FASTag Annual Pass | వాహనదారులకు అలర్ట్.. ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెంపు
FASTag Annual Pass | వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఫాస్టాగ్ ఇయర్ పాస్ ధరలను పెంచుతూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ రూ.3,000గా ఉన్న ఇయర్ పాస్‌పై 2.5 శాతం మేర పెంచుతూ (FASTag Annual Pass Fee Hiked) నిర్ణయం తీసుకుంది.
FASTag Annual Pass | వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఫాస్టాగ్ ఇయర్ పాస్ ధరలను పెంచుతూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ రూ.3,000గా ఉన్న ఇయర్ పాస్‌పై 2.5 శాతం మేర పెంచుతూ (FASTag Annual Pass Fee Hiked) నిర్ణయం తీసుకుంది. ఎన్‌హెచ్ఏఐ నిర్ణయంతో ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర రూ.3.075కు చేరింది. కొత్త ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఫాస్టాగ్ వినియోగదారులు మార్చి 31 లోగా రీఛార్జ్ చేసుకుంటే మాత్రం ప్రస్తుత ధరలే వర్తిస్తాయి. ఆ తర్వాత చేసుకునేవారికి కొత్త ధరలు అమలు కానున్నాయి.
కాగా, దేశంలో ఫాస్టాగ్ టోల్ చెల్లింపు విధానంలో పెనుమార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. జాతీయ రహదారులపై తరచూ ప్రయాణాలు సాగించే వారికి మరింత సులభ, చౌక హైవే ప్రయాణాన్ని కల్పించేందుకు కొత్తగా ఫాస్టాగ్ వార్షిక పాసును నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) తీసుకొచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా గతేడాది ఆగస్టు 15 నుంచి దీన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ప్రైవేట్ కారు, జీపు, వ్యాను యజమానులు రూ.3 వేలతో కొనుగోలు చేసే ఈ పాస్ టోల్‌ప్లాజాకు సగటున రూ.15తో ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు చెల్లుబాటు అవుతుంది.
ఇది ఏడాది వరకే చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ గరిష్ఠ పరిమితి (200 టోల్ క్రాసింగ్‌లు) ఏడాదిలోపలే ముగిసిపోతే ఆటోమేటిక్‌గా సాధారణ విధానంలోకి ఫాస్టాగ్ మారిపోయి డబ్బు చెల్లించి టోల్ దాటవలసి ఉంటుంది. మళ్లీ కావాలంటే వార్షిక టోల్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక ఈ వార్షిక పాస్ విధానానికి వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటివరకు సుమారు 52 లక్షల మందికిపైగా వాహనదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని సంబంధిత అధికారులు తెలిపారు.
Also Read..
దాడులను పెంచిన ఇరాన్.. బాగ్దాద్‌లోని యూఎస్ ఎంబసీపై డ్రోన్ అటాక్
సౌదీ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. దెబ్బతిన్న 5 అమెరికా రీఫ్యూయలింగ్ విమానాలు
స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ హల్దీ ఫంక్షన్.. డ్యాన్స్‌తో ఆకట్టుకున్న చాహల్
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CS Sanjay Jaju | సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం.. ఎజెండా అంశాలపై సమీక్షించిన సీఎస్
- ●Ponguleti Srinivas Reddy | పేదల భూములు మింగిన వారిని వదిలిపెట్టం.. నిషేధిత జాబితాలో ఎంత చేరిందో తేలుస్తం
- ●Maheshkumar Goud | మీడియా సంస్థలు స్వతంత్రంగా ఉండాలి.. లేదంటే నిజాలు బయటికి రావ్
- ●Liquor Shops | హైదరాబాద్‌లో రెండు రోజులు వైన్స్ బంద్
- ●Guppedantha Manasu Sequel | రిషికి ఐ లవ్ యూ చెప్పిన వసుధార - గుప్పెడంత మనసు 2 పై అప్డేట్?
- ●Ponnam Prabhakar | సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి పొన్నం కృతజ్ఞతలు

CS Sanjay Jaju | సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం.. ఎజెండా అంశాలపై సమీక్షించిన సీఎస్

Ponguleti Srinivas Reddy | పేదల భూములు మింగిన వారిని వదిలిపెట్టం.. నిషేధిత జాబితాలో ఎంత చేరిందో తేలుస్తం

Maheshkumar Goud | మీడియా సంస్థలు స్వతంత్రంగా ఉండాలి.. లేదంటే నిజాలు బయటికి రావ్

Liquor Shops | హైదరాబాద్‌లో రెండు రోజులు వైన్స్ బంద్






