DGP CV Anand | పెట్రోలింగ్ పెంచండి.. ఆస్తి నేరాలకు చెక్ పెట్టండి
DGP CV Anand | ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణకు పెట్రోలింగ్ పెంచాలని డీజీపీ సీవీ ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి నిరంతరం నిఘా పెట్టాలని, సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
- నేరాలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలి
- సైబర్ బాధితులకు సొమ్ము రికవరీలో కామారెడ్డి పోలీసుల పనితీరు భేష్
- కామారెడ్డి జిల్లాలో 61 శాతం నగదు రికవరీ.. డీజీపీ సీవీ ఆనంద్ ప్రశంసలు
- డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ
DGP CV Anand | ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణకు పెట్రోలింగ్ పెంచాలని డీజీపీ సీవీ ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి నిరంతరం నిఘా పెట్టాలని, సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సైబర్ మోసాల్లో బాధితులు కోల్పోయిన నగదులో 61 శాతం రికవరీ చేయడంతోపాటు మొబైల్ ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో కామారెడ్డి జిల్లా పోలీసులు చూపిన పనితీరును అభినందించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన క్రైమ్ సమీక్షలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులకు సమీపంలో ఉన్నందున అంతర్రాష్ట్ర నేర ముఠాల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు. వాటి కట్టడికి చేపట్టిన ఆపరేషన్ కవచ్ మంచి ఫలితాలిస్తోందని, మరింత సమర్థంగా కొనసాగించాలని చెప్పారు. డ్రగ్స్ నిర్మూలనలో పోలీసులతోపాటు ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని, బాధితులకు తక్షణ సాయం అందించి నగదు రికవరీకి ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
కొత్త పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కామారెడ్డి పట్టణంలో మరో పోలీస్‌స్టేషన్, బాన్సువాడలో పోలీస్‌స్టేషన్‌తోపాటు మహిళా, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డీజీపీ సూచించారు. బ్లూకోల్ట్స్, ట్రాఫిక్, టెక్ టీమ్‌లకు అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో సైబర్ నేరాల నగదు రికవరీపై ఎస్పీ రాజేశ్ చంద్ర వివరించారు. 2026 నవంబర్ నాటికి బాధితులు కోల్పోయిన నగదులో 61 శాతం తిరిగి రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది పోగొట్టుకున్నట్లు ఫిర్యాదులందిన 7,285 మొబైల్ ఫోన్లలో 3,683 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, రాష్ట్రంలో జిల్లా ఏడో స్థానంలో ఉందని వెల్లడించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు 25 బ్లాక్‌స్పాట్లను గుర్తించి చర్యలు చేపట్టినట్లు వివరించారు. సమీక్షలో ఐజీ కార్తికేయ, సీఐడీ డీఐజీ నారాయణ నాయక్, డీఐజీ సన్‌ప్రీత్ సింగ్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర తదితర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..
- ●MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు
- ●Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు
- ●Crime News | అండదానం ముసుగులో అక్రమ నెట్వర్క్!
- ●Dy CM Bhatti Vikramarka | తెలంగాణ విద్యుత్ రంగానికి కేంద్రం సహకరించాలి
- ●Minister Uttam | ఎల్‌నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు రూ.10 వేల కోట్లతో ప్రత్యేక కార్యాచరణ

M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..

MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు

Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు

Crime News | అండదానం ముసుగులో అక్రమ నెట్వర్క్!



