Fastag Annual Pass | ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త..
Fastag Annual Pass | నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వాహనదారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఫాస్టాగ్ వార్షిక పాస్ సేవల పేరిట కొందరు నకిలీ వెబ్ సైట్లను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించింది. ఈ వెబ్‌సైట్లలో ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయని తెలిపింది.
Technology | Published On Apr 26, 2026, 11.27 am IST
Fastag Annual Pass | నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వాహనదారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఫాస్టాగ్ వార్షిక పాస్ సేవల పేరిట కొందరు నకిలీ వెబ్ సైట్లను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించింది. ఈ వెబ్‌సైట్లలో ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయని తెలిపింది. ఫాస్టాగ్ అధికారిక ప్లాట్‌ఫామ్‌లను పోలి ఉండే ఈ వెబ్‌సైట్లు వాహనదారులను మోసం చేస్తున్నాయని, దుండగులు డబ్బులు దోచుకుంటున్నారని అధికారులు హెచ్చరించారు. NHAI తెలిపిన వివరాల ప్రకారం కొందరు మోసగాళ్లు ఫాస్టాగ్ అసలు వెబ్‌సైట్లను పోలి ఉండే నకిలీ వెబ్‌సైట్లను చాలా తేలిగ్గా క్రియేట్ చేస్తున్నారని, సెర్చ్ ఇంజిన్‌లలో ఉండే లూప్ హోల్స్‌ను ఆసరాగా చేసుకుని తమ వెబ్‌సైట్లు అసలు సైట్ల కన్నా ముందే సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చేలా చేస్తున్నారని తెలిపారు. అలాగే సెర్చ్ రిజల్ట్స్‌లో పై స్థానాల్లో కనిపించేలా కొందరు మోసగాళ్లు ఏకంగా అడ్వర్టయిజ్‌మెంట్లను ఇస్తున్నారని, ఎస్ఈవో టెక్నిక్స్‌ను సైతం ఉపయోగిస్తున్నారని తెలిపారు.
రెండు విధాలుగా నష్టం..
మోసగాళ్లు అలా చేస్తుండడం వల్ల వాహనదారులు చాలా వరకు నకిలీ సైట్లలోకి ప్రవేశిస్తున్నారని అధికారులు తెలిపారు. దీంతో వాహనదారులు అవి నిజమైన సైట్లే అని నమ్మి వాటిల్లో తమ వివరాలను నమోదు చేస్తున్నారని, ముఖ్యంగా ఫోన్ నంబర్, వాహన రిజిస్ట్రేషన్ వివరాలను ఎంటర్ చేస్తున్నారని, తరువాత చెల్లింపులు చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో వాహనదారుల ఖాతా లేదా కార్డు నుంచి ఆ తరువాత డబ్బు కాజేస్తున్నారని తెలిపారు. అలాగే చెల్లింపుల ద్వారా వచ్చే మొత్తాన్ని మోసగాళ్లు తమ ఖాతాలకు బదిలీ చేసుకుంటున్నారని తెలిపారు. ఇలా చాలా సంఘటనలు ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్నాయని, వాహనదారులకు వెబ్ సైట్ నిజమైందా, నకిలీదా అని ధ్రువీకరించుకోవడం కష్టంగా మారిందని తెలిపారు. దీని వల్ల సరైన ఫాస్టాగ్ వార్షిక పాస్ లభించకపోవడమే కాకుండా, డబ్బులను కూడా నష్టపోతున్నారని తెలిపారు.
https://twitter.com/NHAI_Official/status/2046914415216464146
ఈ సూచనలు పాటించాలి..
ఈ మోసాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ వాహనదారులకు పలు హెచ్చరికలు, సూచనలు జారీ చేసింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించే వాహనదారులు తాము ఓపెన్ చేసే వెబ్‌సైట్ల అడ్రస్‌లను ముందుగా తనిఖీ చేయాలని సూచించింది. అసలు ఫాస్టాగ్ ప్లాట్‌ఫామ్‌లను పోలి ఉండే పేర్లతోనే నకిలీ సైట్లు ఉంటాయని, ఒక్క అక్షరం తేడాతో వెబ్‌సైట్లను సృష్టిస్తారని తెలిపింది. అందువల్ల వాహనదారులు తాము సందర్శించే ఫాస్టాగ్ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన యూఆర్ఎల్ అడ్రస్‌ను పూర్తిగా చెక్ చేయాలని, దీంతో మోసాలను నివారించవచ్చని తెలిపింది. అలాగే వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్లలో అధికారిక యాప్ లను ఉపయోగించాలని, వీటితో ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలియజేసింది. ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసే సమయంలో వచ్చే రిజల్ట్స్ లో ఇలాంటి సంఘటనల్లో చాలా వరకు నకిలీ సైట్లు ఉండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని తెలిపింది. వాహనదారులు స్పాన్సర్డ్ లింకులను, అనుమానాస్పద ప్రకటనలను క్లిక్ చేయవద్దని తెలిపింది. వెబ్‌సైట్ అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే క్లోజ్ చేయాలని, ఎలాంటి లావాదేవీలను నిర్వహించకూడదని, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచనలు జారీ చేసింది.
తాజావార్తలు
- ●టెసరాక్ట్ వర్సెస్ ఫామ్‌హౌస్‌లు.. ఒకరి ఆరోపణకు మరొకరి ఆస్తులే సమాధానమా?
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లో జోరు.. 564 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..
- ●Prakash Raj | విజయ్ విషయంలో నాకు చాలా సందేహాలు ఉన్నాయి.. టీవీకే పాలనపై ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ●Sanjay Jaju | అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం
- ●BSNL | కేవలం రూ.51కే 28 రోజుల ప్లాన్.. రోజూ 2జీబీ డేటా.. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్..
- ●High Court issues Notices | ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు

టెసరాక్ట్ వర్సెస్ ఫామ్‌హౌస్‌లు.. ఒకరి ఆరోపణకు మరొకరి ఆస్తులే సమాధానమా?

Stock Markets | స్టాక్ మార్కెట్లో జోరు.. 564 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..

Prakash Raj | విజయ్ విషయంలో నాకు చాలా సందేహాలు ఉన్నాయి.. టీవీకే పాలనపై ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Sanjay Jaju | అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం






