Rahul Gandhi | శుద్ధీకరణ కూడా ఓ రకమైన వివక్షే.. మోదీ సర్కార్‌పై రాహుల్ ఫైర్
Rahul Gandhi | శుద్ధీకరణ కూడా ఓ రకమైన వివక్షేనని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నప్పటికీ దేశంలో దళితులపై (Dalit person) వివక్ష, ఉల్లంఘనలు కొనసాగుతున్నాయని విమర్శించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు.
Rahul Gandhi | త్రినేత్ర.న్యూస్ : కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌పై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం దళితులపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఇటీవలే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) పాల్గొన్న ఓ వేదికను శుద్ధి చేయడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. శుద్ధీకరణ కూడా ఓ రకమైన వివక్షేనని విమర్శించారు.
ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్ మాట్లాడారు. దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య సైద్ధాంతిక యుద్ధం జరుగుతోందని అన్నారు. దళితులు వేల సంవత్సరాలుగా అణచివేతను ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం వివక్ష చట్టవిరుద్ధమైనప్పటికీ.. దళితులు మాత్రం వివక్ష , ఉల్లంఘనలను ఎదుర్కొంటూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కేవలం ఖర్గేకు సంబంధించిన సమస్య మాత్రమే కాదన్నారు. దేశంలోని ప్రతి దళితుడి సమస్య అని చెప్పారు. తమ పార్టీ చీఫ్‌కే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే.. పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో ఊహించండి అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. తమ అధ్యక్షుడికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి చర్యలు SC/ST చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం నేరం అయినప్పటికీ, బాధ్యులపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. ఉత్తరాఖండ్‌లో ఈ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించిన వారిపై వెంటనే FIR నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఒక దళితుడు ఎంత ఎక్కువ విజయం సాధిస్తే, వారిపై అంతగా దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై గళమెత్తాలని రాహుల్ పిలుపునిచ్చారు.
కాగా, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇటీవలే ఉత్తరాఖండ్ (Uttarakhand )లోని హల్ద్వానీ (Haldwani)లో రామ్‌లీలా మైదనాం (Ram Lila Ground)లో నిర్వహించిన విజయ్ శంఖనాద్ ర్యాలీకి హాజరై ప్రసంగించారు. అయితే, ఈ కార్యక్రమం అనంతరం రెండు రోజుల తర్వాత శ్రీరామ సేన అనే సంస్థ అక్కడ శుద్ధీకరణ హోమం నిర్వహించింది. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. ఈ ఘటనపై దళిత సంఘాలు, విపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై ఖర్గే సైతం పార్లమెంట్ వేదికగా తీవ్రంగా స్పందించారు. "ఈ దేశంలో దళితులకు స్థానం లేదని మేము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాము. వారు (బీజేపీని ఉద్దేశిస్తూ పరోక్షంగా) దేశాన్ని విభజించడానికి ప్రతి ఒక్కరినీ మతాల పేరుతో విడగొడుతున్నారు. అక్కడ శుద్ధి కార్యక్రమం చేయాల్సిన అవసరం ఏముంది?" అని రాజ్యసభలో ఖర్గే ప్రశ్నించారు. ఈ ఘటన తనకు చాలా అవమానకంగా అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read..
గడువు తీరిన బిస్కెట్లు తినాలంటూ.. ఫుడ్ సేఫ్టీ అధికారికి చుక్కలు చూపించిన జనం
హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ సేవల్లో మరోసారి అంతరాయం
ఇన్వెస్టర్లకు అలర్ట్.. వచ్చే వారంలో ముగియనున్న ముఖ్యమైన ఐపీవోలు ఇవే..
సంబంధిత వార్తలు

Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు
సెప్టెంబర్ 4, 2026

Mallikarjun Kharge | 24 రోజులైంది.. చర్యలేవి..? వేదిక శుద్ధీకరణపై నడ్డాకు ఖర్గే లేఖ
సెప్టెంబర్ 3, 2026

Konda Surekha | సుశ్మిత వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు.. తెగేసి చెప్పిన మంత్రి కొండా సురేఖ
సెప్టెంబర్ 2, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



