Telugu Web Series | కమల్ హాసన్ సూపర్ హిట్ మూవీ టైటిల్‌తో తెలుగు వెబ్‌సిరీస్ – స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఇవే
కమల్‌హాసన్ సూపర్ హిట్ మూవీ పుష్పకవిమానం టైటిల్‌తో తెలుగులో ఓ వెబ్‌సిరీస్ రాబోతుంది. సాయిరోనక్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న ఈ సిరీస్ నవంబర్ 12 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్‌లో బిగ్‌బాస్ భరణి శంకర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
Telugu Web Series | కమల్ హాసన్, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్‌లో రూపొందిన పుష్పక విమానం సినిమా కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. తాజాగా ఈ సూపర్ హిట్ మూవీ టైటిల్‌తో తెలుగులో ఓ వెబ్‌సిరీస్ రాబోతుంది. ఈ సిరీస్ ప్లాట్‌ఫామ్‌తో పాటు స్ట్రీమింగ్ డేట్ సోమవారం కన్ఫామ్ అయ్యాయి.
సాయిరోనక్...
పుష్పకవిమానం పేరుతో రూపొందుతోన్న ఈ వెబ్ సిరీస్‌లో సాయి రోనక్ లీడ్ రోల్‌లో కనిపించబోతున్నాడు. బిగ్‌బాస్ ఫేమ్ భరణి శంకర్‌తో పాటు జగదీష్, రఘు కారుమంచి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మధు దామరాజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌లో హీరో పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ సోమవారం టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పుష్పక్‌రావు అనే పాత్రలో సాయిరోనక్ కనిపించాడు.
టైమ్ ట్రావెల్...
రౌడీలు తరుముకుంటూ వస్తోండగా...వారి నుంచి తప్పించుకోవడానికి పారిపోతూ ఈ వీడియోలో సాయిరోనక్ కనిపించాడు. అతడికి భరణి శంకర్ కనిపించి లిఫ్ట్ లాంటి ఓ టైమ్ మిషన్ ద్వారా గతంలోకి తీసుకెళుతాడు. తండ్రితో పాటు ప్రేమ విషయంలో ఎదురైన తన తప్పులను టైమ్ మిషన్ సాయంతో సరిచేసుకొని ప్రస్తుత కాలానికి వస్తాడు పుష్పక్‌రావు. తన సమస్యలన్నీ తొలగిపోతాయని సంతోషపడతాడు. కానీ గతంలోకి వెళ్లొచ్చిన తర్వాతే సమస్యలతో పాటు శత్రువులు రెట్టింపు అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనే అంశాలతో ఈ వెబ్‌సిరీస్ రూపొందుతోన్నట్లు వీడియోలో చూపించారు. లవ్, ఫాదర్ సెంటిమెంట్‌తో పాటు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఈ సిరీస్ తెరకెక్కుతోన్నట్లు వీడియో ద్వారా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
జియో హాట్‌స్టార్...
జియో హాట్‌స్టార్ తెలుగులో నవంబర్ 12 నుంచి పుష్పకవిమానం వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ తెలుగు వెబ్‌సిరీస్‌కు సతీష్ రెడ్డి మల్లిడి దర్శకత్వం వహించారు. సాయిరోనక్ హీరోగా తెలుగులో ప్రెషర్ కుక్కర్, ఓదెల రైల్వేస్టేషన్, లగ్గం, పాప్‌కార్న్‌తో పాటు పలు చిన్న సినిమాలు చేశాడు.
New Telugu series #PushpakaVimanam premieres Nov 12th on @JioHotstar.
@saironak3 #MadhuDamaraju #BharaniShankar #Jagadeesh #SaisrinivasVadlamani @raghukarumanchi @sreedhargabbar #HarinaSuri #TrupthiBandari @JioHotstarTel_ https://t.co/NBNPqHhkHK
— CinemaRare (@CinemaRareIN) October 26, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | కష్టాల్లో విజయ్ నా పక్కనే ఉన్నాడు – వెయ్యి సార్లు అయిన ప్రపోజ్ చేస్తా – విమర్శలపై రష్మిక స్ట్రాంగ్ కౌంటర్
అక్టోబర్ 26, 2026

Srinidhi Shetty | చిట్‌ఫండ్‌లో డబ్బులు పెట్టి…అప్పులు చేస్తూ…శ్రీనిధి శెట్టి కామెంట్స్
అక్టోబర్ 26, 2026

Wedding | ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ సీనియర్ హీరో కూతురు – వెడ్డింగ్ ఫొటోలు వైరల్
అక్టోబర్ 26, 2026
తాజావార్తలు
- ●Honey Trap Case | ‘మూన్ బేబి 5973’ ఇన్‌స్టా ఐడీతో మల్లారెడ్డి స్టూడెంట్‌కు వల.. హనీట్రాప్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
- ●DMK Ex Minister Corruption Case | తమిళనాడులో ప్రకంపనలు: రూ.100 కోట్ల లంచం కేసులో డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్.. 177 స్కూళ్లే టార్గెట్!
- ●Amit Shah | నవంబర్ 2న తెలంగాణలో అమిత్ షా పాదయాత్ర
- ●Rashmika Mandanna | కష్టాల్లో విజయ్ నా పక్కనే ఉన్నాడు - వెయ్యి సార్లు అయిన ప్రపోజ్ చేస్తా - విమర్శలపై రష్మిక స్ట్రాంగ్ కౌంటర్
- ●Newlywed bride collapsed | గదిలోకి అడుగుపెట్టిన క్షణాల్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన నవవధువు.. లోపల ఏం జరిగింది..?
- ●TPCC Delhi committee | కాంగ్రెస్ ఢిల్లీ మహా ర్యాలీకి వేళాయె: రంగంలోకి టీపీసీసీ కీలక కమిటీ.. మంత్రులు, ఎంపీలకు బాధ్యతలు

Honey Trap Case | ‘మూన్ బేబి 5973’ ఇన్‌స్టా ఐడీతో మల్లారెడ్డి స్టూడెంట్‌కు వల.. హనీట్రాప్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

DMK Ex Minister Corruption Case | తమిళనాడులో ప్రకంపనలు: రూ.100 కోట్ల లంచం కేసులో డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్.. 177 స్కూళ్లే టార్గెట్!

Amit Shah | నవంబర్ 2న తెలంగాణలో అమిత్ షా పాదయాత్ర

Rashmika Mandanna | కష్టాల్లో విజయ్ నా పక్కనే ఉన్నాడు - వెయ్యి సార్లు అయిన ప్రపోజ్ చేస్తా - విమర్శలపై రష్మిక స్ట్రాంగ్ కౌంటర్



