త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | లక్సెంబర్గ్ వెంచర్ డేస్‌లో ఉప‌న్యాస‌మివ్వండి.. కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం

KTR | కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం అందింది. యూరప్‌లో స్టార్టప్‌లు, వెంచర్ క్యాపిటల్, పెట్టుబడుల రంగాలకు సంబంధించిన ప్రముఖ కార్యక్రమం లక్సెంబర్గ్ వెంచర్ డేస్-2026లో కీలకోపన్యాసం చేయాలని నిర్వాహకులు శుక్ర‌వారం కేటీఆర్‌ను ఆహ్వానించారు.

S

Telangana | Published On Sep 4, 2026, 1.25 pm IST

KTR | లక్సెంబర్గ్ వెంచర్ డేస్‌లో ఉప‌న్యాస‌మివ్వండి.. కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం
Advertisement
  • అక్టోబ‌ర్ 14, 15 తేదీల్లో కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌
  • ప్ర‌పంచ వెంచ‌ర్ క్యాపిట‌లిస్టులు, పెట్టుబ‌డిదారుల‌తో స‌మావేశం కానున్న కేటీఆర్‌

త్రినేత్ర‌.న్యూస్‌: కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం అందింది. యూరప్‌లో స్టార్టప్‌లు, వెంచర్ క్యాపిటల్, పెట్టుబడుల రంగాలకు సంబంధించిన ప్రముఖ కార్యక్రమం లక్సెంబర్గ్ వెంచర్ డేస్-2026లో కీలకోపన్యాసం చేయాలని నిర్వాహకులు శుక్ర‌వారం కేటీఆర్‌ను ఆహ్వానించారు. అక్టోబర్ 14, 15 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమానికి లక్సెంబర్గ్ ప్రైవేట్ ఈక్విటీ అండ్ వెంచర్ క్యాపిటల్ అసోసియేషన్ (LPEA) తరఫున ఆహ్వానం పంపారు. ఈ సందర్భంగా యూరప్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారులు, ఫ్యామిలీ ఆఫీసులు, విధాన నిర్ణేతలు, స్టార్టప్ వ్యవస్థాపకులతో కేటీఆర్ సమావేశమయ్యే అవకాశాలున్నాయి.

ఆసియా, యూరప్ దేశాల్లో పెట్టుబడుల విధానాలు ఎలా భిన్నంగా ఉంటాయి? పెట్టుబడిదారుల రిస్క్ తీసుకునే ధోరణి, స్టార్టప్ వ్యవస్థాపకుల అంచనాలు, పెట్టుబడి అవకాశాలు, అంతర్జాతీయ భాగస్వామ్యం వంటి అంశాలపై ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక సెషన్‌లో కేటీఆర్ మాట్లాడాలని నిర్వాహకులు కోరారు. భారత్‌ను అంతర్జాతీయ పెట్టుబడి, ఆవిష్కరణ వ్యవస్థలతో  అనుసంధానించడంలో కేటీఆర్‌కు ఉన్న అనుభవం యూరప్‌లోని పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులకు ఉపయోగపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. భారత్, ఇతర అంతర్జాతీయ మార్కెట్ల మధ్య పెట్టుబడి సంబంధాలను పెంపొందించడంలో కేటీఆర్‌ దృక్పథం కీలకమని అభిప్రాయపడ్డారు.

యూరప్‌లోని ప్రముఖ పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటల్ సంస్థలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, విధాన నిర్ణేతలు పాల్గొనే ఈ కార్యక్రమం స్టార్టప్ ఫైనాన్సింగ్, వ్యాపార వృద్ధిపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. కాగా గతేడాది జరిగిన లక్సెంబర్గ్ వెంచర్ డేస్‌కు 28 దేశాల నుంచి 3,400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వారిలో 300 మందికిపైగా పెట్టుబడిదారులు, 110 వెంచర్ క్యాపిటల్ ఫండ్ల ప్రతినిధులు ఉన్నారు. European Investment Fund, NATO Innovation Fundతో పాటు యూరప్‌కు చెందిన పలు ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.

ఈ ఏడాది సదస్సులో European Business Angel Network వార్షిక సమావేశం, NATO Innovation Fundతో కలిసి నిర్వహించే Defence Venture Dayతో పాటు యూరప్‌లోని స్టార్టప్‌లు, స్కేల్‌అప్‌లకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement