IPO | ఈ వారంలో వస్తున్న 7 ప్రధాన ఐపీవోలు ఇవే.. రూ.1265 కోట్లకు పైగా ఇష్యూలు..
IPO | భారత ప్రైమరీ మార్కెట్ ఈ వారం మొత్తం బిజీగా గడవనుంది. ఈ వారంలో ఏకంగా ఏడు కొత్త ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపీఓలు) సబ్‌స్క్రిప్షన్ కోసం రానున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల దృష్టి మరోసారి ఐపీఓ మార్కెట్‌పై పడనుంది. వీటిలో మూడు మెయిన్‌బోర్డ్ ఐపీఓలు ఉన్నాయి.
IPO | భారత ప్రైమరీ మార్కెట్ ఈ వారం మొత్తం బిజీగా గడవనుంది. ఈ వారంలో ఏకంగా ఏడు కొత్త ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపీఓలు) సబ్‌స్క్రిప్షన్ కోసం రానున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల దృష్టి మరోసారి ఐపీఓ మార్కెట్‌పై పడనుంది. వీటిలో మూడు మెయిన్‌బోర్డ్ ఐపీఓలు ఉన్నాయి. పర్పుల్ స్టైల్ ల్యాబ్స్, రేస్ ఆఫ్ బిలీఫ్, దీపా జ్యువెలర్స్ ఐపీఓలు కలిసి ఈ వారం రూ.1,265 కోట్లకు పైగా సమీకరించనున్నాయి. అలాగే స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజ్ (ఎస్ఎంఈ) విభాగంలో ఫైకెమ్ టెక్నాలజీస్, శాంతి ఇనార్గానిక్స్, ఆశుతోష్ ఫైబర్, ఫార్మ్ పీస్ ఐపీఓలు బిడ్డింగ్ కోసం అందుబాటులోకి రానున్నాయి.
8 కొత్త మెయిన్ బోర్డ్ ఐపీవోలు..
కొత్త ఐపీఓలతో పాటు ఈ వారంలో ఎనిమిది కొత్త మెయిన్‌బోర్డ్ ఐపీఓలు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానున్నాయి. ప్రస్తుతం సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ అయి ఉన్న మరో మూడు కంపెనీల ఐపీఓలు కూడా ఈ వారంలో ముగియనున్నాయి. అనంతరం ఆయా కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానున్నాయి. పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ ఐపీఓ సోమవారం సబ్‌స్క్రిప్షన్‌కు ఓపెన్ అయి సెప్టెంబర్ 2న ముగుస్తుంది. రూ.680 కోట్ల విలువైన ఈ బుక్ బిల్ట్ ఇష్యూలో పూర్తిగా కొత్తగా 1.18 కోట్ల షేర్లను జారీ చేస్తున్నారు. ఒక్కో షేరుకు రూ.546 నుంచి రూ.575 వరకు ప్రైస్ బ్యాండ్‌ను నిర్ణయించారు. రేస్ ఆఫ్ బిలీఫ్ ఐపీఓ సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 3 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంటుంది. ఈ పబ్లిక్ ఇష్యూ విలువ రూ.125 కోట్లు. ఇందులో 52 లక్షల షేర్లను పూర్తిగా కొత్తగా జారీ చేస్తున్నారు. ఒక్కో షేరుకు రూ.227 నుంచి రూ.239 వరకు ప్రైస్ బ్యాండ్‌ను కంపెనీ నిర్ణయించింది.
దీపా జ్యువెలర్స్ ఐపీవో..
దీపా జ్యువెలర్స్ ఐపీఓ సెప్టెంబర్ 1న ప్రారంభమై సెప్టెంబర్ 3న ముగుస్తుంది. రూ.459.72 కోట్ల విలువైన ఈ బుక్ బిల్ట్ ఇష్యూలో రూ.250 కోట్ల విలువైన 1.41 కోట్ల కొత్త షేర్ల జారీతోపాటు, రూ.209.72 కోట్ల విలువైన 1.18 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. ఐపీఓకు ఒక్కో షేరుకు రూ.168 నుంచి రూ.177 వరకు ప్రైస్ బ్యాండ్ నిర్ణయించారు. ఆశుతోష్ ఫైబర్ ఐపీఓ కూడా సోమవారం ప్రారంభమై సెప్టెంబర్ 2న ముగుస్తుంది. రూ.56.35 కోట్ల విలువైన ఈ బుక్ బిల్ట్ ఇష్యూలో 61.25 లక్షల షేర్లను పూర్తిగా కొత్తగా జారీ చేస్తున్నారు. ఒక్కో షేరుకు రూ.87 నుంచి రూ.92 వరకు ప్రైస్ బ్యాండ్‌ను నిర్ణయించారు. శాంతి ఇనార్గానిక్స్ ఐపీఓ సోమవారం నుంచి సెప్టెంబర్ 2 వరకు కొనసాగుతుంది. ఈ పబ్లిక్ ఇష్యూ విలువ రూ.47.24 కోట్లు. ఇందులో 0.57 కోట్ల షేర్లను పూర్తిగా కొత్తగా జారీ చేస్తున్నారు. ఒక్కో షేరుకు రూ.79 నుంచి రూ.83 వరకు ప్రైస్ బ్యాండ్‌ను కంపెనీ నిర్ణయించింది.
ఫైకెమ్ టెక్నాలజీస్..
ఫైకెమ్ టెక్నాలజీస్ ఐపీఓ కూడా సోమవారం ప్రారంభమై సెప్టెంబర్ 2న ముగుస్తుంది. ఈ బుక్ బిల్ట్ ఇష్యూ మొత్తం విలువ రూ.14.58 కోట్లు. ఇందులో 27 లక్షల షేర్లను పూర్తిగా కొత్తగా జారీ చేస్తున్నారు. ఒక్కో షేరుకు రూ.51 నుంచి రూ.54 వరకు ప్రైస్ బ్యాండ్‌ను నిర్ణయించారు. ఫార్మ్ పీస్ ఐపీఓ సెప్టెంబర్ 1న సబ్‌స్క్రిప్షన్‌కు తెరుచుకుని సెప్టెంబర్ 3న ముగుస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూలో ఒక్కో షేరు ధరను రూ.59గా నిర్ణయించారు. మొత్తం 54.24 లక్షల ఈక్విటీ షేర్లను పూర్తిగా కొత్తగా జారీ చేయడం ద్వారా కంపెనీ రూ.32 కోట్లు సమీకరించనుంది.
తాజావార్తలు
- ●Delhi Gang Rape | ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. కదిలే బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం
- ●Jayam Ravi | ప్రియురాలిని మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేస్తున్న కోలీవుడ్ హీరో
- ●Anganwadi Teachers | రంగారెడ్డి జిల్లాలో 125 అంగన్వాడీ టీచర్ పోస్టులు.. వచ్చేనెల 10 వరకు దరఖాస్తులు
- ●EPFO 3.0 | ఈపీఎఫ్ఓ 3.0 భారీ అప్డేట్.. యూపీఐ, ఏటీఎం ద్వారా నగదు విత్ డ్రా.. ప్రధాన మార్పులు ఇవే..
- ●Megastar Chiranjeevi | సీడ్ గణేశుడిని పూజించండి.. మీ ఇంట్లోనే మొక్కై ఆశీర్వదిస్తాడు : చిరంజీవి
- ●AR Constable | అంబర్‌పేటలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Delhi Gang Rape | ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. కదిలే బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం

Jayam Ravi | ప్రియురాలిని మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేస్తున్న కోలీవుడ్ హీరో

Anganwadi Teachers | రంగారెడ్డి జిల్లాలో 125 అంగన్వాడీ టీచర్ పోస్టులు.. వచ్చేనెల 10 వరకు దరఖాస్తులు

EPFO 3.0 | ఈపీఎఫ్ఓ 3.0 భారీ అప్డేట్.. యూపీఐ, ఏటీఎం ద్వారా నగదు విత్ డ్రా.. ప్రధాన మార్పులు ఇవే..






