CS Sanjay Jaju | సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం.. ఎజెండా అంశాలపై సమీక్షించిన సీఎస్
CS Sanjay Jaju | సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం త్వరలో జరుగనున్నది. ఈ భేటీలో తెలంగాణ తరఫున ప్రస్తావించాల్సిన అంశాలు, ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమీక్ష నిర్వహించారు. శనివారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రానున్న మండలి సమావేశ అజెండాపై చర్చించారు.
CS Sanjay Jaju | సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం త్వరలో జరుగనున్నది. ఈ భేటీలో తెలంగాణ తరఫున ప్రస్తావించాల్సిన అంశాలు, ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమీక్ష నిర్వహించారు. శనివారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రానున్న మండలి సమావేశ అజెండాపై చర్చించారు. ఆగస్టు 20న చెన్నైలోని మహాబలిపురంలో జరగనున్న సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలను సీఎస్ పరిశీలించారు. తెలంగాణకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఆయా శాఖలు సమగ్రంగా పరిశీలించి, అవసరమైన వివరాలతో సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.
అంతర్రాష్ట్ర, ప్రాంతీయ సమస్యలకు సంబంధించి కౌన్సిల్‌లో చర్చకు తీసుకురావాల్సిన కీలక అంశాలను గుర్తించాలని ప్రణాళిక శాఖను సీఎస్ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న అంశాలపై వెంటనే స్పందించి, వాటికి సంబంధించిన సమాధానాలను రెండు రోజుల్లోగా సిద్ధం చేయాలని సూచించారు. తెలంగాణ ప్రతిపాదనలు, సిఫార్సులను ఖరారు చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సంజయ్ జాజు పేర్కొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మార్గదర్శనం కోసం ప్రతిపాదనలను సమర్పించాలని సూచించారు. సమావేశంలో సీనియర్ అధికారులు వికాస్ రాజ్, సబ్యసాచి ఘోష్, గౌరవ్ ఉప్పల్, ఈ శ్రీధర్, క్రిస్టినా చోంగ్తు తదితరులు పాల్గొన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన అజెండా అంశాలు, చేపడుతున్న సన్నాహక చర్యలను సీఎస్‌కు వివరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Smart Ration Cards | స్మార్ట్ రేషన్‌కార్డులు వచ్చేస్తున్నయ్.. 15న సంగారెడ్డిలో పంపిణీకి శ్రీకారం చుట్టనున్న సీఎం..!
ఆగస్టు 7, 2026

Aadhaar Verification | ఐఎఫ్‌ఎంఐఎస్‌లో ‘డబుల్ పే’ దందా.. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
ఆగస్టు 7, 2026

MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●Smart Ration Cards | స్మార్ట్ రేషన్‌కార్డులు వచ్చేస్తున్నయ్.. 15న సంగారెడ్డిలో పంపిణీకి శ్రీకారం చుట్టనున్న సీఎం..!
- ●Aadhaar Verification | ఐఎఫ్‌ఎంఐఎస్‌లో 'డబుల్ పే' దందా.. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
- ●Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్‌లో నయనతార రెండు సినిమాలు రిలీజ్
- ●MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Smart Ration Cards | స్మార్ట్ రేషన్‌కార్డులు వచ్చేస్తున్నయ్.. 15న సంగారెడ్డిలో పంపిణీకి శ్రీకారం చుట్టనున్న సీఎం..!

Aadhaar Verification | ఐఎఫ్‌ఎంఐఎస్‌లో 'డబుల్ పే' దందా.. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్‌లో నయనతార రెండు సినిమాలు రిలీజ్

MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు



