Honey Trap Case | ‘మూన్ బేబి 5973’ ఇన్‌స్టా ఐడీతో మల్లారెడ్డి స్టూడెంట్‌కు వల.. హనీట్రాప్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
Honey Trap Case | ఇటీవల హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసు (Honey Trap Case) విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు కొండభత్తుల పవన్ కుమార్ ‘Moon baby 5973’ ఇన్‌స్టా ఐడీతో మల్లారెడ్డి స్టూడెంట్‌ను ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Honey Trap Case | త్రినేత్ర న్యూస్: ఇటీవల హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసు (Honey Trap Case) విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు కొండభత్తుల పవన్ కుమార్ ‘Moon baby 5973’ ఇన్‌స్టా ఐడీతో మల్లారెడ్డి స్టూడెంట్‌ను ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని.. ఈ కోణంలోనూ విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. మాట వినకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగినట్లు తేలిందన్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులు వెల్లడించారు. రెండేళ్ల క్రితం చిట్‌ఫండ్స్ సంస్థలో పనిచేసిన పవన్‌కుమార్.. రుణాల పేరుతోనూ మరో మహిళను మోసం చేసినట్లు తేల్చారు.
దీంతో పాటు ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడులోనూ బాధితులు ఉన్నారు. పాక్, టర్కీ, కెనడాలోనూ పలువురిని ట్రాప్ చేశాడు. బాధితుల్లో పోలీసులు, వైద్యులు, వ్యాపారులు ఉన్నారు. ఫొటోలు, వీడియోలతో బాధితులను బెదిరింపులకు గురి చేసేవాడు అని పోలీసు అధికారులు వెల్లడించారు.
ఇదీ కేసు నేపథ్యం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన కె.పవన్‌కుమార్ (23) అనే యువకుడు ప్రస్తుతం కూకట్‌పల్లిలోని బాలాజీనగర్‌లో ఉంటున్నాడు. గతంలో లోన్ కంపెనీలో, మరో సంస్థలో పనిచేసి మానేశాడు. ఈ క్రమంలో పలు రకాలుగా మోసాలకు పాల్పడుతూ డబ్బులు కాజేసేవాడు. కోల్‌కతాకు చెందిన 'చందన' అనే యువతి ఫోటోలను ఇన్‌స్టాలో 13, ఫేస్‌బుక్‌లో 14 అకౌంట్లను సృష్టించాడు.
వీటి ద్వారా దాదాపు 1,000 మందికి పైగా పురుషులను వల వేసి చాటింగ్ చేశాడు. 82 మంది న్యూడ్ వీడియోల సేకరించి, చాటింగ్‌ను అసభ్యకర సంభాషణల వైపు మళ్లించి, ఎదుటివారి నగ్న చిత్రాలు, వీడియోలను సేకరించాడు. ఆ తర్వాత ఆ యువతి 'అన్నయ్య'గా తానే రంగ ప్రవేశం చేసి, బాధితుల ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని, లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు.
ఇతడి వికృత చేష్టలతో విసిగిపోయిన ఒక బాధితుడి ఫిర్యాదుతో సైదాబాద్ పోలీసులు రంగంలోకి దిగి ఘరానా మోసగాడి బండారం బయటపెట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతడి నుంచి 3 ఫోన్లు, సిమ్‌కార్డులు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్ స్వాధీనం చేసుకున్నారు. బాధితుల్లో కొంతమంది ఇన్‌స్పెక్టర్లు, అదనపు డీసీపీలు కూడా ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●DMK Ex Minister Corruption Case | తమిళనాడులో ప్రకంపనలు: రూ.100 కోట్ల లంచం కేసులో డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్.. 177 స్కూళ్లే టార్గెట్!
- ●Amit Shah | నవంబర్ 2న తెలంగాణలో అమిత్ షా పాదయాత్ర
- ●Rashmika Mandanna | కష్టాల్లో విజయ్ నా పక్కనే ఉన్నాడు - వెయ్యి సార్లు అయిన ప్రపోజ్ చేస్తా - విమర్శలపై రష్మిక స్ట్రాంగ్ కౌంటర్
- ●Newlywed bride collapsed | గదిలోకి అడుగుపెట్టిన క్షణాల్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన నవవధువు.. లోపల ఏం జరిగింది..?
- ●TPCC Delhi committee | కాంగ్రెస్ ఢిల్లీ మహా ర్యాలీకి వేళాయె: రంగంలోకి టీపీసీసీ కీలక కమిటీ.. మంత్రులు, ఎంపీలకు బాధ్యతలు
- ●Ponnam Prabhakar | దళారులకే ధాన్యం అమ్ముకోండి.. రైతులకు మంత్రి పొన్నం సూచన

DMK Ex Minister Corruption Case | తమిళనాడులో ప్రకంపనలు: రూ.100 కోట్ల లంచం కేసులో డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్.. 177 స్కూళ్లే టార్గెట్!

Amit Shah | నవంబర్ 2న తెలంగాణలో అమిత్ షా పాదయాత్ర

Rashmika Mandanna | కష్టాల్లో విజయ్ నా పక్కనే ఉన్నాడు - వెయ్యి సార్లు అయిన ప్రపోజ్ చేస్తా - విమర్శలపై రష్మిక స్ట్రాంగ్ కౌంటర్

Newlywed bride collapsed | గదిలోకి అడుగుపెట్టిన క్షణాల్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన నవవధువు.. లోపల ఏం జరిగింది..?





