Yellamma Movie | ఎల్లమ్మకు హీరోయిన్ దొరికింది – దేవీశ్రీప్రసాద్‌కు జోడీగా మ్యాడ్ బ్యూటీ!
ఎల్లమ్మ మూవీతో టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు బలగం వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ కోసం మేకర్స్ సుదీర్ఘ కాలంగా సాగిస్తోన్న అన్వేషణకు తెరపడింది. కథానాయికగా అనంతిక సనీల్ కుమార్ కన్ఫామ్ అయినట్లు సమాచారం.
Yellamma Movie | ఎల్లమ్మ మూవీలో హీరోయిన్ కోసం సుదీర్ఘ కాలంగా సాగుతోన్న సస్పెన్స్‌కు తెరపడింది. ఎట్టకేలకు కథానాయిక దొరికింది. బలగం ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీతో టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు.
హైదరాబాద్‌లో....
ప్రస్తుతం ఎల్లమ్మ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లో దేవిశ్రీప్రసాద్ జాయినయ్యారు. దేవిశ్రీప్రసాద్, ప్రకాష్ రాజ్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను దర్శకుడు వేణు ఎల్దండి చిత్రీకరిస్తున్నారు.
కీర్తి సురేష్...సాయిపల్లవి...
కాగా ఎల్లమ్మలో హీరోయిన్ కోసం మేకర్స్ చాలా కాలంగా అన్వేషణ సాగిస్తోన్నారు. తొలుత కథానాయికగా కీర్తి సురేష్ పేరు ప్రచారం జరిగింది. కానీ తాను ఈ సినిమా చేయడం లేదని స్వయంగా మహానటి ప్రకటించింది. ఆ తర్వాత సాయిపల్లవి, మృణాల్ ఠాకూర్, మమితాబైజుతో పాటు పలువురు అగ్రనాయికల పేర్లు వినిపించాయి. కానీ ఎవరూ ఫైనల్ కాలేదు.
మ్యాడ్ ఫేమ్...
ఎట్టకేలకు ఈ నిరీక్షణకు తెరపడినట్లు సమాచారం. ఎల్లమ్మకు హీరోయిన్ దొరికినట్లు చెబుతున్నారు. మ్యాడ్, ఎనిమిది వసంతాలు సినిమాల ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ ఈ సినిమాలో కథానాయికగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇటీవలే దేవిశ్రీప్రసాద్, అనంతిక సనీల్ కుమార్‌లపై మేకర్స్ టెస్ట్ షూట్ జరిపినట్లు సమాచారం. ఆమె స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ విషయంలో డైరెక్టర్ వేణుతో పాటు దిల్ రాజు ఇంప్రెస్ అయినట్లు సమాచారం. హీరోయిన్‌గా అనంతికను ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు.
రొమాంచకం....
అనంతిక సనీల్ కుమార్ హీరోయిన్‌గా నటించిన రొమాంచకం ఈ వారమే థియేటర్లలోకి రాబోతుంది. స్టార్ డైరెక్టర్ సందీప్ వంగా ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్ హీరోగా నటించాడు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●IPO | ఇన్వెస్టర్లకు అలర్ట్.. వచ్చే వారంలో ముగియనున్న ముఖ్యమైన ఐపీవోలు ఇవే..
- ●Food Body Officer | గడువు తీరిన బిస్కెట్లు తినాలంటూ.. ఫుడ్ సేఫ్టీ అధికారికి చుక్కలు చూపించిన జనం
- ●MIM | ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్‌పై బహిష్కరణ వేటు.. అసదుద్దీన్ నోరు విప్పాలి: సల్మాన్ ఖాన్
- ●SBI Life Smart Scholar Plus | ఐదేళ్లు చెల్లిస్తే రూ.45 లక్షలు.. పిల్లల భవిష్యత్తుకు ఎస్బీఐ పథకం..
- ●Nagarjuna | లూజర్ నుంచి కింగ్ - నాగార్జున వందో మూవీ గ్లింప్స్ రిలీజ్ - క్రిస్మస్కు థియేటర్లలోకి
- ●Assam Doctor | జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన డాక్టర్..

IPO | ఇన్వెస్టర్లకు అలర్ట్.. వచ్చే వారంలో ముగియనున్న ముఖ్యమైన ఐపీవోలు ఇవే..

Food Body Officer | గడువు తీరిన బిస్కెట్లు తినాలంటూ.. ఫుడ్ సేఫ్టీ అధికారికి చుక్కలు చూపించిన జనం

MIM | ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్‌పై బహిష్కరణ వేటు.. అసదుద్దీన్ నోరు విప్పాలి: సల్మాన్ ఖాన్

SBI Life Smart Scholar Plus | ఐదేళ్లు చెల్లిస్తే రూ.45 లక్షలు.. పిల్లల భవిష్యత్తుకు ఎస్బీఐ పథకం..






