SWP | జాబ్ చేస్తున్నా సరే.. SIPలో ఇలా చేస్తే రిటైర్మెంట్ వయస్సుకు చేతిలో కోట్లు ఉంటాయి..
SWP | ఉద్యోగం లేదా వ్యాపారం ఏది చేసినా సరే చాలా మంది తమకు లభించే ఆదాయంలో ఎంతో కొంత డబ్బును పొదుపు చేస్తుంటారు. ప్రస్తుత కాలంలో ఎఫ్‌డీ వంటి సంప్రదాయ పొదుపు విధానాలు కాకుండా చాలా మంది మ్యుచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.
SWP | ఉద్యోగం లేదా వ్యాపారం ఏది చేసినా సరే చాలా మంది తమకు లభించే ఆదాయంలో ఎంతో కొంత డబ్బును పొదుపు చేస్తుంటారు. ప్రస్తుత కాలంలో ఎఫ్‌డీ వంటి సంప్రదాయ పొదుపు విధానాలు కాకుండా చాలా మంది మ్యుచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఎఫ్‌డీ లాంటి పొదుపు విధానం అయితే గరిష్టంగా ఏడాదికి కేవలం 7 నుంచి 8 శాతం రిటర్న్స్ మాత్రమే వస్తాయి. కానీ మ్యుచువల్ ఫండ్స్‌లో ఏడాదికి కనీసం రిటర్న్స్ 12 శాతం మేర ఉంటాయి. ఫండ్ ఇంకా వృద్ధి చెందితే రెట్టింపు మొత్తంలో రిటర్న్స్ కూడా పొందవచ్చు. అందుకనే చాలా మంది మ్యుచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెడుతున్నారు. ఇందులో రెండు రకాల పద్ధతులు ఉంటాయి. నెల నెలా కట్టే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)తోపాటు ఒకేసారి భారీ ఎత్తున పెట్టుబడి పెట్టే లంప్సమ్ ఆప్షన్ కూడా మ్యుచువల్ ఫండ్స్‌లో ఉంటుంది. ఎవరి స్థోమతకు తగినట్లు వారు సిప్ లేదా లంప్సమ్ పద్ధతులను ఎంచుకుని పెట్టుబడి పెడుతుంటారు. అయితే మ్యుచువల్ ఫండ్స్‌లో చాలా మంది పెట్టుబడులు పెడతారు. కానీ స్మార్ట్‌గా ఆలోచించి పెడితే భారీ ఎత్తున రాబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
స్మార్ట్ పెట్టుబడులు ముఖ్యం..
సాధారణ ఇన్వెస్టర్లు కేవలం పెట్టుబడి పెట్టి వదిలేస్తారు. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్లు పకడ్బందీ వ్యూహాలను అమలు చేస్తారు. చిన్న చిన్న మార్పులే భారీ ఎత్తున రాబడులను తీసుకువస్తాయి. ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం సరైందే అయినప్పటికీ సాధారణ ఇన్వెస్టర్ నెల నెలా పెట్టుబడి పెడుతూ వెళ్తాడు. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్ మాత్రం ప్రతి ఏడాది జీతం లేదా ఆదాయం పెరిగితే అందులో కాస్త మొత్తాన్ని సిప్ కోసం పెంచుతాడు. దీన్నే స్టెప్ అప్ సిప్ అంటారు. ఈ ఒక్క చిన్న మార్పే దీర్ఘకాలంలో భారీ ఎత్తున సంపదను సృష్టించేందుకు కారణమవుతుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉద్యోగావకాశాలు పెరగడంతో చాలా మంది ప్రస్తుతం చాలా చిన్న వయస్సులోనే పెట్టుబడులను మొదలు పెడుతున్నారు. గతంలో 40 ఏళ్లు వస్తేగానీ పొదుపు ప్రారంభించే వారు కాదు. కానీ ఇప్పుడు 25 ఏళ్ల వారు కూడా యాక్టివ్‌గా స్టాక్ మార్కెట్‌లలో పాల్గొంటున్నారు. చిన్న వయస్సులో పెట్టుబడి పెట్టడం వల్ల తక్కువ వయస్సులోనే రిటైర్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. గతంలో 60 ఏళ్లకు రిటైర్ అయ్యేవారు. కానీ ఇప్పటి తరం 45 ఏళ్లకే రిటైర్ అవ్వాలని చూస్తున్నారు. అందులో భాగంగానే వారు స్మార్ట్ పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు.

రూ.6.73 కోట్ల వరకు ఫండ్ మిగిలే అవకాశం..
25 ఏళ్ల వయస్సులో పెట్టుబడులు ప్రారంభిస్తే చాలా తక్కువ వయస్సులోనే రిటైర్ అయ్యే అవకాశం ఉండడంతోపాటు భారీ ఎత్తున పొదుపు చేసే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎస్ఐపీతో ప్రతి సంవత్సరం 15 శాతం స్టెప్-అప్ కొనసాగిస్తూ, సగటున 15 శాతం వార్షిక రాబడిని పొందితే, 20 సంవత్సరాల్లో సుమారు రూ.3,64,92,972 (సుమారు రూ.3.65 కోట్లు) సంపాదించవచ్చు. అంటే 45 ఏళ్లకే రిటైర్మెంట్ సాధ్యమవుతుందన్నమాట. రిటైర్మెంట్ తర్వాత ఈ మొత్తాన్ని Systematic Withdrawal Plan (SWP)లో పెట్టుబడి పెడితే సగటున 7 శాతం రాబడి ఆధారంగా నెలకు సుమారు రూ.2 లక్షల పెన్షన్ పొందవచ్చు. అంతేకాకుండా రూ.6.73 కోట్ల వరకు అదనపు ఫండ్ కూడా మిగిలే అవకాశం ఉంటుంది, ఇది భవిష్యత్ వైద్య అవసరాలకు ఉపయోగపడుతుంది.
15 శాతం స్టెప్-అప్ చేయాలి..
ఆప్టిమా మనీ మేనేజర్స్ సీఈవో పంకజ్ మాథ్‌పాల్ తెలిపిన ప్రకారం చాలా మంది ఇన్వెస్టర్లు ఎస్ఐపీ స్టెప్-అప్ ఎంపికను ఉపయోగించకపోవడం వల్ల వారు సాధించగలిగే సంపదలో సగం మాత్రమే పొందుతున్నారని అన్నారు. సెబి-రిజిస్టర్డ్ నిపుణుడు జితేంద్ర సోలంకి ప్రకారం సాధారణంగా 10 శాతం స్టెప్-అప్ సరిపోతుందని, అయితే 45 ఏళ్లకే రిటైర్ కావాలనుకునేవారు కనీసం 15 శాతం స్టెప్-అప్ సిప్ కొనసాగించాలని సూచించారు. ప్రస్తుతం రూ.40వేలతో జీవనం సాగించగలిగే వ్యక్తికి, 7 శాతం ద్రవ్యోల్బణం ఆధారంగా 20 సంవత్సరాల తర్వాత నెలకు సుమారు రూ.2 లక్షలు అవసరం అవుతాయి. అందుకే ముందుగానే సరైన ప్లానింగ్ అవసరం అని వారు చెబుతున్నారు.
ఈ 3 అంశాలు కీలకం..
ఈ ప్రణాళికలో మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఎస్ఐపీ మొత్తాన్ని పెంచడం, దీర్ఘకాలం క్రమశిక్షణతో పెట్టుబడి కొనసాగించడం, రిటైర్మెంట్ తర్వాత SWP ద్వారా స్థిర ఆదాయం పొందడం. చిన్న మార్పులే పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఒక సాదా ఎస్ఐపీని స్టెప్-అప్‌తో కలిపితే, ముందుగానే రిటైర్మెంట్, స్థిరమైన ఆదాయం, ఆర్థిక భద్రత సాధ్యమవుతుంది. స్మార్ట్ ఇన్వెస్టింగ్ అనేది పెద్ద నిర్ణయం కాదు, సరైన సమయంలో సరైన విధంగా పెట్టుబడులు పెట్టడమే. దీన్ని అలవాటు చేసుకుంటే జాబ్ చేసేవారు కూడా రిటైర్మెంట్ వయస్సుకు కోట్ల రూపాయలను పొందవచ్చు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Man Sleeping on Bull | నడి రోడ్డుపై ఎద్దు ఒడిలో హాయిగా నిద్ర.. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ బ్రో.. వీడియో వైరల్
- ●Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కండి
- ●CM Revanth Reddy | కిచెన్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. మనువడి కోసం గుండ్రంగా లేని డజన్ పూరీలు
- ●Monsoon Travel India | ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? భారీ వర్షాలు, వరదల వల్ల ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిన టూరిస్ట్ ప్లేసులివే..!
- ●Janhvi Kapoor | జాన్వీ చేతిపై బాయ్‌ఫ్రెండ్ పేరు - లవ్ స్టోరీని కన్ఫర్మ్ చేసినట్లేనా?
- ●Musi Riverfront | మూసీ రివర్‌ఫ్రంట్ పనులను పరిశీలించిన సీఎస్ సంజయ్ జాజు

Man Sleeping on Bull | నడి రోడ్డుపై ఎద్దు ఒడిలో హాయిగా నిద్ర.. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ బ్రో.. వీడియో వైరల్

Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కండి

CM Revanth Reddy | కిచెన్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. మనువడి కోసం గుండ్రంగా లేని డజన్ పూరీలు

Monsoon Travel India | ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? భారీ వర్షాలు, వరదల వల్ల ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిన టూరిస్ట్ ప్లేసులివే..!






