Ponnam Prabhakar | సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి పొన్నం కృతజ్ఞతలు
Ponnam Prabhakar | రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు.
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చేసిన న్యాయపోరాటం ఫలితంగానే ఈ తీర్పు వచ్చిందని మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ, న్యాయ నిపుణుల సహకారంతో సుప్రీంకోర్టులో సమర్థవంతమైన వాదనలు వినిపించామని తెలిపారు. ఈ తీర్పు మూడు కీలక ప్రాజెక్టులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని మంత్రి చెప్పారు. గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు అనేక ప్రాంతాల తాగునీటి అవసరాలు తీరనున్నాయని పేర్కొన్నారు. రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని అన్నారు. తెలంగాణ హక్కుల పరిరక్షణలో సీఎం రేవంత్‌రెడ్డి చూపిన చొరవ, ప్రభుత్వం చేసిన న్యాయపోరాటం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడిందని మంత్రి కొనియాడారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Smart Ration Cards | స్మార్ట్ రేషన్‌కార్డులు వచ్చేస్తున్నయ్.. 15న సంగారెడ్డిలో పంపిణీకి శ్రీకారం చుట్టనున్న సీఎం..!
ఆగస్టు 7, 2026

Aadhaar Verification | ఐఎఫ్‌ఎంఐఎస్‌లో ‘డబుల్ పే’ దందా.. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
ఆగస్టు 7, 2026

MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●Smart Ration Cards | స్మార్ట్ రేషన్‌కార్డులు వచ్చేస్తున్నయ్.. 15న సంగారెడ్డిలో పంపిణీకి శ్రీకారం చుట్టనున్న సీఎం..!
- ●Aadhaar Verification | ఐఎఫ్‌ఎంఐఎస్‌లో 'డబుల్ పే' దందా.. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
- ●Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్‌లో నయనతార రెండు సినిమాలు రిలీజ్
- ●MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Smart Ration Cards | స్మార్ట్ రేషన్‌కార్డులు వచ్చేస్తున్నయ్.. 15న సంగారెడ్డిలో పంపిణీకి శ్రీకారం చుట్టనున్న సీఎం..!

Aadhaar Verification | ఐఎఫ్‌ఎంఐఎస్‌లో 'డబుల్ పే' దందా.. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్‌లో నయనతార రెండు సినిమాలు రిలీజ్

MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు



