Super El Niño | భారత్‌కు ‘సూపర్ ఎల్‌నినో’ ముప్పు
Super El Niño | పసిఫిక్ మహాసముద్రంలో సూపర్ ఎల్‌నినో మరింత బలపడుతోంది. ఇది భారత్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో కరువు పెరగడంతో పాటు ఉష్ణోగ్రతలు పెరగే అవకాశం ఉంది. ఫలితంగా వర్షపాతంలో తీవ్ర మార్పులు చోటుచేసుకునే ముప్పు ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావాలతో రైతులు, మత్స్యకారులు, పశుపోషకుల జీవనోపాధిపైనా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
- కరువు, తీవ్ర ఉష్ణోగ్రతలకు అవకాశం
- అడవులు, పగడపు దిబ్బలకూ పెను ముప్పు
- ముందస్తు అధ్యయనాలకు 180 మందికిపైగా శాస్త్రవేత్తల పిలుపు
Super El Niño | పసిఫిక్ మహాసముద్రంలో సూపర్ ఎల్‌నినో మరింత బలపడుతోంది. ఇది భారత్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో కరువు పెరగడంతో పాటు ఉష్ణోగ్రతలు పెరగే అవకాశం ఉంది. ఫలితంగా వర్షపాతంలో తీవ్ర మార్పులు చోటుచేసుకునే ముప్పు ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావాలతో రైతులు, మత్స్యకారులు, పశుపోషకుల జీవనోపాధిపైనా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశానికి చెందిన 180 మందికిపైగా శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు అప్రమత్తమయ్యారు. ఎల్‌నినో ప్రభావాలను ముందుగానే గుర్తించి.. ప్రకృతి వ్యవస్థలు, ప్రజలపై పడే ప్రభావాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా నమోదు చేయాలని పరిశోధకులు, ప్రాంతీయ నిపుణులకు పిలుపునిచ్చారు. పర్యావరణ వ్యవస్థలపై ఇప్పటికే ఉన్న ఒత్తిడిని తగ్గిస్తూ.. మిగిలిన సహజ వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం
ఎల్‌నినో సమయంలో భూమధ్యరేఖకు సమీపంలోని ఉష్ణమండల పసిఫిక్ సముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే వేడెక్కుతాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఆగస్టులో 2.6 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని అంచనాల ప్రకారం ఈ అసాధారణ ఉష్ణోగ్రత వ్యత్యాసం 4 డిగ్రీల సెల్సియస్‌కు మించవచ్చని పేర్కొంటున్నారు. ఇదే జరిగితే గత వెయ్యేళ్లలో నమోదైన అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో ఒకటిగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) కూడా ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులు రానున్న నెలల్లో ‘చాలా బలమైన’ దశకు చేరుకునే అవకాశముందని ఇటీవల పేర్కొంది. ఈ ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది.
పగడపు దిబ్బలకు తీవ్ర నష్టం
సూపర్ ఎల్‌నినో ప్రభావం భారతదేశంలోని సహజ పర్యావరణ వ్యవస్థలపై తీవ్రంగా పడొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పగడపు దిబ్బలు (కోరల్ రీఫ్స్) పెద్దఎత్తున తెల్లబడటం, కొంతమేర పూర్తిగా నశించే పరిస్థితి ఏర్పడొచ్చని చెబుతున్నారు. మరోవైపు అడవుల్లో అగ్ని ప్రమాదాలు పెరగడం, ఉష్ణమండల వర్షారణ్యాల్లోని పెద్ద చెట్లు చనిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. తీవ్రమైన ఎండలు, కరువు పరిస్థితులు వ్యవసాయ రంగంపై ఒత్తిడి పెంచొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతులతో పాటు మత్స్యకారులు, పశుపోషకుల జీవనోపాధిపైనా ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వర్షపాతం, గాలుల దిశల్లో మార్పులు చోటుచేసుకోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు, వరదలు సంభవిస్తే.. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఎండలు, కరువు పరిస్థితులు తలెత్తవచ్చని వివరిస్తున్నారు.
ఇప్పటి నుంచే అధ్యయనం అవసరం..
ఎల్‌నినో ప్రభావాలకు సంబంధించిన ముందస్తు సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో పరిశోధకులు, ప్రాంతీయ నిపుణులు ఇప్పటి నుంచే అధ్యయనాలు ముమ్మరం చేయాలని శాస్త్రవేత్తలు కోరారు. ప్రకృతి వ్యవస్థలతో పాటు ప్రజల జీవన విధానంలో చోటుచేసుకునే మార్పులను క్షేత్రస్థాయిలో నమోదు చేయాలని సూచించారు. భారత ఉష్ణోగ్రతలు, వర్షపాతం, అడవులు, సముద్ర పర్యావరణ వ్యవస్థలు, వ్యవసాయం తదితర రంగాల్లో మార్పులను సమగ్రంగా నమోదు చేయడం ద్వారా భవిష్యత్తులో మరింత వేడిగా, అస్థిరంగా మారే వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు దేశానికి ఉపయోగపడుతుందని భారత ఉష్ణమండల వాతావరణ శాస్త్ర సంస్థ (ఐఐటీఎం)కు చెందిన వాతావరణ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ కోల్ పేర్కొన్నారు. ప్రస్తుతం మిగిలి ఉన్న పర్యావరణ వ్యవస్థలను సంరక్షించడంతో పాటు.. వాటిపై ఇప్పటికే ఉన్న ఒత్తిడిని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.
ఎల్‌నినో అంటే..
ఎల్‌నినో పసిఫిక్ మహాసముద్రంలో సహజంగా సంభవించే వాతావరణ దృగ్విషయం. సాధారణ పరిస్థితుల్లో భూమధ్యరేఖ సమీపంలోని వాణిజ్య పవనాలు (ట్రేడ్ విండ్స్) వెచ్చని సముద్ర జలాలను దక్షిణ అమెరికా వైపు నుంచి ఆసియా, ఆస్ట్రేలియా వైపు తూర్పు నుంచి పడమరకు నెట్టుకుంటూ వెళ్తాయి. దీంతో పసిఫిక్ సముద్రంలోని తూర్పు ప్రాంతాలతో పోలిస్తే పశ్చిమ ప్రాంతాల్లో ఉపరితల జలాలు వెచ్చగా ఉంటాయి. ఎల్‌నినో సమయంలో ఈ పవనాలు బలహీనపడతాయి. దీంతో వెచ్చని నీరు తూర్పు దిశగా పెరూవైపు కదులుతుంది. ఫలితంగా మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్‌లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గణనీయంగా పెరుగుతాయి. ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ, ఉష్ణోగ్రతలు, వర్షపాత నమూనాలను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తే.. మరికొన్ని ప్రాంతాల్లో కరువు, తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aadhaar Biometric | అక్టోబర్ 1 నుంచి గ్యాస్ సబ్సిడీకి ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి..!
సెప్టెంబర్ 19, 2026

CM Revanth Reddy | విద్యార్థుల యూనిఫాంలలో కొత్త డిజైన్లు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
సెప్టెంబర్ 19, 2026

Brahmotsavam | వైభవంగా గరుడ సేవ.. గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
సెప్టెంబర్ 19, 2026
తాజావార్తలు
- ●Dil Raju | వినాయక నిమజ్జనం వేడుకల్లో భార్యతో కలిసి దిల్‌రాజు తీన్మార్ డ్యాన్స్
- ●largest Bar in Hyderabad | హైదరాబాద్ లో అతిపెద్ద బార్.. ఎక్కడుందో తెలుసా
- ●Vardhannapeta | మార్చురీలో శవాన్ని పీక్కతిన్న ఎలుకలు.. ఎక్కడో తెలుసా..?
- ●Sanath Nagar TIMS | సనత్ నగర్ టిమ్స్‌లో చోరీ.. కేసు నమోదు
- ●K Shobha Reddy | సీఎం అపాయింట్మెంట్ కావాలంటే గెస్ట్ హౌస్‌కు రావాలి.. మహిళా పారిశ్రామికవేత్తకు వేధింపులు
- ●CPI Narayana | వరంగల్ ఎయిర్‌పోర్టుకు మాజీ ప్రధాని పీవీ పేరు పెట్టాలి : సీపీఐ నారాయణ

Dil Raju | వినాయక నిమజ్జనం వేడుకల్లో భార్యతో కలిసి దిల్‌రాజు తీన్మార్ డ్యాన్స్

largest Bar in Hyderabad | హైదరాబాద్ లో అతిపెద్ద బార్.. ఎక్కడుందో తెలుసా

Vardhannapeta | మార్చురీలో శవాన్ని పీక్కతిన్న ఎలుకలు.. ఎక్కడో తెలుసా..?

Sanath Nagar TIMS | సనత్ నగర్ టిమ్స్‌లో చోరీ.. కేసు నమోదు



