Fire breaks out at Hospital | ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 9 మంది నవజాత శిశువులు సహా..
Fire breaks out at Hospital | మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీనగర్‌లోని (Chhatrapati Sambhajinagar) ఏషియన్ హాస్పిటల్‌లో (Asian Hospital) అగ్నిప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన సిబ్బంది 9 మంది నవజాత శిశువులు సహా 58 మంది పేషెంట్స్‌ను రక్షించారు. దీంతో ప్రాణనష్టం తప్పింది.
Fire breaks out at Hospital | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్రలోని ఓ ఆసుపత్రిలో (Fire breaks out at Hospital) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఛత్రపతి సంభాజీనగర్‌లోని (Chhatrapati Sambhajinagar) ఆకాశవాణి చౌక్ (Akashwani Chowk) సమీపంలో గల ఏషియన్ హాస్పిటల్‌లో (Asian Hospital) శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఊహించని ఈ ప్రమాదంతో రోగులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రమాద సమయంలో నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లోని 9 మంది నవజాత శిశువులతో కలిపి మొత్తం 58 మంది పేషెంట్స్ ఉన్నారు. పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. నవజాత శిశువులను సురక్షితంగా బయటకు తరలించారు. ఆ తర్వాత రోగులను సైతం అక్కడి నుంచి తరలించారు. దీంతో ప్రాణాపాయం తప్పినట్లైంది.
ఈ ఘటనలో పేషెంట్స్, సిబ్బందికి ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చింది. ఏసీ యూనిట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం నేపథ్యంలో నవజాత శిశువులను ఘాటీ, ఎంజీఎం, సంజీవని ఆసుపత్రులకు తరలించారు.
Chhatrapati Sambhajinagar, Maharashtra: A fire broke out at Asian Hospital near Akashwani Chowk at around 2:45 AM, reportedly due to a short circuit in an AC unit in the NICU. All 58 patients, including nine newborns, were safely evacuated. The newborns were shifted to GhatI… pic.twitter.com/AGKJqNqIg2
— IANS (@ians_india) September 4, 2026
Also Read..
మెలోనీ సరికొత్త రికార్డు.. ఇటలీ చరిత్రలోనే అత్యధిక కాలం పనిచేసిన ప్రభుత్వంగా రికార్డు
లక్సెంబర్గ్ వెంచర్ డేస్‌లో ఉపన్యాసమివ్వండి.. కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం
తాజావార్తలు
- ●KTR | లక్సెంబర్గ్ వెంచర్ డేస్‌లో ఉపన్యాసమివ్వండి.. కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం
- ●Giorgia Meloni | మెలోనీ సరికొత్త రికార్డు.. ఇటలీ చరిత్రలోనే అత్యధిక కాలం పనిచేసిన ప్రభుత్వంగా రికార్డు
- ●Harish Rao | వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి మటుమాయమైంది.. వెయ్యి పడగలతో అవినీతి రాజ్యమేలుతోంది
- ●Harish Rao | తాగునీరు లేక విద్యార్థుల అవస్థలు.. కాగజ్‌నగర్ ఎస్టీ బాయ్స్ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన హరీశ్ రావు
- ●Uttam Kumar Reddy | సమ్మక్క సారక్క బ్యారేజీకి ఎన్ఓసీ ఇవ్వండి.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి
- ●Airtel | ఎయిర్టెల్ బంపర్ ఆఫర్.. ఏ భాషనైనా నేర్పించే డ్యుయోలింగో ప్లాట్‌ఫామ్, ఏడాదిపాటు ఫ్రీ..

KTR | లక్సెంబర్గ్ వెంచర్ డేస్‌లో ఉపన్యాసమివ్వండి.. కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం

Giorgia Meloni | మెలోనీ సరికొత్త రికార్డు.. ఇటలీ చరిత్రలోనే అత్యధిక కాలం పనిచేసిన ప్రభుత్వంగా రికార్డు

Harish Rao | వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి మటుమాయమైంది.. వెయ్యి పడగలతో అవినీతి రాజ్యమేలుతోంది

Harish Rao | తాగునీరు లేక విద్యార్థుల అవస్థలు.. కాగజ్‌నగర్ ఎస్టీ బాయ్స్ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన హరీశ్ రావు





