Rahul Gandhi | రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ఉత్తరాఖండ్ హల్ద్వానీ (Haldwani)లోని కోత్వాల్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
Rahul Gandhi | త్రినేత్ర.న్యూస్ : ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉత్తరాఖండ్ హల్ద్వానీ (Haldwani)లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) బహిరంగ సభ నిర్వహించిన ప్రదేశంలో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమానికి (Purification Ritual) కులం ఆపాదించారంటూ స్థానిక నివాసి అమిత్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు రాహుల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కోత్వాలీ పోలీసులు వెల్లడించారు. కులాల మధ్య విద్వేషాన్ని పెంచడం, మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా వ్యవహరించడం వంటి అభియోగాలపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రం హల్ద్వానీలో రామ్‌లీలా మైదానంలో ఖర్గే పాల్గొన్న కార్యక్రమ వేదికను శుద్ధి చేయడంపై రాజకీయ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాహుల్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ చర్యను అంటరానితనం, కుల వివక్షగా అభివర్ణించారు. శుద్ధి కార్యక్రమం నిర్వహించిన వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే స్థానిక జవహర నగర్ కాలనీకి చెందిన అమిత్.. రాహుల్‌పై కోత్వాలీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాను షెడ్యూల్డ్ కుల వర్గానికి (వాల్మీకీ) చెందిన వ్యక్తినని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను శ్రీరామ్ సేన ధర్మార్థ సేవా న్యాస్ సభ్యుడిగా ఉన్నట్లు చెప్పారు. హల్ద్వానీలో జరిగిన శుద్ధి కార్యక్రమంలో తాను పాల్గొన్నానని వెల్లడించారు. అయితే, ఆగస్టు 29న ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు తమ సామాజిక వర్గం మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపించారు. ఈ మేరకు రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read..
ఈ వారంలో వస్తున్న 7 ప్రధాన ఐపీవోలు ఇవే.. రూ.1265 కోట్లకు పైగా ఇష్యూలు..
ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. కదిలే బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం
ప్రియురాలిని మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేస్తున్న కోలీవుడ్ హీరో
సంబంధిత వార్తలు

Rahul Gandhi | శుద్ధీకరణ కూడా ఓ రకమైన వివక్షే.. మోదీ సర్కార్‌పై రాహుల్ ఫైర్
ఆగస్టు 29, 2026

కాంగ్రెస్ డిసిప్లిన్ చక్రం: మంత్రులపై చర్యలు ఎలా తీసుకుంటారు? కొండా సురేఖ ఎపిసోడ్‌తో పూర్తి వివరాలు
ఆగస్టు 28, 2026

Harish Rao | రేవంత్.. పాలిటెక్నిక్ పిల్లలను కలిస్తే నీకేం నొప్పి.. వాళ్లేమైనా టెర్రరిస్టులా?
ఆగస్టు 27, 2026
తాజావార్తలు
- ●IPO | ఈ వారంలో వస్తున్న 7 ప్రధాన ఐపీవోలు ఇవే.. రూ.1265 కోట్లకు పైగా ఇష్యూలు..
- ●Delhi Gang Rape | ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. కదిలే బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం
- ●Jayam Ravi | ప్రియురాలిని మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేస్తున్న కోలీవుడ్ హీరో
- ●Anganwadi Teachers | రంగారెడ్డి జిల్లాలో 125 అంగన్వాడీ టీచర్ పోస్టులు.. వచ్చేనెల 10 వరకు దరఖాస్తులు
- ●EPFO 3.0 | ఈపీఎఫ్ఓ 3.0 భారీ అప్డేట్.. యూపీఐ, ఏటీఎం ద్వారా నగదు విత్ డ్రా.. ప్రధాన మార్పులు ఇవే..
- ●Megastar Chiranjeevi | సీడ్ గణేశుడిని పూజించండి.. మీ ఇంట్లోనే మొక్కై ఆశీర్వదిస్తాడు : చిరంజీవి

IPO | ఈ వారంలో వస్తున్న 7 ప్రధాన ఐపీవోలు ఇవే.. రూ.1265 కోట్లకు పైగా ఇష్యూలు..

Delhi Gang Rape | ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. కదిలే బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం

Jayam Ravi | ప్రియురాలిని మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేస్తున్న కోలీవుడ్ హీరో

Anganwadi Teachers | రంగారెడ్డి జిల్లాలో 125 అంగన్వాడీ టీచర్ పోస్టులు.. వచ్చేనెల 10 వరకు దరఖాస్తులు



