Rahul Gandhi | అమిత్ షాపై గెలిచిన రాహుల్ గాంధీ.. పరువు నష్టం కేసు కొట్టివేత
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి భారీ ఊరట లభించింది. అమిత్ షా (Amit Shah)పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో (defamation case) కోర్టు ఆయన్ని నిర్దోషిగా ప్రకటించింది.
Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి భారీ ఊరట లభించింది. 2018లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో (defamation case) యూపీలోని సుల్తాన్‌పూర్ కోర్టు (Sultanpur MP-MLA court) ఆయన్ని నిర్దోషిగా ప్రకటించింది. ఈ మేరకు పరువు నష్టం కేసును డిస్మిస్ చేసింది.
2018 లో బెంగళూరు(Bangalore)లో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) పై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ఓ హత్య కేసులో నిందితుడని రాహుల్ ఆరోపించారు. ప్రతిపక్ష నేత ఆరోపణలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు అమిత్ షా ప్రతిష్ఠకు భంగం కలిగించాయని ఆరోపిస్తూ బీజేపీ నేత విజయ్ మిశ్రా అదే ఏడాది ఆగస్టు 4న సుల్తాన్‌పుర్ కోర్టులో పరువు నష్టం దాఖలు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని 2023లో కోర్టు రాహుల్‌ను ఆదేశించింది. 2024 ఫిబ్రవరి 20న రాహుల్ కోర్టు ఎదుట విచారణకు హాజరయ్యారు. వ్యక్తిగత పూచీకత్తు, హామీ పత్రాలను సమర్పించిన తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది.
2024 జులైలో కోర్టులో రాహుల్ వాంగ్మూలాన్ని నమోదు చేయగా.. అదే ఏడాది అక్టోబర్‌లో ఫిర్యాదుదారుడి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. ఇక పరువు నష్టం ఫిర్యాదుపై వాదనలు ఈ ఏడాది అక్టోబర్‌లో ముగిశాయి. దీంతో ఇవాళ తుది తీర్పు వెలువడింది. ఈ కేసుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ప్రత్యేక ప్రజా ప్రతినిధుల కోర్టు.. రాహుల్‌ని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడిన సమయంలో రాహుల్ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు పరువునష్టం కలిగించేలా లేవని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కేసును కొట్టివేసింది. కోర్టు తీర్పుతో అమిత్ షాపై రాహుల్ గెలిచినట్లైంది.
రాహుల్‌కి తృటిలో తప్పిన పెను ప్రమాదం..
అంతకు ముందు రాహుల్‌కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. కోర్టు తీర్పు నేపథ్యంలో యూపీ సుల్తాన్‌పూర్‌కు ప్రయాణిస్తున్న సమయంలో ఆయన కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. లక్నో ఎయిర్‌పోర్టు నుంచి సుల్తాన్‌పూర్ వెళ్తున్న సమయంలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే (Purvanchal Expressway)పై కాన్వాయ్‌లోని ఐదు కార్లు, ఒక అంబులెన్స్ పరస్పరం ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో పార్టీ కార్యకర్తలు, సిబ్బంది గాయపడ్డారు. అయితే, రాహుల్ మాత్రం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Also Read..
పార్లమెంట్‌లో అగ్నిప్రమాదం.. నార్త్‌బ్లాక్ నుంచి నల్లటి పొగ
భక్తులకు అలర్ట్.. అయోధ్య రామ మందిర వేళల్లో మార్పులు.. కొత్త షెడ్యూల్ ఇదే..!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rahul Gandhi | రాహుల్ గాంధీ కాన్వాయ్కి ప్రమాదం.. ఒకదానికొకటి ఢీ కొన్న వాహనాలు.. పలువురికి గాయాలు
అక్టోబర్ 26, 2026

Modi Ka Baap Bhi Jayega Controversy | ‘మోదీ కా బాప్ భీ జాయేగా’: పాట్నా సభలో సహనం కోల్పోయిన మల్లికార్జున ఖర్గే
అక్టోబర్ 25, 2026

KTR | దేశమంతా తిరిగే రాహుల్‌కు.. తెలంగాణ జాడ దొర్కుతలే
అక్టోబర్ 25, 2026
తాజావార్తలు
- ●Revanth Reddy | మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట నిర్మాణంపై చర్చ
- ●Fire Broke Out Parliament | పార్లమెంట్‌లో అగ్నిప్రమాదం.. నార్త్‌బ్లాక్ నుంచి నల్లటి పొగ
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోరు.. స్వల్పంగా పెరిగిన ధరలు..
- ●HD Kumaraswamy | మా కుటుంబాన్ని అంతం చేసేందుకు కుట్ర.. రూ.600 కోట్లతో డీల్.. సీఎం డీకేపై కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు
- ●Rahul Gandhi | రాహుల్ గాంధీ కాన్వాయ్కి ప్రమాదం.. ఒకదానికొకటి ఢీ కొన్న వాహనాలు.. పలువురికి గాయాలు
- ●Electric Shock | గుట్కా నమిలి.. కరెంట్ తీగపై ఉమ్మాడు.. విద్యుదాఘాతంతో మృతిచెందాడు

Revanth Reddy | మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట నిర్మాణంపై చర్చ

Fire Broke Out Parliament | పార్లమెంట్‌లో అగ్నిప్రమాదం.. నార్త్‌బ్లాక్ నుంచి నల్లటి పొగ

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోరు.. స్వల్పంగా పెరిగిన ధరలు..

HD Kumaraswamy | మా కుటుంబాన్ని అంతం చేసేందుకు కుట్ర.. రూ.600 కోట్లతో డీల్.. సీఎం డీకేపై కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు



