Apple | యాపిల్ యూజర్లకు బంపర్ ఫీచర్.. ఇకపై డివైస్‌లలో నచ్చిన ఏఐ మోడల్‌ను ఎంచుకోవచ్చు..
Apple | టెక్ దిగ్గజం యాపిల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యూహాన్ని విస్తరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. బ్లూమ్‌బర్గ్‌కు చెందిన మార్క్ గుర్మన్ నివేదిక ప్రకారం యాపిల్ తన సాఫ్ట్‌వేర్ ఎకోసిస్టమ్‌లో యూజర్లకు పలు థర్డ్-పార్టీ ఏఐ మోడళ్లను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించేందుకు సిద్ధమవుతోంది.
Technology | Published On May 6, 2026, 2.20 pm IST
Apple | టెక్ దిగ్గజం యాపిల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యూహాన్ని విస్తరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. బ్లూమ్‌బర్గ్‌కు చెందిన మార్క్ గుర్మన్ నివేదిక ప్రకారం యాపిల్ తన సాఫ్ట్‌వేర్ ఎకోసిస్టమ్‌లో యూజర్లకు పలు థర్డ్-పార్టీ ఏఐ మోడళ్లను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఈ చర్య ద్వారా యాపిల్ తన డివైస్‌లను మరింత ఫ్లెక్సిబుల్, సమగ్ర ఏఐ ప్లాట్‌ఫామ్‌లకు అనుగుణంగా మార్చాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా యూజర్లు టెక్స్ట్, ఇమేజ్ జనరేషన్, ఎడిటింగ్ వంటి పనుల కోసం బాహ్య ఏఐ మోడళ్లను ఉపయోగించవచ్చు. ఇవి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో సమన్వయం చెంది, యాపిల్ సొంత ఏఐ సిస్టమ్‌లకు మించి మరిన్ని సామర్థ్యాలను అందిస్తాయి.
కావల్సిన ఏఐ మోడల్‌ను ఎంచుకోవచ్చు..
ఈ మార్పులో భాగంగా యాపిల్ కొత్తగా ఎక్స్‌టెన్షన్స్ అనే ఫ్రేమ్‌వర్క్‌ను ఐఓఎస్ (iOS) 27లో ప్రవేశపెడుతోంది. ఈ సిస్టమ్ ద్వారా యూజర్లు తమ డివైస్‌లలో ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ల నుంచి ఏఐ ద్వారా పనులను నేరుగా సిస్టమ్ ఫీచర్లలో పూర్తి చేయవచ్చు. ఈ ఎక్స్‌టెన్షన్స్ వ్యవస్థ ద్వారా అవసరమైనప్పుడు యాప్‌లలోని ఏఐ టూల్స్‌ను యాక్సెస్ చేయవచ్చు. Siri, రైటింగ్ టూల్స్, ఇమేజ్ ప్లేగ్రౌండ్ వంటి ఫీచర్లతో సమన్వయమై పనిచేస్తుంది. ఈ విధంగా గూగుల్ కు చెందిన జెమిని, ఆంథ్రోపిక్ క్లాడ్ వంటి ఏఐ మోడళ్లు కూడా యాపిల్ ప్లాట్‌ఫాంలో పనిచేస్తాయి. దీంతో యూజర్లు తమకు కావల్సిన బాహ్య ఏఐ మోడల్‌ను ఎంచుకుని పనులు పూర్తి చేసుకోవచ్చు.
ఐఓఎస్ 27 యూజర్లకు ముందుగా..
యూజర్లు ఈ ఏఐ మోడళ్లను ఉపయోగించి యాపిల్ సిరి ద్వారా సమాధానాలు పొందడం, టెక్స్ట్ రాయడం లేదా ఎడిట్ చేయడం, ఇమేజ్‌లను సృష్టించడం వంటి పనులు చేసుకోవచ్చు. కాగా యాపిల్ ఇప్పటికే ఆయా ఏఐ ప్లాట్‌ఫామ్‌లతో భాగస్వామ్యం అయినందున దానికి పూర్తి స్థాయి విస్తరణగా ఈ కొత్త సిస్టమ్‌ను భావిస్తున్నారు. ఐఓఎస్ 27తో ఈ వ్యవస్థ మరింత విస్తరించనుండగా, యూజర్లు తాము ఇష్టపడే ఏఐ మోడల్‌ను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ అప్‌డేట్‌లో మరో ముఖ్య ఫీచర్ ఏఐ వాయిస్ కస్టమైజేషన్. వేర్వేరు ఏఐ మోడళ్లు వేర్వేరు వాయిస్‌లతో స్పందించేలా యాపిల్ ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది.
ఐప్యాడ్ ఓఎస్ 27, మాక్ ఓఎస్ 27 యూజర్లకు కూడా..
యాపిల్ సొంత ఏఐ సిస్టమ్ స్పందనలు ఒక సిరి వాయిస్‌లో వస్తాయి. థర్డ్-పార్టీ ఏఐ (ఉదాహరణకు క్లాడ్) వేరే వాయిస్ ఉపయోగిస్తుంది. ఇది యూజర్‌కు ఏ ఏఐ సిస్టమ్ స్పందననో స్పష్టంగా తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. యాపిల్ ఈ కొత్త ఫీచర్లను తన WWDC 2026 సదస్సులో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ జూన్ 8న జరగనుంది. ముందుగా ఐఓఎస్ 27 యూజర్లకు ఈ కొత్త అప్‌డేట్లను ఇస్తారు. ఐప్యాడ్ ఓఎస్ 27, మాక్ ఓఎస్ 27 యూజర్లకు ఈ ఏడాది చివర్లో ఈ ఫీచర్‌ను అందిస్తారు. దీంతో ఐప్యాడ్‌లు, మాక్ సిస్టమ్‌లలోనూ ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. యాపిల్ ఈ చర్య ద్వారా ఏఐ రంగంలో మరింత ఓపెన్, యూజర్-కంట్రోల్ విధానాన్ని అవలంబిస్తూ, తన డివైస్‌లను మల్టీ-ఏఐ ప్లాట్‌ఫామ్‌లుగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఇలా తన డివైస్‌లలో యాపిల్ యూజర్ తనకు కావల్సిన ఏఐ మోడల్‌ను ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తుండడం నిజంగా గొప్ప ఫీచరే అని నిపుణులు చెబుతున్నారు. దీంతో యాపిల్ యూజర్లకు ఎంతో ఉపయోగం ఉంటుందని అంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Google | వినియోగదారులకు షాకిచ్చిన గూగుల్.. యూజర్ల డేటాతో ఏఐ మోడల్స్ ట్రెయినింగ్..?
జులై 8, 2026

Meta | ఇన్స్టాగ్రామ్ ప్రకటనలపై మెటా వివరణ.. చిన్నారుల భద్రత కోసం కోట్ల అకౌంట్లపై చర్యలు..
జులై 8, 2026

WhatsApp | వ్యాపార సంస్థలకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే మెటా బిజినెస్ ఏజెంట్.. కస్టమర్ సర్వీస్ ఇక ఈజీ..
జులై 8, 2026
తాజావార్తలు
- ●Man Sleeping on Bull | నడి రోడ్డుపై ఎద్దు ఒడిలో హాయిగా నిద్ర.. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ బ్రో.. వీడియో వైరల్
- ●Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కండి
- ●CM Revanth Reddy | కిచెన్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. మనువడి కోసం గుండ్రంగా లేని డజన్ పూరీలు
- ●Monsoon Travel India | ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? భారీ వర్షాలు, వరదల వల్ల ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిన టూరిస్ట్ ప్లేసులివే..!
- ●Janhvi Kapoor | జాన్వీ చేతిపై బాయ్‌ఫ్రెండ్ పేరు - లవ్ స్టోరీని కన్ఫర్మ్ చేసినట్లేనా?
- ●Musi Riverfront | మూసీ రివర్‌ఫ్రంట్ పనులను పరిశీలించిన సీఎస్ సంజయ్ జాజు

Man Sleeping on Bull | నడి రోడ్డుపై ఎద్దు ఒడిలో హాయిగా నిద్ర.. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ బ్రో.. వీడియో వైరల్

Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కండి

CM Revanth Reddy | కిచెన్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. మనువడి కోసం గుండ్రంగా లేని డజన్ పూరీలు

Monsoon Travel India | ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? భారీ వర్షాలు, వరదల వల్ల ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిన టూరిస్ట్ ప్లేసులివే..!



