్రే, క‌త్తులు, తుపాకీతో దాడి.. 11 మందికి గాయాలు

అమెజాన్‌లో ప్ర‌త్యేక సేల్‌.. ట్యాబ్‌ల‌పై భారీగా డిస్కౌంట్‌..

Advertisement
Advertisement