త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | జ్ఞానేశ్ కుమార్‌ను తొల‌గించ‌మ‌ని మోదీకి చెప్పండి.. 30 సెకన్లలో నిరసనలు ఆగిపోతాయి.. ఢిల్లీ వ్యాపారులకు రాహుల్

Rahul Gandhi | పండగ‌ సీజ‌న్‌లో (festive season) ఇండీ కూట‌మి ర్యాలీ కార‌ణంగా వ్యాపారం దెబ్బ‌తింటుంద‌ని వ్యాపార వ‌ర్గాల ఆందోళ‌న‌పై ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా స్పందించారు. ఓటుచోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని ప్ర‌ధాని మోదీకి చెబితే 30 సెక‌న్ల‌లో నిర‌స‌న‌లు ఆగిపోతాయ‌ని రాహుల్ స్ప‌ష్టం చేశారు.

D

National | Published On Oct 26, 2026, 3.54 pm IST

Rahul Gandhi | జ్ఞానేశ్ కుమార్‌ను తొల‌గించ‌మ‌ని మోదీకి చెప్పండి.. 30 సెకన్లలో నిరసనలు ఆగిపోతాయి.. ఢిల్లీ వ్యాపారులకు రాహుల్
Advertisement

Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్ (Ramlila Maidan)లో ఇండియా కూట‌మి నవంబర్ 1న నిర్వహించ తలపెట్టిన ర్యాలీని వాయిదా వేయాలని ‘ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ’ (Chamber of Trade and Industry) కోరిన విష‌యం తెలిసిందే. దీపావళి షాపింగ్ సీజన్‌లో (festive season) ఈ ర్యాలీ వల్ల వ్యాపారం దెబ్బతింటుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేర‌కు వారు ప్ర‌తిప‌క్ష నేత‌కు లేఖ రాసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వ్యాపారుల ఆందోళ‌న‌పై రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా స్పందించారు. ఓటుచోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని ప్ర‌ధాని మోదీకి చెబితే 30 సెక‌న్ల‌లో నిర‌స‌న‌లు ఆగిపోతాయ‌ని రాహుల్ స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

"ఢిల్లీలోని ప్రతి వ్యాపారికీ నేను చెప్పేది ఒక్క‌టే.. ప్రభుత్వం మెట్రోను నిలిపివేసింది, రోడ్లను బ్లాక్ చేసింది. రాజధానిని లాక్‌డౌన్ చేసింది. ఓటు చోరీ జరిగితే ఏదీ సురక్షితం కాదు. మీ దుకాణాలు, మీ పొదుపు, మీ పిల్ల‌ల భ‌విష్య‌త్తు ప్ర‌మాదంలో ప‌డుతుంది. ఓటుచోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించమ‌ని మీరు ప్ర‌ధానికి చెప్పండి. అప్పుడు 30 సెక‌న్ల‌లో నిర‌స‌న‌లు ఆగిపోతాయి" అని రాహుల్ వ్యాఖ్యానించారు.

వ్యాపార వర్గాల ఆందోళనలు..

ఈ నేప‌థ్యంలో సీఈసీ రాజీనామాకు డిమాండ్ చేస్తూ రామ్‌లీలా మైదాన్ వ‌ద్ద ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న‌కు పిలుపునిచ్చి న విష‌యం తెలిసిందే. అయితే, పండుగ సీజ‌న్‌లో ఈ ఆందోళ‌న‌ల కార‌ణంగా వ్యాపారం దెబ్బ‌తింటుంద‌ని వ్యాపార వ‌ర్గాలు ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. ఈ మేర‌కు నిర‌స‌న‌ను విర‌మించుకోవాల‌ని కోరుతూ CTI చైర్మన్ బ్రిజేష్ గోయల్.. రాహుల్ గాంధీకి లేఖ రాశారు. న‌వంబ‌ర్ 6న ధ‌న త్ర‌యోద‌శి, న‌వంబ‌ర్ 8న దీపావ‌ళి, న‌వంబ‌ర్ 10న భాయ్ దూజ్ పండుగ‌లు రానున్నాయని లేఖ‌లో ప్ర‌స్తావించారు.

రూ.25,000 కోట్ల వ్యాపారం..

పండ‌గ‌ల స‌మ‌యంలో బంగారం, వెండి, ఎల‌క్ట్రానిక్స్‌, దుస్తులు, గృహోప‌క‌ర‌ణాలు, డ్రైఫ్రూట్స్, స్వీట్లు, ఆటోమొబైల్స్, రియల్ ఎస్టేట్, గిఫ్ట్ ఐట‌మ్స్ రంగాల్లో ఢిల్లీలో సుమారు రూ.25,000 కోట్ల వ్యాపారం జ‌రుగుతుంద‌ని తెలిపారు. పండుగ‌కు వారం ముందు నుంచే మార్కెట్ల‌లో ర‌ద్దీ విప‌రీతంగా పెరుగుతుంద‌ని చెప్పారు. అందుకే ర్యాలీ తేదీని మార్చాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. పండుగ సీజన్‌లో వ్యాపార కార్యకలాపాలను కాపాడుకోవడానికి నవంబర్ 10 తర్వాత ర్యాలీ నిర్వహించాలని కోరారు. ఈ వ్యాపార వ‌ర్గాల విజ్ఞ‌ప్తిపై రాహుల్ పై విధంగా స్పందించారు.

స‌ర్ ప్ర‌క్రియ‌లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ఆరోపిస్తూ చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌నర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే న‌వంబ‌ర్ 1న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీకి ఇండీ కూట‌మి పిలుపునిచ్చింది. అయితే, ఈ నిర‌స‌న‌ల ద్వారా కాంగ్రెస్ దాని మిత్ర‌ప‌క్షాలు దేశంలో అరాచ‌కం సృష్టించాల‌ని చూస్తున్నాయ‌ని బీజేపీ విమ‌ర్శించింది.

Also Read..

నేను స‌చ్చిపోతెనే బిల్లులిస్త‌రా? అట్ల‌యితే ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు దిగుతా

మోదీ తండ్రిని అంత మాటంటవా? ఖర్గే ఇంటిని చుట్టుముట్టిన బీజేపీ నేతలు

లెనోవో నుంచి పవర్‌ఫుల్ ఏఐ ల్యాప్‌టాప్‌లు.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

Advertisement
Advertisement