Abhishek Banerjee | కోల్‌కతాలో బుల్డోజర్.. అభిషేక్ బెనర్జీ ఇంటివద్ద కూల్చివేతలు
Abhishek Banerjee | పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో (Kolkata) మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) నివాసం వద్ద కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) కూల్చివేతలు చేపట్టింది.
Abhishek Banerjee | త్రినేత్ర న్యూస్: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో (Kolkata) మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) నివాసం వద్ద కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) కూల్చివేతలు చేపట్టింది. గురువారం ఉదయం జేసీబీలతో (bulldozer action) అభిషేక్ ఇంటి వద్దకు చేరుకున్న కేఎంసీ అధికారులు.. ఆయన నివాసం ముందు వెదురు కర్రలతో నిర్మించిన తాత్కాలి షెడ్డును కూల్చివేశారు.
ఫుట్‌పాత్‌ను (footpath) ఆక్రమించడంతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని మున్సిపల్ అధికారులు తెలిపారు. కూల్చివేతల నేపథ్యంలో బెనర్జీ నివాసం వద్ద పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. కాగా, అభిషేక్ 39వ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసం వెలుపల బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య అర్ధరాత్రి ఘర్షణలు చోటుచేసుకున్న కొద్దిరోజులకే అధికారులు ఈ కూల్చివేతలు చేపట్టడం గమనార్హం. తాజాగా కూల్చివేతలు బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారానికి దారితీశాయి.
ఏడుసార్లు హత్యాయత్నం..
బీజేపీ (BJP) గూండాలు తనపై ఆరు నెలల్లో ఏడుసార్లు హత్యాయత్నం చేశారంటూ అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. శనివారం (ఈనెల 7న) తెల్లవారుజామున 2 గంటల సమయంలో కోల్‌కతాలోని కాళీఘాట్ (Kalighat)లో ఉన్న తన నివాసంపై బీజేపీ కార్యకర్తలు మద్దతుదారులు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడిలో పలువురు టీఎంసీ కార్యకర్తలు గాయపడినట్లు చెప్పారు. గత ఆరు నెలల్లోనే తనను హత్య చేయడానికి బీజేపీ ఏడుసార్లు ప్రయత్నించిందంటూ ఆరోపించారు.
తన ఇంటి ముందు ఇంత హింసాకాండ జరుగుతున్నప్పటికీ పోలీసులు జోక్యం చేసుకోవడం లేదని మండిపడ్డారు. కొందరు బీజేపీ మద్దతుదారుల వద్ద తుపాకీలు కూడా ఉన్నాయని, ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరుగిందన్నారు. గత ఆరు నెలలుగా తనపై దాడికి ప్రయత్నిస్తూనే ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆరోపించారు. ఒక పార్లమెంటు సభ్యుడినైన తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. రాష్ట్రంలోని సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, అభిషేక్ బెనర్జీ ఆరోపణలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను ఒక డ్రామాగా అభివర్ణించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ విమర్శించారు.
సంబంధిత వార్తలు

N Ramachander Rao | అది ‘యాంటీ భారత్ సమ్మిట్’
నవంబర్ 11, 2026

Priyank Kharge | టిప్పు సుల్తాన్ నాలుగు ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు చేశారు.. RSS కనీసం స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొనలేదు : ప్రియాంక్ ఖర్గే
నవంబర్ 10, 2026

Sridhar Babu | ముందు పుస్తకం చదివి మాట్లాడండి.. సోనియా ఆత్మకథపై బీజేపీకి శ్రీధర్‌బాబు కౌంటర్
నవంబర్ 10, 2026
తాజావార్తలు
- ●SBI ATM | ఎస్బీఐ ఏటీఎం చోరీకి విఫలయత్నం.. అలారం మోగడంతో సీసీకెమెరాలు ఎత్తుకెల్లిన దుండగుడు
- ●Road Accident Accused | రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడు.. 16 ఏండ్ల తర్వాత అరెస్టు
- ●Expired Liquor | గడువు ముగిసిన మద్యం తాగి.. ముగ్గురు స్నేహితులు మృతి
- ●Kondagattu | 60 ఏండ్ల తర్వాత అరుదైన వేడుక.. కొండగట్టులో ఈ నెల 16 నుంచి చందనోత్సవం..
- ●ASRB Recruitment | ఐకార్, క్రిషి విజ్ఞాన కేంద్రాల్లో ఉద్యోగాలు.. 1393 పోస్టులతో ASRB నోటిఫికేషన్
- ●Horoscope | నవంబర్ 12 రాశి ఫలాలు.. నాయకత్వ లక్షణాలు, పోటీతత్వం పెరుగుతాయి!

SBI ATM | ఎస్బీఐ ఏటీఎం చోరీకి విఫలయత్నం.. అలారం మోగడంతో సీసీకెమెరాలు ఎత్తుకెల్లిన దుండగుడు

Road Accident Accused | రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడు.. 16 ఏండ్ల తర్వాత అరెస్టు

Expired Liquor | గడువు ముగిసిన మద్యం తాగి.. ముగ్గురు స్నేహితులు మృతి

Kondagattu | 60 ఏండ్ల తర్వాత అరుదైన వేడుక.. కొండగట్టులో ఈ నెల 16 నుంచి చందనోత్సవం..



