త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Gang Rape | ఢిల్లీలో మ‌రో నిర్భ‌య ఘ‌ట‌న‌.. క‌దిలే బ‌స్సులో బాలిక‌పై సామూహిక‌ అత్యాచారం

Delhi Gang Rape | దేశ రాజ‌ధాని ఢిల్లీలో నిర్భ‌య తరహా ఉదంతం వెలుగు చూసింది. క‌దిలే బ‌స్సులో 16 ఏళ్ల బాలిక‌పై డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్ సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు (Delhi Gang Rape).

D

National | Published On Aug 31, 2026, 12.06 pm IST

Delhi Gang Rape | ఢిల్లీలో మ‌రో నిర్భ‌య ఘ‌ట‌న‌.. క‌దిలే బ‌స్సులో బాలిక‌పై సామూహిక‌ అత్యాచారం
Advertisement

Delhi Gang Rape | త్రినేత్ర‌.న్యూస్ : దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi)లో మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. తాజాగా రాజ‌ధానిలో మ‌రో నిర్భ‌య తరహా ఉదంతం వెలుగు చూసింది. క‌దిలే బ‌స్సులో 16 ఏళ్ల బాలిక‌పై డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్ సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు (Delhi Gang Rape). ఆగ‌స్టు 4న చోటు చేసుకున్న ఈఘ‌ట‌న ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ మైన్‌పురి జిల్లాకు (Mainpuri district) చెందిన 16 ఏళ్ల బాలిక 11వ తరగతి చదువుతోంది. అయితే, కుటుంబ స‌భ్యుల‌తో గొడ‌వ‌ప‌డిన బాలిక‌.. ఇంట్లోవాళ్ల‌కు చెప్ప‌కుండా నోయిడా (Greater Noida)లోని త‌న బంధువుల ఇంటికి బ‌య‌ల్దేరింది. ఈ క్ర‌మంలో భారీ వర్షం, చీకటి కారణంగా ఆ విద్యార్థిని పొరపాటున నోయిడాలోని పరిచౌక్ (Pari Chowk) వద్ద దిగింది. అదే స‌మ‌యంలో ఓ ఖాళీ స్లీప‌ర్ బ‌స్సు అటుగా వ‌చ్చింది. తాము నోయిడా సెక్టర్-63 వైపు వెళ్తున్నామని అక్క‌డ దింపుతామ‌ని చెప్పి బాలిక‌ను డ్రైవర్, కండక్టర్ బ‌స్సు ఎక్కించుకున్నారు. ఆ త‌ర్వాత కొద్దిసేప‌టికే బాలిక‌పై ఇద్ద‌రూ అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు. బాధితురాలిని ఢిల్లీలోని క‌శ్మీర్ గేట్ ఐఎస్‌బీటీ (Kashmere Gate ISBT) సమీపంలో రింగ్ రోడ్డు వద్ద వదిలేసి వెళ్లిపోయారు.

దిక్కుతోచ‌ని స్థితిలో బాలిక నేరుగా క‌శ్మీర్ గేట్ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. బ‌స్సు క‌దిలిన కాసేప‌టికే కండ‌క్ట‌ర్ త‌న ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని తెలిపింది. అనంత‌రం డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్ ఇద్ద‌రూ క‌లిసి త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డార‌ని ఫిర్యాదు చేసింది. ప్ర‌తిఘ‌టిస్తే చంపేస్తామ‌ని బెదిరించిన‌ట్లు బాధితురాలు వాపోయింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బ‌స్సును గుర్తించారు. నిందితులను డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్‌గా గుర్తించారు. ఇద్ద‌రినీ అరెస్ట్ చేసి బ‌స్సును స్వాధీనం చేసుకున్నారు.

అంత‌కుముందు ఈ బ‌స్సులో సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో గ్రేట‌ర్ నోయిడాలోని సూర‌జ్‌పూర్ ప్రాంతంలోని ఓ మెకానిక్ షెడ్‌కు మ‌ర‌మ్మ‌తుల నిమిత్తం తీసుకెళ్లారు. మ‌ర‌మ్మ‌తులు పూర్తైన త‌ర్వాత కుల్దీప్‌, సందీప్ ఖాళీ బ‌స్సును తిమ‌ర్పూర్‌కు తీసుకెళ్తుండ‌గా.. ప‌రిచౌక్ వ‌ద్ద బాలిక వారి కంట‌ప‌డింది. పరిచౌక్ నుంచి కశ్మీర్ గేట్ వరకు సుమారు 47 కిలోమీటర్ల ప్ర‌యాణ‌ దూరంలో బాలిక‌పై వారు ఈ అఘాయిత్యానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సుకు కర్టెన్లు ఉండటం వల్ల లోపల ఏం జరుగుతుందో బయటివారికి కనిపించలేదని పోలీసులు వెల్లడించారు.

మూడు నెల‌ల్లోనే రెండో ఘ‌ట‌న‌

కాగా, ఢిల్లీలో మూడు నెల‌ల వ్య‌వ‌ధిలోనే ఇది రెండో ఘ‌ట‌న‌. ఈ ఏడాది మే నెల‌లో కూడా ఓ మ‌హిళ‌పై ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సు డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్ అఘాయిత్యానికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. రాణిబాగ్ ప్రాంతంలో (Rani Bagh area) ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మంగోల్‌పురిలోని ఒక ఫ్యాక్టరీలో ప‌ని చేస్తున్న బాధితురాలు విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. క‌దులుతున్న బస్సులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సుమారు రెండు గంట‌ల పాటూ త‌న‌పై అఘాయిత్యం చేశార‌ని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడు అలాంటి ఉదంత‌మే వెలుగు చూడటం ఢిల్లీలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

నిర్భ‌య ఘ‌ట‌న‌..

ఈ రెండు ఘ‌ట‌న‌లు 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో జరిగిన నిర్భ‌య ఘ‌ట‌న‌ను గుర్తు చేస్తున్నాయి. ఆనాడు 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై కదులుతున్న బస్సులో నిందితులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ అత్యంత దారుణమైన సామూహిక అత్యాచారం, హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ ఘటన దేశంలో మహిళల భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళనలకు దారితీసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైలులో ఆత్మహత్య చేసుకోగా.. మ‌రో నలుగురు దోషులకు మార్చి 20, 2020న తీహార్ జైలులో ఉరిశిక్ష అమలు చేశారు. ఒకరు మైనర్ కావడంతో జువెనైల్ హోంకు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత భార‌త ప్ర‌భుత్వం అత్యాచార చట్టాలను కఠినతరం చేసింది. 2013లో మహిళల భద్రత కోసం నిర్భయ ఫండ్ (Nirbhaya Fund)ను ఏర్పాటు చేసి రూ.1000 కోట్ల నిధిని కేటాయించింది.

Also Read..

సీడ్ గణేశుడిని పూజించండి.. మీ ఇంట్లోనే మొక్కై ఆశీర్వదిస్తాడు : చిరంజీవి

ప్రియురాలిని మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం చేస్తున్న కోలీవుడ్ హీరో

రంగారెడ్డి జిల్లాలో 125 అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు.. వ‌చ్చేనెల 10 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు

Advertisement
Advertisement