త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Crime News | అండదానం ముసుగులో అక్రమ నెట్‌వర్క్‌!

Crime News | అండం దానం పేరుతో మహిళలను రిక్రూట్‌ చేసి, ఏఆర్టీ బ్యాంకులు, ఫెర్టిలిటీ కేంద్రాలకు తరలిస్తున్నారనే ఆరోపణలపై మల్కాజిగిరి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే అరెస్టయిన ఏ9 నిందితుడు ఎమిరిశెట్టి దుర్గాప్రసాద్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

P

Telangana | Published On Nov 27, 2026, 10.20 pm IST

Crime News | అండదానం ముసుగులో అక్రమ నెట్‌వర్క్‌!
Advertisement
  • ఓయాసిస్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో మల్కాజిగిరి పోలీసుల సోదాలు
  • ల్యాప్‌టాప్‌లు, డిజిటల్‌ పరికరాలు, కీలక పత్రాలు స్వాధీనం
  • ఏఆర్టీ కేంద్రాలు, మధ్యవర్తుల లింకులపై ఆరా
  • కస్టడీలో ఏ9 నిందితుడు.. ఆర్థిక లావాదేవీలపై విచారణ

Crime News | అండం దానం పేరుతో మహిళలను రిక్రూట్‌ చేసి, ఏఆర్టీ బ్యాంకులు, ఫెర్టిలిటీ కేంద్రాలకు తరలిస్తున్నారనే ఆరోపణలపై మల్కాజిగిరి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే అరెస్టయిన ఏ9 నిందితుడు ఎమిరిశెట్టి దుర్గాప్రసాద్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడి పరిచయాలు, ఆర్థిక లావాదేవీలు, ఏఆర్టీ బ్యాంకులు, ఫెర్టిలిటీ కేంద్రాలతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో భాగంగా బేగంపేట సర్దార్‌ పటేల్‌ రోడ్డులోని సెంటర్‌ పాయింట్‌లో ఉన్న ఓయాసిస్‌ హాస్పిటల్స్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ల్యాప్‌టాప్‌లు, డిజిటల్‌ పరికరాలు, సంస్థాగత రికార్డులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మహిళల రిక్రూట్‌మెంట్‌, రిజిస్ట్రేషన్‌, స్క్రీనింగ్‌, అండం దానం కోసం రిఫరల్‌కు సంబంధించిన వివరాలను సేకరించారు.

కమీషన్ల వ్యవహారంపై దృష్టి

మహిళలకు చెల్లించిన పరిహారం, మధ్యవర్తులకు ఇచ్చిన మొత్తాలు, ఏఆర్టీ బ్యాంకులు, ఫెర్టిలిటీ కేంద్రాల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు. మహిళలను రిక్రూట్‌ చేసి వివిధ కేంద్రాలకు పంపించే వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ ఉందా? ఇందులో ఎవరెవరు భాగస్వాములయ్యారు? కమీషన్లు ఎవరికి అందాయి? అనే కోణాల్లో విచారణ సాగిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న డిజిటల్‌ పరికరాలు, పత్రాలను ఫోరెన్సిక్‌ విశ్లేషణకు పంపిస్తున్నారు. డోనర్‌ రికార్డులు, సమ్మతి పత్రాలు, వైద్య వివరాలు, రిజిస్ట్రేషన్‌, స్క్రీనింగ్‌ విధానాలను పరిశీలిస్తున్నారు. అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీ (రెగ్యులేషన్‌) చట్టం–2021 నిబంధనలు పాటించారా లేదా అన్నది నిర్ధారించనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి మహిళలను ఆర్థిక ప్రయోజనాల పేరుతో తీసుకొచ్చారా? మభ్యపెట్టి అండం దానం చేయించారా? నకిలీ పత్రాలు సృష్టించారా? ఏజెంట్లు, మధ్యవర్తులు, సంస్థల ప్రతినిధుల పాత్ర ఎంత? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. డిజిటల్‌ ఆధారాల విశ్లేషణ పూర్తయితే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్న‌ది.

Advertisement
Advertisement