Jayam Ravi | ప్రియురాలిని మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేస్తున్న కోలీవుడ్ హీరో
కోలీవుడ్ హీరో జయం రవి, సింగర్ కెనీషా బంధం గత కొన్ని నెలలుగా తమిళంలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరు లివింగ్ రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా తన ప్రియురాలిని జయం రవి మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేయబోతున్నాడు. జయం రవి దర్శకత్వం వహిస్తున్న ఎన్ ఆర్డినరీ మ్యాన్ సినిమాకు కెనీషా మ్యూజిక్ అందించబోతున్నట్లు సమాచారం.
Entertainment | Published On Aug 31, 2026, 12.04 pm IST
Jayam Ravi | కోలీవుడ్ హీరో జయం రవి, సింగర్ కెనీషా డేటింగ్‌లో ఉన్నట్లు చాలా కాలంగా కోలీవుడ్‌లోపుకార్లు వినిపిస్తున్నాయి. సింగర్ కెనీషాతో ప్రేమాయణం కారణంగానే తన భార్య ఆర్తికి జయం రవి విడాకులు ఇవ్వడానికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. భార్య ఆర్తికి దూరంగా ఉంటున్న జయం రవి ప్రస్తుతం సింగర్ కెనీషాతో లివింగ్ రిలేషన్‌లో ఉన్నాడని అంటున్నారు. ఈ తమిళ సింగర్‌తో కలిసి పలు ఈవెంట్లకు అటెండ్ అయ్యాడు జయం రవి. రెండుమూడు సార్లు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇద్దరు కలిసి దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
పోస్ట్ వైరల్...
జయం రవి, కెనీషా బంధంపై విమర్శలు రావడంతో గత కొద్ది రోజులుగా ఈ జంట బయట ఎక్కడ కనిపించడం లేదు.ఈ విమర్శల కారణంగా తాను జయం రవి లైఫ్‌లో నుంచి వెళ్లిపోతున్నట్లు ఇటీవల కెనీషా చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.
డైరెక్టర్‌గా ఎంట్రీ...
చాలా రోజుల తర్వాత మళ్లీ కెనీషా పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. హీరోగా నాలుగైదు సినిమాలతో బిజీగా ఉన్న జయం రవి త్వరలోనే డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఎన్ ఆర్డనరీ మ్యాన్ పేరుతో ఓ కామెడీ ఎమోషనల్ డ్రామా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు.
మ్యూజిక్ డైరెక్టర్....
తన డైరెక్షనల్ డెబ్యూ మూవీతో సింగర్ కెనీషా మ్యూజిక్ డైరెక్టర్‌గా జయం రవి కోలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సాంగ్స్ కంపోజింగ్, రీరికార్డింగ్ పనులు పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే కెనీషా పేరును మ్యూజిక్ డైరెక్టర్‌గా జయం రవి అఫీషియల్‌గా అనౌన్స్‌చేయబోతున్నట్లు సమాచారం. ఎన్ ఆర్డినరీ మ్యాన్ సినిమాను రవి మోహన్ స్వయంగా నిర్మిస్తున్నాడు. డైరెక్టర్‌గానే కాకుండా నిర్మాతగా కూడా ఈ సినిమాతోనే అరంగేట్రం చేస్తున్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kayadu Lohar | రాజకీయాలు చేయడం నాకు రాదు – తమిళ సినిమా కాంట్రవర్సీపై కయదు లోహర్ కామెంట్స్
సెప్టెంబర్ 4, 2026

Nayanthara | ఫస్ట్ టైమ్ రూల్స్ బ్రేక్ చేసిన నయనతార – డబ్బుల కోసమే అంటూ నెటిజన్ల ట్రోల్స్
సెప్టెంబర్ 4, 2026

Kollywood | హీరోయిన్గా మారిన పైలట్ – కోలీవుడ్ సినిమాలో ఛాన్స్
సెప్టెంబర్ 3, 2026
తాజావార్తలు
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..
- ●Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి
- ●Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు
- ●Infinix Hot 70 Pro 5G | రూ.24,999కే ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రొ 5జి.. అదిరిపోయే ఫీచర్లు..
- ●Jagadeesh Reddy | కొండా సుస్మిత వెనక మేముంటే... మరి రాజగోపాల్‌రెడ్డి వెనకెవరున్నరు?

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి

Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?

Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు



