త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు

Gurrala Nagaraju | భారత్‌–దక్షిణాఫ్రికా మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాల బలోపేతమే లక్ష్యంగా జేఎన్‌ఎస్‌ క్లౌడ్‌ సొల్యూషన్స్‌ సీఈఓ గూర్రాల నాగరాజు ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026లో పాల్గొననున్నారు. డిసెంబర్‌ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సులో ఆయన దక్షిణాఫ్రికా ప్రతినిధి బృందం తరఫున హాజరుకానున్నారు.

P

Telangana | Published On Nov 27, 2026, 10.59 pm IST

Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు
Advertisement

Gurrala Nagaraju | భారత్‌–దక్షిణాఫ్రికా మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాల బలోపేతమే లక్ష్యంగా జేఎన్‌ఎస్‌ క్లౌడ్‌ సొల్యూషన్స్‌ సీఈఓ గూర్రాల నాగరాజు ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026లో పాల్గొననున్నారు. డిసెంబర్‌ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సులో ఆయన దక్షిణాఫ్రికా ప్రతినిధి బృందం తరఫున హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సదస్సు ద్వారా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ వ్యాపార భాగస్వామ్యాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్‌–2047 విజన్‌కు ఈ సదస్సు దోహదపడనుంది.

జోహన్నెస్‌బర్గ్‌లోని భారత కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం, గౌరవ కాన్సుల్‌ జనరల్‌ ఎస్‌. కోవెంతన్‌ నేతృత్వంలో దక్షిణాఫ్రికా ప్రతినిధి బృందం ఈ సదస్సులో పాల్గొననుంది. ఇందులో భాగంగా నాగరాజు దక్షిణాఫ్రికా–తెలంగాణ మధ్య ద్వైపాక్షిక పెట్టుబడులు, ఐటీ, కృత్రిమ మేధ (ఏఐ), ఫార్మాస్యూటికల్స్‌, మైనింగ్‌, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై దృష్టి సారించనున్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికా ప్రతినిధి బృందంలో భాగంగా అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ, దక్షిణాఫ్రికా మధ్య పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలను పెంపొందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇరు ప్రాంతాలకు చెందిన సంస్థలు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీతో పాటు స్థిరమైన ఆర్థిక అభివృద్ధికి మార్గం సుగమమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జేఎన్‌ఎస్‌ క్లౌడ్‌ సొల్యూషన్స్‌ సీఈఓగా, ఇండియా సౌత్‌ ఆఫ్రికా బిజినెస్‌ ఫోరం (ఐఎస్‌బీఎఫ్‌) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు (డిజిటల్‌ స్ట్రాటజీ)గా నాగరాజు భారత్‌–దక్షిణాఫ్రికా సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నారు. డిజిటల్‌ పరివర్తన, అంతర్జాతీయ పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాల ప్రోత్సాహంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ పర్యటన ద్వారా దక్షిణాఫ్రికా పెట్టుబడులను తెలంగాణకు ఆకర్షించడంతో పాటు, తెలంగాణకు చెందిన సంస్థలకు దక్షిణాఫ్రికా మార్కెట్‌లో వ్యాపార అవకాశాలను పరిచయం చేయాలని నాగరాజు లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా ఇరు ప్రాంతాల మధ్య దీర్ఘకాలిక వాణిజ్య సంబంధాలకు బాటలు వేయాలని భావిస్తున్నారు.

Advertisement
Advertisement