RRR | ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగం పనులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.. రెండు ప్యాకేజీల్లో పనులు
RRR | రీజినల్ రింగు రోడ్డు (RRR) ప్రాజెక్టులో ఎట్టకేలకు కదలిక వచ్చింది. రెండేండ్లుగా ఊరిస్తున్న ఉత్తరభాగం పనులకు (Northern Corridor) కేంద్రం అనుమతించింది.
RRR | త్రినేత్ర.న్యూస్: రీజినల్ రింగు రోడ్డు (RRR) ప్రాజెక్టులో ఎట్టకేలకు కదలిక వచ్చింది. రెండేండ్లుగా ఊరిస్తున్న ఉత్తరభాగం పనులకు (Northern Corridor) కేంద్రం అనుమతించింది. అయితే గతంలో ఉన్న 5 ప్యాకేజీల విధానాన్ని 2 ప్యాకేజీలకు కుదించింది. ఈ పనులకు సంబంధించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగడపల్లి వరకు మొత్తం 161.518 కిలోమీటర్ల మేర ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ రీజినల్ ఎక్స్‌ప్రెస్‌వేని అభివృద్ధి చేయనుంది. దీనికి రూ.9,362.4 కోట్ల (సివిల్ పనులు) వ్యయం కానుంది.

రెండు ప్యాకేజీలుగా పనులు..
- ప్యాకేజీ-1లో (83.518 కి.మీ.)- సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వరకు పనులు చేపడతారు. దీని అంచనా వ్యయం రూ.4,918.71 కోట్లు.
- ప్యాకేజీ-2లో (78 కి.మీ.)- ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగడపల్లి వరకు పనులు ప్రారంభంచనున్నారు. దీని అంచనా వ్యయం రూ.4,443.69 కోట్లు.
మూడేండ్లలో అందుబాటులోకి..
వీటికోసం NHAI విడివిడిగా టెండర్లు ఆహ్వానించింది. జూలై 7న ఉదయం 11 గంటల వరకు బిడ్‌లను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. అదే నెల 8న సాంకేతిక బిడ్‌లు తెరుస్తారు. డిజైన్, బిల్ట్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (DBOT యాన్యుటీ లేదా హైబ్రిడ్ యాన్యుటీ ) ప్రాతిపదికన పనులు చేపట్టాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది. బిడ్‌లు తెరిచి టెండర్ ఖరారు చేసిన అనంతరం లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ అందిన మూడేండ్లలో పనులను పూర్తి చేయాలి. ఎలాంటి అడ్డంకులు లేకపోతే 2029 నాటికి ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగం అందుబాటులోకి రానుంది.
ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేని గంటకు 120 కి.మీ. వేగంతో ప్రయాణించేలా నిర్మించనున్నారు. ప్రాజెక్టులో భాగంగా పెద్ద వంతెనలు 44, చిన్న వంతెనలు 127, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు 4, అండర్‌పాసులు 44, కల్వర్టులు 1,262, టోల్‌ప్లాజాలు 9 నిర్మించనున్నారు. మొత్తం 9 ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం కానుంది. ఆరు చోట్ల విశ్రాంత గదులను ఏర్పాటు చేస్తారు. ఈ రహదారికి 1,933.20 హెక్టార్ల భూసేకరణ చేశారు.
ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం స్తూలంగా..
- మొత్తం పొడవు- 161.518 కిలోమీటర్లు
- రహదారి రకం- 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే
- మొత్తం బడ్జెట్ (సివిల్)- రూ.9,362.4 కోట్లు
- నిర్మాణ విధానం- DBOT (యాన్యుటీ / హైబ్రిడ్ యాన్యుటీ)
- మొత్తం భూసేకరణ- సుమారు 1,814.38 హెక్టార్లు
తాజావార్తలు
- ●WABA | తల్లి పాలే శిశువుకు తొలి టీకా
- ●Peddi Sudarshan Reddy | 'పెద్ది' ఉద్యమ స్ఫూర్తిని ఎప్పటికీ మరువబోం : తన్నీరు మహేశ్
- ●H-FAST Raids | అక్కడే గుట్కా ఉమ్మి.. అక్కడే అప్పడాలు తయారు చేస్తున్నారు
- ●Sai Pallavi | సాయిపల్లవి మళ్లీ తప్పు చేస్తోందా? - మణిరత్నం సినిమా హాలీవుడ్ రీమేక్ అంటూ రూమర్లు
- ●Gattu Ramachander Rao | తాంత్రిక విద్యలతో ఆ ముగ్గురిని మట్టుబెట్టాలని చూస్తున్నావా..?
- ●CS Sanjay Jaju | సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం.. ఎజెండా అంశాలపై సమీక్షించిన సీఎస్

WABA | తల్లి పాలే శిశువుకు తొలి టీకా

Peddi Sudarshan Reddy | 'పెద్ది' ఉద్యమ స్ఫూర్తిని ఎప్పటికీ మరువబోం : తన్నీరు మహేశ్

H-FAST Raids | అక్కడే గుట్కా ఉమ్మి.. అక్కడే అప్పడాలు తయారు చేస్తున్నారు

Sai Pallavi | సాయిపల్లవి మళ్లీ తప్పు చేస్తోందా? - మణిరత్నం సినిమా హాలీవుడ్ రీమేక్ అంటూ రూమర్లు






