Food Body Officer | గడువు తీరిన బిస్కెట్లు తినాలంటూ.. ఫుడ్ సేఫ్టీ అధికారికి చుక్కలు చూపించిన జనం
Food Body Officer | మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా విజయపూర్ పట్టణంలో ఓ ఫుడ్ సేఫ్టీ అధికారికి (Food Body Officer) స్థానికులు చుక్కలు చూపించారు. గడువు తీరిన బిస్కెట్లు (Expired biscuit packets) తినాలంటూ బలవంతం చేశారు.
త్రినేత్ర.న్యూస్ : తనిఖీల కోసం వెళ్లిన ఓ ఫుడ్ సేఫ్టీ అధికారికి (Food Body Officer) చేదు అనుభవం ఎదురైంది. సదరు అధికారి లంచం తీసుకుని గడువు తీరిన తినుబండారాలు విక్రయిస్తున్న ఓ దుకాణదారుడికి సహకరిస్తున్నాడని ఆరోపిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. గడువు తీరిన బిస్కెట్లను (Expired biscuit packets) మీరే తినండి అంటూ ఆ అధికారికి జనం చుక్కలు చూపించారు. ఈ ఘటన మహారాష్ట్ర (Maharashtra ) ఛత్రపతి శంభాజీనగర్ (Chhatrapati Sambhajinagar) జిల్లా విజయపూర్ పట్టణంలో చోటు చేసుకుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే..? స్థానికంగా ఉన్న ఓ పాన్ షాపులో కొనుగోలు చేసిన మిక్చర్ తిని రెండేళ్ల చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చిన్నారి పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ ఘటనతో బాధిత కుటుంబ సభ్యలతోపాటూ స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వారు ఛత్రపతి సంభాజీనగర్‌లోని FDA కార్యాలయాన్ని సంప్రదించి ఫిర్యాదు చేశారు.
స్థానికుల ఫిర్యాదుతో ఎఫ్‌డీఏ అధికారి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దుకాణంలో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో గడువు తీరిన కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు బయటపడ్డాయి. అయితే, తనిఖీలకు ముందే చిన్నారి అస్వస్థతకు కారణమైన స్నాక్ ప్యాకెట్లను దుకాణదారుడు మాయం చేశాడని స్థానికులు ఆరోపించారు. అంతేకాదు ఎక్స్‌పైరీ అయిన ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న అధికారి.. సదరు దుకాణదారుడిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. లంచం తీసుకొని దుకాణదారుడికి ఎఫ్‌డీఏ అధికారి సహకరిస్తున్నారంటూ ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో తనిఖీల కోసం వెళ్లిన అధికారిని స్థానికులు చుట్టుముట్టారు. గడువు తీరిన బిస్కెట్లను మీరే తినండి అంటూ బలవంతం చేశారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రతా ఉల్లంఘనలపై మహారాష్ట్ర ఎఫ్‌డీఏ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఘటన వెలుగులోకి వచ్చింది.
CHHATRAPATI SAMBHAJINAGAR — An FDA officer was cornered and forcibly fed expired biscuits by an angry crowd in the Vaijapur area of Maharashtra. pic.twitter.com/Pq5rUfBenO
— Truth India Live (@Truthindialive) August 29, 2026
Also Read..
ఫుడ్ ప్యాకెట్లపై "రెడ్" వార్నింగ్.. సుప్రీంకోర్టుకు FSSAI కీలక ప్రతిపాదన
పుజల్ సెంట్రల్ జైలులో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీలు
స్మార్ట్ ఫోన్ కొంటున్నారా.. కొద్ది రోజులు ఆగండి.. ఎందుకంటే..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sanjay Dutt | మంత్రి సమక్షంలోనే.. మరాఠీ మాట్లాడేందుకు నిరాకరించిన బాలీవుడ్ స్టార్
సెప్టెంబర్ 7, 2026

Ashwini Manohar Paul | 100 అడుగుల లోయలోకి దూకి.. ముగ్గురు పిల్లలతో కలిసి మహిళా రెజ్లర్ ఆత్మహత్య
సెప్టెంబర్ 4, 2026

SIAM Sales Report | కార్లలో మహారాష్ట్ర.. బైక్‌లలో యూపీ.. SIAM రిపోర్ట్..
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం
- ●S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు
- ●MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి
- ●Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి
- ●Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ

Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం

S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు

MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి

Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు



