Ponguleti Srinivas Reddy | పేదల భూములు మింగిన వారిని వదిలిపెట్టం.. నిషేధిత జాబితాలో ఎంత చేరిందో తేలుస్తం
Ponguleti Srinivas Reddy | కేంద్ర పైసలు ఇయ్యాకున్నా ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ బిల్లులు చెల్లిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని పేదల భూములు, ప్రభుత్వ భూములను అక్రమంగా కాజేసిన వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు.
- అక్రమాలను బయటపెట్టేందుకు ఫాస్ట్‌ట్రాక్ విచారణ
- భూముల ధరల సవరణతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం 20% పెరిగింది
- త్వరలో అసైన్డ్ భూములపై సమగ్ర విధాన నిర్ణయం
- కేంద్రం పైసలు ఇయ్యకున్నా ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు చెల్లిస్తం
- సచివాలయ మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్: కేంద్ర పైసలు ఇయ్యాకున్నా ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ బిల్లులు చెల్లిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని పేదల భూములు, ప్రభుత్వ భూములను అక్రమంగా కాజేసిన వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ధరణి నుంచి భూభారతి వరకు జరిగిన ప్రతి భూ లావాదేవీని ఫాస్ట్‌ట్రాక్ విధానంలో విచారిస్తున్నామని, అక్రమాలకు పాల్పడిన వారెవరైనా చట్టం ముందు నిలబెట్టడం ఖాయమని హెచ్చరించారు. శనివారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.
కొత్తగా సెంటు భూమి కూడా చేర్చలే..
గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకొని భారీ స్థాయిలో భూ అక్రమాలు, అక్రమ మ్యుటేషన్లు, ప్రభుత్వ భూముల బదిలీలు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రతి వ్యవహారాన్ని ఆధారాలతో సహా పరిశీలిస్తున్నామని చెప్పారు. అన్ని నిజాలను ప్రజల ముందుంచుతామన్నారు. అంతేగాక ఎవరి హయాంలో ఎంత భూమి నిషేధిత జాబితాలో చేరిందో తేలుస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు నిషేధిత జాబితాలో ఎంత భూమి ఉంది? ఆ భూములను ఎవరు, ఎప్పుడు, ఏ కారణాలతో చేర్చారు? తర్వాత ఎందుకు తొలగించారు? అనే ప్రతి అంశంపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కూడా అదే స్థాయిలో పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు. కొత్తగా ఒక్క సెంటు భూమి కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదు.
ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా అంగుళం భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదని మంత్రి స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ధరణి పోర్టల్‌లో ఉన్న జాబితానే కోర్టుకు సమర్పించామని, వివాదాలు లేని ప్రైవేట్ ఆస్తులు లేదా ప్లాట్లను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు.
276 గ్రామాల్లో సర్వే పూర్తయింది..
రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం రీసర్వే చేపట్టిందని తెలిపారు. ఇప్పటికే 276 గ్రామాల్లో సర్వే పూర్తైందని, ప్రతి సర్వే నంబర్‌కు ఆధార్ తరహాలో ప్రత్యేక భూధార్ నంబర్ కేటాయిస్తామని చెప్పారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, కేవలం రెండు శాతం మాత్రమే అభ్యంతరాలు వచ్చాయని వివరించారు.
రాష్ట్రంలో సుమారు 85 వేల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని, వాటి విషయంలో సమగ్ర విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని కోణాల్లో ప్రభుత్వం చర్చిస్తోందని తెలిపారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని, ఎవరికీ అనుకూలంగా లేదా వ్యతిరేకంగా వ్యవహరించే ప్రశ్నే లేదని మంత్రి స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే ప్రతి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
క్యూర్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ను చూసి బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. కొల్లూరులో గత ప్రభుత్వం నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లలో వర్షం వస్తే నీళ్లు కారుతున్నాయని మీడియా దృష్టికి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అది గత ప్రభుత్వ నాణ్యతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆ ఇళ్లను కూడా మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోయినా, లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఫైనల్ బిల్లులు చెల్లిస్తుందని మంత్రి ప్రకటించారు.
భూముల మార్కెట్ విలువల సవరణ తర్వాత ప్రభుత్వం అంచనా వేసిన దానికంటే 10 నుంచి 20 శాతం వరకు అధిక ఆదాయం వచ్చిందని మంత్రి తెలిపారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వార్షిక ఆదాయం సుమారు రూ.13 వేల కోట్లు ఉండగా, గత ఏడాది అది రూ.15 వేల కోట్లకు చేరిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.18 వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని మంత్రి పొంగులేటి తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ
ఆగస్టు 6, 2026

Rakesh Reddy | 2028లో నేనే, 2033లో కూడా నేనే.. ఎంతసేపు ఇదే ధ్యాసనా రేవంత్?
ఆగస్టు 6, 2026

ABVP Protest | హైడ్రా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు.. వెంటనే ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●Horoscope | ఆగస్టు 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలం!
- ●India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!
- ●Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!
- ●GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు
- ●Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ
- ●Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!

Horoscope | ఆగస్టు 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలం!

India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!

Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!

GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు



