Guppedantha Manasu Sequel | రిషికి ఐ లవ్ యూ చెప్పిన వసుధార – గుప్పెడంత మనసు 2 పై అప్‌డేట్?
లాంగ్ గ్యాప్ తర్వాత రిషి, వసుధార జోడీ మళ్లీ బుల్లితెర ప్రేక్షకుల ముందుకొచ్చింది. వీరిద్దరు కలిసి ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకు గెస్ట్‌లుగా వచ్చారు. ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో రిషికి వసుధార ఐ లవ్ యూ చెప్పడం ఆకట్టుకుంటోంది.
Entertainment | Published On Aug 1, 2026, 6.12 pm IST
Guppedantha Manasu Sequel | గుప్పెడంత మనసు సీరియల్‌తో రిషి, వసుధార జోడీ ఫేమస్ అయ్యింది. స్టార్ మాలో (Star Maa Serial) టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ పెద్ద సక్సెస్ కావడానికి వీరిద్దరి కెమిస్ట్రీనే కారణమైంది. రిషి పాత్రలో ముఖేష్ గౌడ (Mukesh Gowda ), వసుధార క్యారెక్టర్‌లో రక్షా గౌడ (Raksha Gowda) నటించారు. దాదాపు నాలుగేళ్ల పాటు టెలికాస్ట్ అయిన ఈ సీరియల్‌కు 1168 ఎపిసోడ్స్‌తో ఎండ్ చేశారు. గుప్పెడంత మనసును అర్ధాంతరంగా ముగించడంతో రిషి, వసుధార ఫ్యాన్స్ డిసపాయింట్ అయ్యారు.
గెస్ట్‌లుగా...
గుప్పెడంత మనసు తర్వాత రిషి, వసుధార కాంబినేషన్‌లో మరో సీరియల్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ చాలా రోజులుగా కోరుకుంటున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ జోడీ మళ్లీ బుల్లితెర ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే సీరియల్‌లో కాదు...ఓ టీవీ షోకు వీరిద్దరు గెస్ట్‌లుగా వచ్చారు. స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ వారం ఎపిసోడ్‌లో టీవీ సీరియల్ యాక్టర్స్‌తో పాటు డిజిటల్ స్టార్స్ గెస్ట్‌లుగా రాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.
ఐ లవ్ యూ...
ఈ ప్రోమోకు వసుధార, రిషి ఇద్దరూ స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించారు. గుప్పెడంత మనసులోని కొన్ని సీన్లను రీక్రియేట్ చేశారు. రిషికి వసుధార ఐ లవ్ యూ చెప్పింది. రిషి నువ్వు నా లైఫ్‌లోకి వస్తే ఫుల్ ఖుషి. ఐ లవ్ యూ రిషి సార్ అంటూ వసుధార చెప్పడం ప్రోమోలో ఆసక్తిని పంచింది. రిషిధారల జోడీ బాగుందని, వీరిద్దరి కాంబినేషన్‌లో గుప్పెడంత మనసు 2 రావాలి అంటూ ఈ ప్రోమోను ఉద్దేశించి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆగస్ట్ 2న ప్రసారం కానున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఎపిసోడ్‌లో గుప్పెడంత మనసు సీరియల్ సీక్వెల్‌పై అనౌన్స్‌మెంట్ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.
మానస్ నాగులపల్లి, శ్రీహాన్
ఈ ఎపిసోడ్‌కు ముఖేష్ గౌడ, రక్షా గౌడతో పాటు శ్రీహాన్, మానస్ నాగులపల్లి, సమీరా, బిగ్‌బాస్ రాము రాథోడ్ తదితరులు గెస్ట్‌లుగా వచ్చారు. ఈ ప్రోమో వైరల్ అవుతోంది.
;
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bigg Boss Agnipariksha | బిగ్‌బాస్ అగ్నిపరీక్ష లాంఛింగ్ డేట్ చెప్పేసిన కళ్యాణ్ పడాల – వీడియోతో సర్ప్రైజ్
ఆగస్టు 3, 2026

Telugu Serials | తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ – గుండె నిండా గుడి గంటలు టాప్ – కార్తీక దీపం 2 డౌన్
జూన్ 25, 2026

Trp Rating | బుల్లితెరపై కూడా డిజాస్టర్ – ఎన్టీఆర్ వార్ 2కు షాకింగ్ టీఆర్పీ రేటింగ్ – మరీ అంత తక్కువా!
మే 14, 2026
తాజావార్తలు
- ●Constable Suicide | ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఆత్మహత్య
- ●Lake Development | CSR నిధులతో చెరువులను అభివృద్ధి చేద్దాం: ఎంఏయూడీ
- ●Cristiano Ronaldo | పదేండ్లుగా డేటింగ్.. ఎట్టకేలకు వివాహబంధంలోకి రొనాల్డో
- ●SBI Recruitment | SBI జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్.. 9,124 పోస్టులకు దరఖాస్తులు షురూ
- ●‘హస్తం’ గూటిలో ‘గులాబీ’ల త్రిశంకు స్వర్గం: అభివృద్ధి ఆశలు.. గౌరవం గల్లంతు: ఫిరాయింపు నేతల రాజకీయ తంటాలు!
- ●Horoscope | ఆగస్టు 12 రాశిఫలాలు.. ఈ రాశి వారు పాత మిత్రులను తిరిగి కలుస్తారు!

Constable Suicide | ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఆత్మహత్య

Lake Development | CSR నిధులతో చెరువులను అభివృద్ధి చేద్దాం: ఎంఏయూడీ

Cristiano Ronaldo | పదేండ్లుగా డేటింగ్.. ఎట్టకేలకు వివాహబంధంలోకి రొనాల్డో

SBI Recruitment | SBI జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్.. 9,124 పోస్టులకు దరఖాస్తులు షురూ



